China Covid: చైనాలో నిమ్మకాయలు, మందుల కోసం ఎగబడుతున్న జనం.. ఇమ్యూనిటీ పెంచుకునేందుకు పాట్లు

చైనాలో కోవిడ్ విజృంభిస్తోంది. ఊహించని స్థాయిలో కోవిడ్ కేసులు, మరణాలు పెరిగిపోతున్నాయి. దీంతో జనాలు భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. ఇమ్యూనిటీ పెంచుకునేందుకు నిమ్మకాయలు, పండ్ల కోసం ఎగబడుతున్నారు.

China Covid: చైనాలో నిమ్మకాయలు, మందుల కోసం ఎగబడుతున్న జనం.. ఇమ్యూనిటీ పెంచుకునేందుకు పాట్లు

China Covid: చైనాలో కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో జనం తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఎవరికి తోచినట్లు వాళ్లు కోవిడ్ నివారణా చర్యలు తీసుకుంటున్నారు. దీనిలో భాగంగా వ్యాధి నిరోధక శక్తిని పెంచడంలో తోడ్పడే నిమ్మకాయల కోసం ఎగబడుతున్నారు. నిమ్మకాయలతోపాటు, విటమిన్-సి ఎక్కువగా ఉండే పండ్లు తెగ కొనేస్తున్నారు.

Ioniq 5 EV: హ్యుందాయ్ సంస్థ నుంచి ‘ఐయానిక్ 5 ఈవీ’ ఎలక్ట్రిక్ కారు.. ఫీచర్స్ ఇవే

అంతేకాదు.. జ్వరం, ఒళ్లు నొప్పులు తగ్గించే మందుల్ని కూడా జనం విపరీతంగా కొంటున్నారు. ఈ నేపథ్యంలో చైనాలోని బీజింగ్, షాంగై వంటి పెద్ద నగరాల్లో నిమ్మకాయలు, పండ్లకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. చాలా మంది వీటి కోసం క్యూ కడుతున్నట్లు స్థానిక మీడియా తెలిపింది. విటమిన్-సి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుందని, దీనివల్ల కోవిడ్ తగ్గుతుందనే ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు చైనాలో వీటికోసం జనాలు ఎగబడుతున్నారు. అయితే, ఇప్పటివరకు వీటి వల్ల కోవిడ్ తగ్గిందని చెప్పేందుకు ఎలాంటి రుజువూ లేదు. మరోవైపు జ్వరం, ఫ్లూ, ఒళ్లు నొప్పులు తగ్గించే మాత్రలకు కూడా డిమాండ్ బాగా పెరిగింది. ఇటీవల చైనా కోవిడ్ నియంత్రణా చర్యల్ని ఎత్తివేసింది.

Kapu Reservation Bill: కాపుల రిజర్వేషన్‌పై కేంద్రం కీలక ప్రకటన.. టీటీపీ ఇచ్చిన 5 శాతం రిజర్వేషన్ చెల్లుబాటు

దీంతో కొద్ది రోజుల్లోనే కోవిడ్ కేసులు విపరీతంగా పెరిగిపోయాయి. రోజూ వేల మంది కోవిడ్ కారణంగా మరణిస్తున్నారు. భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. అక్కడ అంత్యక్రియలు నిర్వహించేందుకు కూడా స్థలం దొరకని పరిస్థితి ఉందంటే కోవిడ్ మరణాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. చైనాతోపాటు జపాన్, దక్షిణ కొరియా, అమెరికా వంటి దేశాల్లోనూ కోవిడ్ కేసులు మరోసారి విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ పరిణామం ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేస్తోంది.