China Space‌ Treatment‌ : అంతరిక్షంలో క్యాన్సర్‌ చికిత్స..!ఒకేసారి 1000 ప్రయోగాలకు చైనా పక్కా ప్లాన్

టెక్నాలజీలో దూసుకుపోతున్న చైనా మరో సంచలనానికి నాంది పలికింది. అంతరిక్షంలో క్యాన్సర్‌ చికిత్స సిద్దమువుతోంది. దీంట్లో పాటు ఒకేసారి 1000 ప్రయోగాలకు చైనా పక్కా ప్లాన్ తో సిద్ధమువుతోంది.

China Space‌ Treatment‌ : అంతరిక్షంలో క్యాన్సర్‌ చికిత్స..!ఒకేసారి 1000 ప్రయోగాలకు చైనా పక్కా ప్లాన్

China Space Treatment

China Space Station To Host 1000 Experiments Includes Cancer Study : ఒకప్పుడు టెక్నాలజీ అంటే గుర్తుకొచ్చే దేశం జపాన్. కానీ ఇప్పుడు చైనా గుర్తుకొస్తుంది. టెక్నాలజీలో చైనా చేసే ప్రయోగాలు సంచలనాత్మకంగా మారాయి. దీంతో ప్రపంచదేశాలు చైనా వైపే దృష్టి సారించేలా వినూత్న ప్రయోగాలతో దూసుకుపోతోది డ్రాగన్ దేశం చైనా. ప్రపంచంలోనే ఏ కొత్త కారు తయారైనా దాంట్లో చైనా తయారు చేసిన పార్టు లేకండా ఏ కారు ఉండదంటే అతిశయోక్తి కాదు.
కృత్రిమంగా ఓ సూర్యుడిని సృష్టించింది అంటే ఇక చైనా గురించి ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. టెక్నాలజీ పరిశ్రమగా మారింది చైనా. ఈ క్రమంలో మరో సంచలనానికి రెడీ అయ్యింది.

తన సొంత స్పేస్‌ స్టేషన్‌ ‘టియాన్‌గోంగ్‌’ ద్వారా క్యాన్సర్ చికిత్స చేయటానికి రెడీ అవుతోంది. అంతేకాదు ఈ స్పేస్‌ స్టేషన్‌ ద్వారా ఒకేసారి వెయ్యి ప్రయోగాలు చేయడానికి పక్కాగా రెడీ అయ్యింది. క్యాన్సర్‌కి ‘స్పేస్‌ ట్రీట్‌మెంట్‌’ కు సంబంధించిన ప్రయోగాలకు సిద్ధమవుతోంది. మెడికల్‌ రీసెర్చ్‌, సాంకేతిక అధ్యయనాలతో పాటుగా వెయ్యి ప్రయోగాలను అదీ ఒకేసారి స్పేస్‌ ఏజెన్సీ ఆధ్వర్యంలో నిర్వహించటానికి చైనా రెడీ అవుతోంది.భూమి నుంచి 388.9 కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేసిన ఈ స్పేస్‌ ఏజెన్సీలోకి ఇంటర్నేషనల్‌ స్పేష్‌ ఏజెన్సీ(ఐఎస్‌ఎస్‌), రష్యా స్పేస్‌ ఏజెన్సీ మిర్‌ లాగా ఇతర దేశాల స్పేస్‌ సైంటిస్టులకు ఎట్టి పరిస్థితుల్లోను అనుమతి ఇవ్వకూడదని చైనా నిర్ణయించుకుంది.

ఇక స్పేస్‌ స్టేషన్‌ ద్వారా ప్రయోగాలకు డిఫరెంట్‌ మాడ్యూల్స్‌ను(ఇప్పటికే మూడు ఉన్నాయి) ఏర్పాటు చేయబోతోంది డ్రాగన్‌ కంట్రీ. నేచర్‌ కథనం ప్రకారం.. హై ఎనర్జీ కాస్మిక్‌ రేడియేషన్‌ను గుర్తించడానికి 1-2బిలియన్ల యువాన్లను(దాదాపు 310 బిలియన్‌ డాలర్లు)దాకా ఖర్చు చేయబోతోంది. తద్వారా కాస్మిక్‌ కిరణాలు, చీకటి సంబంధిత అధ్యయనాలను సులువుగా కొనసాగించనుంది.
స్పేస్‌ క్రోగ్రావిటీలో క్యాన్సర్‌ మీద కూడా అధ్యయనం చేపట్టాలని చైనా నిర్ణయించటంతో త్రీడీ బ్లాబ్స్‌ను పంపడం ద్వారా ఆరోగ్యవంతమైన వాటితో పాటు క్యాన్సర్‌ కణజాలాల మీద ఒకేసారి ప్రయోగాలు నిర్వహించాలని నిర్ణయిచింది. దీని ద్వారా తక్కువ గ్రావిటీ అంతరిక్షంలో క్యాన్సర్‌ కణాల పెరుగుదల నెమ్మదించడమో లేదంటే పూర్తిగా ఆగిపోవడమో నిర్ధారించుకునే దిశగా ప్రయోగాలు చేయనుంది. ఈ ప్రయోగాలు ఫలిస్తే.. The China Manned Space Agency ‘అంతరిక్ష ట్రీట్ మెంట్ కు చైనా శ్రీకారం చుట్టనుంది.

అంటే క్యాన్సర్‌ రోగులకు అంతరిక్షంలోకి తీసుకెళ్లి అక్కడ ట్రీట్ మెంట్ అందిస్తారు. లేదంటే అక్కడ తయారు చేసిన మెడిసిన్స్ ను ఉపయోగించడమో ఆ మెడిసిన్స్ భూ వాతావరణానికి తగ్గట్లు పనిచేసే విధంగా తయారు చేసి వాటి ద్వారా చికిత్సనందిస్తారన్నమాట. కానీ దీనిపై చైనా ఇప్పటి వరకూ అధికారికంగా ప్రటించలేదు. కానీ..‘వ్యోమగాముల ఆరోగ్యం కోసం’ అనే హింట్‌ ఇవ్వడం ద్వారా భవిష్యత్తుల్లో క్యాన్సర్‌ పేషెంట్లకు స్పేస్‌ ట్రీట్‌మెంట్‌ అందించే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఓ కీలక అధికారి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. గ్లోబ​ల్‌ మీడియాలో సదరు అధికారి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

ఈ సంచలనాత్మక నిర్ణయంలో భాగంగానే చైనా స్పేస్‌ స్టేషన్‌లో కొత్తగా రెండు ల్యాబ్‌లను ప్రారంభించాలని యోచిస్తోంది. ఇవే కాకుండా ఇంకా పలు ప్రయోగాలు అనుమతుల కోసం సిద్ధంగా ఉన్నాయని..చైనా ఆస్ట్రోఫిజిస్ట్‌ జాంగ్‌ షువాంగ్‌ నాన్‌ అన్నారు. వీటిలో చాలావరకు అంటే తొమ్మిది ఇంటర్నేషనల్‌ ప్రాజెక్టులతో కలిపి ఇతర దేశాల సహకారంతోనూ నిర్వహించనున్నామని తెలిపారు.