China Ports : 1200 కంటైనర్లను నిలిపేసిన చైనా.. ఆంధ్రప్రదేశ్ వ్యాపారులకు తీవ్ర నష్టం

భారత్ ఎగుమతి చేసిన 1000 నుంచి 1200 రొయ్యల కంటైనర్లు చైనా ఓడరేవుల్లో నిలిచిపోయాయి. వీటి విలువ సుమారు రూ.1200 కోట్లు ఉంటుందని తెలుస్తుంది. భారత్ నుంచి ఎగుమతైన రొయ్యల ప్యాకింగ్ పై కరోనా అవశేషాలు ఉన్నాయని చైనా అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలోనే రొయ్యల దిగుమతి నిలివేసింది. దేశంలోని 50 మత్స్య ఉత్పత్తుల ఎగుమతి సంస్థలకు చెందిన కంటైనర్లను చైనా నిలిపివేసింది. వీటిలో ఆంధ్ర ప్రదేశ్ కి చెందిన 25 సంస్థలు ఉన్నాయి

China Ports : 1200 కంటైనర్లను నిలిపేసిన చైనా.. ఆంధ్రప్రదేశ్ వ్యాపారులకు తీవ్ర నష్టం

China Ports

China Ports : భారత్ ఎగుమతి చేసిన 1000 నుంచి 1200 రొయ్యల కంటైనర్లు చైనా ఓడరేవుల్లో నిలిచిపోయాయి. వీటి విలువ సుమారు రూ.1200 కోట్లు ఉంటుందని తెలుస్తుంది. భారత్ నుంచి ఎగుమతైన రొయ్యల ప్యాకింగ్ పై కరోనా అవశేషాలు ఉన్నాయని చైనా అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలోనే రొయ్యల దిగుమతి నిలివేసింది. దేశంలోని 50 మత్స్య ఉత్పత్తుల ఎగుమతి సంస్థలకు చెందిన కంటైనర్లను చైనా నిలిపివేసింది. వీటిలో ఆంధ్ర ప్రదేశ్ కి చెందిన 25 సంస్థల కంటైనర్లు ఉన్నాయి

ఆంధ్ర ప్రదేశ్ దేశంలోనే అత్యధిక రొయ్యలను ఉత్పత్తి చేస్తుంది. వీటిని వివిధ దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఇక చైనా తీసుకున్న నిర్ణయంతో ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన 25 మత్స్య ఉత్పత్తుల ఎగుమతి సంస్థలకు తీవ్ర నష్టం వాటిల్లింది. రెండు నెలలుగా చైనా ఓడరేవుల్లోనే తమ కంటైనర్లు ఉన్నాయని.. ఒక్కో కంటైనర్లో 16 టన్నుల రొయ్యకు ఉంటాయని.. అవన్నీ పాడైపోయే అవకాశం ఉందని మత్స్య ఉత్పత్తి ఎగుమతి సంస్థల ప్రతినిధులు అంటున్నారు. వాటిని తిప్పి పంపడం లేదు.. దిగుమతి చేసుకుంటామని చెప్పడం లేదు. దీంతో బిల్లులు రాక తీవ్ర ఇబ్బంది పడుతున్నామని వాపోతున్నారు.

చాలామంది రైతులకు ఇంకా చెల్లిపు చేయలేదని.. అవి దిగుమతి అవుతాయనే భావనతోనే ఉన్నామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆంధ్ర ప్రదేశ్ లో మత్స్య ఉత్పత్తుల ఎగుమతి సంస్థలు 80 వరకు ఉన్నాయి. చైనా వీటిలో 25 సంస్థలను బ్లాక్ లిస్ట్ లో పెట్టింది.. దీంతో వారు వాణిజ్య మంత్రిత్వ శాఖను సంప్రదించారు. ఇక ఈ విషయంపై ఏపీ రీజియన్ అధ్యక్షుడు సీఫుడ్ ఎక్స్‌పోర్టర్స్ అసోసియేషన్ అలూరి ఇంద్ర కుమార్ మాట్లాడుతూ… చైనా నిర్ణయం రొయ్యల ఉత్పత్తి, వ్యాపారంపై ఆధారపడి జీవించే వారిని తీవ్రంగా నష్టపరిచిందని తెలిపారు. రూ.1,200 కోట్ల చెల్లింపులు నిలిచిపోయాయని వివరించారు.