China-taiwan : నా దేశ స్వతంత్రాన్ని రక్షించడమే నా లక్ష్యం : జిన్‌పింగ్‌కు సూటిగా సమాధానం చెప్పిన తైవాన్ ప్రెసిడెంట్ ఇంగ్ వెన్

తైవాన్...తైవాన్ ప్రజలకే చెందుతుంది. తైవాన్ అస్తిత్వం...దేశ ప్రజల కోసం...ఇది ఎవరినీ రెచ్చగొట్టడం కాదు. తైవాన్‌ స్వతంత్రాన్ని రక్షించడమే నా జీవిత లక్ష్యం. చైనా యుద్ధ సన్నాహాలకు.. తైవాన్ అధ్యక్షురాలు సాయ్ ఇంగ్ వెన్ ప్రతిస్పందన ఇది. సూటిగా, స్పష్టంగా తైవాన్ విధానాన్ని వెల్లడించారు ఇంగ్‌ వెన్. దేశ అధికారాలు మొత్తం తమ ప్రజల చేతుల్లోనే ఉంటాయని తేల్చిచెప్పారు. జిన్‌పింగ్ ఒక దేశం రెండు వ్యవస్థల ప్రతిపాదనను తోసిపుచ్చారు.

China-taiwan : నా దేశ స్వతంత్రాన్ని రక్షించడమే నా లక్ష్యం : జిన్‌పింగ్‌కు సూటిగా సమాధానం చెప్పిన తైవాన్ ప్రెసిడెంట్ ఇంగ్ వెన్

China-taiwan : తైవాన్…తైవాన్ ప్రజలకే చెందుతుంది. తైవాన్ అస్తిత్వం…దేశ ప్రజల కోసం…ఇది ఎవరినీ రెచ్చగొట్టడం కాదు. తైవాన్‌ స్వతంత్రాన్ని రక్షించడమే నా జీవిత లక్ష్యం. చైనా యుద్ధ సన్నాహాలకు.. తైవాన్ అధ్యక్షురాలు సాయ్ ఇంగ్ వెన్ ప్రతిస్పందన ఇది. సూటిగా, స్పష్టంగా తైవాన్ విధానాన్ని వెల్లడించారు ఇంగ్‌ వెన్. దేశ అధికారాలు మొత్తం తమ ప్రజల చేతుల్లోనే ఉంటాయని తేల్చిచెప్పారు. జిన్‌పింగ్ ఒక దేశం రెండు వ్యవస్థల ప్రతిపాదనను తోసిపుచ్చారు.

తైవాన్‌..చైనాలో భాగం…చైనా పునరేకీకరణ అంటే…తైవాన్ స్వతంత్రతను హరించి…బీజింగ్‌లో భాగం చేసుకోవడం. అధికారం మొత్తం తమ చేతుల్లో ఉంచుకుని… ఆ దేశం అసంతృప్తులను చల్లార్చేందుకు తూతూమంత్రంగా..ఓ రాష్ట్రం తరహాలో పాలనా బాధ్యతలు అప్పగించడం. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఆలోచన ఇది. హాంకాంగ్ తరహాలో తైవాన్‌ను మార్చాలన్నది జిన్‌పింగ్ జీవితకాల లక్ష్యం. యుద్దంతో ఆక్రమించడం కన్నా..ఈ విధానంపై తైవాన్‌కు నచ్చజెప్పి ఒకే చైనాను ఆవిష్కరించాలన్నది ఆయన వ్యూహం. కానీ…తైవాన్ జిన్‌పింగ్‌కు ఉన్నట్టే తైవాన్‌ అధ్యక్షురాలికీ ఓ జీవితలక్ష్యం ఉంది. అది తైవాన్‌ను తైవాన్ ప్రజలే సర్వాధికారాలు, హక్కులతో పాలించే పరిస్థితి కల్పించడం..యథాతథస్థితి కొనసాగించడం. ఆ లక్ష్యాన్నే ఎన్నికల ప్రచారంలో మరోసారి వెల్లడించారు ఇంగ్‌ వెన్. ఈ నెల 26న జరిగే స్థానిక సంస్థల ఎన్నికల కోసం అధికార డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ తరపున ప్రచారంలో పాల్గొన్న ఇంగ్‌ వెన్‌…తైవాన్ భవిష్యత్ కార్యాచారణను స్పష్టంగా తెలియజేశారు. మూడోసారి చైనా అధ్యక్షుడయిన జిన్‌పింగ్ యుద్ధానికి సన్నద్ధంగా ఉండాలని పీపుల్స్ లిబరేషన్ ఆర్మీని ఆదేశించిన తర్వాత ఇంగ్ వెన్..ప్రతిస్పందించడం ఇదే మొదటిసారి.

తైవాన్ స్వతంత్రంగా ఉండాలని చాలా దేశాలు కోరుకుంటున్నాయని ఇంగ్‌ వెన్ వ్యాఖ్యానించారు. తైవాన్ అస్తిత్వం, స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం ఎవరినీ రెచ్చగొట్టేవి కాదని…అవి దేశప్రజల కోసమని ఇంగ్ వెన్ తెలిపారు. తైవాన్‌ను తైవాన్ ప్రజలకే చెందేలా చేయడం కోసం అధ్యక్షురాలిగా తన శక్తియుక్తులన్నింటినీ వెచ్చిస్తానని ఇంగ్ వెన్ చెప్పారు. అమెరికా చట్టసభల స్పీకర్ నాన్సీ పెలోసీ పర్యటన తర్వాత..చైనా..సరిహద్దులకు భారీగా బలగాలను తరలించడం, తైవాన్ జలసంధిలో యుద్ధనౌకలు ఉంచడం, భారీగా క్షిపణులు ప్రయోగించడం వంటి చర్యలతో ఉద్రిక్తతలు పెంచింది. గతంలో కన్నా ఎక్కువగా జిన్‌పింగ్ తైవాన్ గురించి మాట్లాడుతున్నారు. కమ్యూనిస్ట్ పార్టీ వందేళ్ల సమావేశంలోనూ, ఇటీవలి పార్టీ 20వ కాంగ్రెస్‌లోనూ చైనా పునరేకీకరణ తప్పదన్న ప్రకటనలు చేశారు. ఇప్పుడు ఏకంగా యుద్ధానికి సన్నద్ధంగా ఉండాలంటూ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీని జిన్ పింగ్ ఆదేశించడం..తైవాన్‌కు గట్టి హెచ్చరిక పంపేందుకే అన్నది అందరికీ తెలిసిందే. అయితే చైనా ఎన్ని ఒత్తిళ్లు తెచ్చినా తైవాన్ తలొగ్గడం లేదు. రెండేళ్లగా చైనా చర్యలకు..అదే స్థాయిలో ప్రతిస్పందిస్తోంది.

ఎలక్ట్రానిక్ చిప్‌ల తయారీ హబ్‌గా ఉన్న తైవాన్..చైనా నుంచి విడిపోయాక..కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి చెందింది. చిన్నదేశమైనప్పటికీ….ప్రపంచంపై ఘనమైన ముద్రవేసింది. చైనా ఆధిపత్యభావజాలాన్ని, ఇతర దేశాలతో..డ్రాగన్ అనుసరిస్తున్న వైఖరిని వ్యతిరేకిస్తున్నవారంతా..తైవాన్‌కు మద్దతుగా ఉంటున్నారు. అమెరికా అయితే తైవాన్‌కు కాపలాదారు అన్న చందంగా వ్యహరిస్తోంది. నిజానికి రెండేళ్లగా జిన్‌పింగ్ ప్రకటనలు గమనిస్తే..ఏ క్షణమైనా తైవాన్ ఆక్రమణ మొదలు కావొచ్చన్న అభిప్రాయం కలుగుతుంది. అసలు రష్యా యుక్రెయిన్ యుద్ధం కన్నా ముందు చైనా..తైవాన్‌పై దాడికి దిగుతుందని అందరూ భావించారు. కానీ నేరుగా యుద్ధం చేయడం కాకుండా.. తైవాన్‌ను సామరస్యపూర్వకంగా విలీనం చేసుకునే వ్యూహంతో చైనా ముందుకెళ్తోంది.