Gas explosions in restaurant : రెస్టారెంట్‌లో భారీ పేలుడు..ముగ్గురు మృతి.. 33 మందికి తీవ్ర గాయాలు

చైనాలోని ఓ రెస్టారెంట్ లో భారీ గ్యాస్ పేలుడు సంభవించింది.ఈ పేలుడులో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా..మరో 33మంది తీవ్రంగా గాయపడ్డారు.

Gas explosions in restaurant : రెస్టారెంట్‌లో భారీ పేలుడు..ముగ్గురు మృతి.. 33 మందికి తీవ్ర గాయాలు

Gas Explosion In Restaurant

Died 33 injured in gas explosion in chinaచైనాలోని ఓ రెస్టారెంట్ లో భారీ పేలుడు సంభవించింది. ఉదయం 8.20 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా..మరో 33మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈశాన్య చైనా లియోనింగ్ ప్రావిన్స్‌లోని షెన్‌యాంగ్‌లో గల రెస్టారెంట్‌లో గురువారం (అక్టోబర్ 21,2021) ఈ భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, 33 మందికి తీవ్ర గాయాలైనట్లు అధికారులు వెల్లడించారు. గాయపడినవారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు దాదాపు 30 ఫైర్‌ ఇంజన్లతో ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.

Read more : Theater in Desert : ఎడారి మధ్యలో భారీ స్క్రీన్‌ తో థియేట‌ర్‌..ఎందుకు కట్టారంటే..

ఈ పేలుడుతో మూడు అంతస్థుల రెస్టారెంట్‌ భవనం కుప్పకూలిపోయింది. ఈ భవనం పరిసరాల్లో పార్క్‌ చేసిన వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ పేలుడు ధాటికి సమీపంలో ఉన్న భవనాలు కూడా దెబ్బతిన్నాయి. 33 మంది క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. భవన శిథిలాలను తొలగిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

Read more : WiFi Cut : 2000 మందికి WiFi లేకుండా చేసిన ఎలుకలు..రంగంలోకి దిగిన ప్రభుత్వ అధికారులు

గ్యాస్ పైప్ పేలటం వల్లనే ఈ పేలుడు జరిగినట్లుగా తెలుస్తోంది. సరైనా సేఫ్టీ చర్యలు తీసుకోకపోవటం వల్లనే ఈ పేలుడు జరిగిందని అధికారులు గుర్తించారు. దీంతో రెస్టారెంట్ జన్ రల్ మేనేజన్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.కాగా చైనాలో భద్రతా ప్రమాణాలు సరిగా పాటించకపోవటంతో ఇటువంటి పేలుళ్లు సర్వసాధారణంగా మారిపోయాయి. దీంట్లో భాగంగానే గత జూన్లో జరిగిన పేలుళ్లల్లో 25 మంది మరణించారు.వంద మందికి పైగా గాయపడ్డారు.