Tiananmen Square: తియానన్మెన్ స్క్వేర్ హింసాకాండకు 34 ఏళ్లు.. చైనా ప్రభుత్వం ఏం చేస్తోందంటే..?

సంస్మరణ సభలు, నిరసనలను అణచివేయడమే కాదు.. తియానన్మెన్‌ స్క్వేర్‌ హింసాకాండ గురించి కనీసం మాట్లాడుకునే స్వేచ్ఛను కూడా చైనా సర్కారు ఇవ్వట్లేదు.

Tiananmen Square: తియానన్మెన్ స్క్వేర్ హింసాకాండకు 34 ఏళ్లు.. చైనా ప్రభుత్వం ఏం చేస్తోందంటే..?

China

Tiananmen Square – China: చైనాలో తియానన్మెన్‌ స్క్వేర్‌ హింసాకాండ జరిగిన 34 ఏళ్లు పూర్తవుతున్నాయి. 1989 జూన్ లో ప్రజాస్వామ్యవాద నిరసనకారులపై (1989 pro-democracy protests) చైనా ప్రభుత్వం అతి దారుణంగా వ్యవహరించిన ఘటనలను ఆ దేశ ప్రజలు ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారు. జూన్ 4న తియానన్మెన్‌ స్క్వేర్‌ హింసాకాండ వార్షిక దినం నేపథ్యంలో ప్రజలు దీనిపై నిరసన వ్యక్తం చేసే వీలు లేకుండా ప్రయత్నాలు చేస్తోంది చైనా ప్రభుత్వం.

ఇప్పటికే ఆ హింసాకాండ ఘటనకు సంబంధించిన గుర్తులను లేకుండా చేసేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసిన చైనాలోని కమ్యూనిస్టు ప్రభుత్వం ఇవాళ మరిన్ని చర్యలు తీసుకుంది. చైనాలో 1949 నుంచి ఆ పార్టీ ప్రభుత్వమే అధికారంలో ఉన్న విషయం తెలిసిందే.

సెంట్రల్ బీజింగ్ లోని తియానన్మెన్‌ స్క్వేర్‌ లో నిరసనకారులు ప్రవేశించేందుకు వీలు లేకుండా చైనా చాలా కాలంగా చర్యలు తీసుకుంటోంది. ఇవాళ హింసాకాండ వార్షిక దినం నేపథ్యంలో ఆ ప్రాంతంలో భద్రతను మరింత పెంచి, ఆంక్షలు కొనసాగిస్తోంది.

విక్టోరియా పార్క్ లో శనివారం రోజున కొందరు ఆందోళనకారులను చైనా అరెస్టు చేసింది. సంస్మరణ సభలు, నిరసనలను అణచివేయడమే కాదు.. తియానన్మెన్‌ స్క్వేర్‌ హింసాకాండ గురించి కనీసం మాట్లాడుకునే స్వేచ్ఛను కూడా చైనా సర్కారు ఇవ్వట్లేదు. తియానన్మెన్‌ స్క్వేర్‌ హింసాకాండలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులు కూడా ఏ కార్యక్రమాలు జరపడానికి వీల్లేకుండా చేస్తోంది.

కాగా, ప్రజాస్వామ్యం కోసం 1989లో తియానన్మెన్ స్క్వేర్‌ వద్ద పెద్ద ఎత్తున విద్యార్థులు, కార్మికులు ఆందోళనకు దిగారు. దాన్ని చైనా ప్రభుత్వం ఆర్మీ సాయంతో అణచివేసి, నరమేధం సృష్టించింది. అప్పట్లో, దూసుకువస్తున్న ఆయుధ ట్యాంక్ ముందు నిలబడి ఓ వ్యక్తి ప్రాణాలకు తెగించి నిరసన తెలిపిన ఫొటో ఇప్పటికీ అందరి హృదయాలను కలచివేస్తోంది.

Karnataka: దున్నపోతుల్ని చంపుతున్నాంగా ఆవుల్ని చంపితే ఏమైంది? దుమారం లేపుతున్న కర్ణాటక మంత్రి