China One Child Policy : ‘34 ఏళ్ల క్రితం మా అమ్మ డైరీ ’గుండెలు మెలిపెట్టే తల్లి మానసిక వ్యథను కళ్లకు కట్టిన కూతురు

చైనాలో సింగిల్ చైల్డ్ పాలసీ వల్ల ఓ తల్లి అనుభవించిన మానసిక క్షోభను.. గుండెలు మెలిపెట్టే తల్లి మానసిక వ్యథను కళ్లకు కట్టింది కూతురు.

China One Child Policy : చైనాలో జనాభా నియంత్రణ కోసం ప్రభుత్వం తీసుకున్న ‘సింగిల్ ఛైల్డ్ పాలసీ’ వల్ల ఈనాడు చైనా జనాభా సంక్షోభాన్ని చవిచూస్తోంది. జనాభా పెరుగుదల కోసం సింగిల్ ఛైల్డ్ పాలసీను రద్దు చేసి ఇద్దరు ముగ్గురు పిల్లల్ని కనమని నెత్తీ నోరూ బాదుకుంటున్నా ఇప్పుడు చైనా ప్రజలు పిల్లల్ని కనటానికి ఆసక్తి చూపించటంలేదు.యువత కనీసం వివాహాలు చేసుకోవటానికి కూడా ఆసక్తి చూపించటంలేదు. దీంతో ప్రభుత్వం తలపట్టుకోవల్సిన పరిస్థితి వచ్చింది. కానీ ఆనాడు చైనా విధించిన ‘సింగిల్ ఛైల్డ్ పాలసీ’వల్ల ఎంతమంది తల్లులు నరకయాతన అనుభవించి ఉంటారో అనే ఆలోచన బహుశా ఎవరికి వచ్చి ఉండదు. కానీ సోషల్ మీడియా వల్ల ఎప్పుడో మొదటి,రెండో ప్రపంచ యుద్ధకాలంనాటి ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. అలాగే సోషల్ మీడియా వేదికగా ‘సింగిల్ ఛైల్డ్ పాలసీ’వల్ల ఓ తల్లి అనుభవించిన మానసిక వేదన వెలుగులోకి తీసుకొచ్చింది ఆమె కూతురు 34 ఏళ్ల తరువాత..

CHINA Population fall : భారీ స్థాయిలో తగ్గిపోతున్న చైనా జనాభా.. 61 ఏళ్లలో ఇదే మొదటిసారి

చైనాలో సింగిల్ ఛైల్డ్ పాలసీ వల్ల నా తల్లి పడిన ఆవేదనను ఆమె రాసిన డైరీ చదివాక నాకు తెలిసింది అంటూ ఆ డైరీలోని పేజీలను..తల్లి పడిన మానసిక ఆవేదనను వెల్లడించింది ట్విటర్‌ వేదికగా చైనాకు చెందిన ఓ యువతి. మె ఏక సంతాన విధానం వల్ల తన తల్లి అనుభవించిన బాధను ఓ యువతి ట్విటర్‌ వేదికగా షేర్‌ చేసింది. ఆమె ట్వీట్లు చూసినవారు ఎంత ఆవేదన అనుభవించిందో ఆ తల్లి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.చైనాలో దాదాపు 10ఏళ్లకు పైగా కొనసాగిన ఈ సింగిల్ ఛైల్డ్ పాలసీ కఠిన నిబంధన ఎందరో తల్లుల జీవితాల్లో వేదనను మిగిల్చింది. ఒకరి కంటే ఎక్కువమంది పిల్లలు ఉంటే ఆ తల్లిదండ్రులు ఉద్యోగాలను కోల్పోయే పరిస్థితి ఉండేది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకు. ప్రస్తుతం చైనాలో జనాభా సంక్షోభం తలెత్తటంతో ఈ నిబంధనను వెనక్కి తీసుకున్నా.. దానివల్ల కలిగిన మానసిక క్షోభ మాత్రం చైనా తల్లుల మదిలో ఈనాడికి పచ్చిగానే ఉంది. బిడ్డలను దూరం చేసుకున్న ఆ గుండె తడి ఆరనేలేదు. గుండెలను తడుముకుంటే బిడ్డలను దూరం చేసుకున్న దుస్థితిని కళ్లముందు కదలాడి గుండె చెరువైపోతుంది.

అటువంటి బాధను నా తల్లి అనుభవించింది అంటూ ఓ యువతి ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. చిన్నిబిడ్డను దూరం చేసుకునే క్రమంలో తల్లి పడిన బాధ..కళ్లు మహాసముద్రాలవుతుంటే..గుండె బద్ధలైపోతుంటే చిట్టితల్లి చేయి విడిచిన ఆ బాధ, గుబులు, గూడుకట్టుకున్న విషాధ ఛాయలు కళ్లముదే కదలాడుతున్న అనుభూతిని కళ్లకు కట్టింది ఆతల్లి రాసుకున్న డైరీ..

China Population : నూతన జంటలకు 30 రోజులు సెలవులు.. జననాల రేటును పెంచుకొనేందుకు చైనా సరికొత్త ప్రయోగాలు ..

చైనాకు చెందిన UKలోని డర్హామ్ యూనివర్శిటీలో ఇంటర్నేషనల్ రిలేషన్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్‌ చెన్‌చెన్‌ ఝాంగ్‌ అనే యువతి తన తల్లి రాసుకున్న డైరీలోని కొన్ని పేజీలను ట్విటర్‌లో షేర్‌ చేశారు. ‘34 ఏళ్ల క్రితం అమ్మ రాసిన డైరీలోని కొన్ని పేజీలివి. రెండు నెలల వయసున్న నా చెల్లిని అమ్మమ్మ వద్దకు పంపేటప్పుడు కన్నీటితో రాసుకున్న పదాలివి అంటూ వివరింాచరు డాక్ట్ చెన్. తన చిన్నారి వెళ్లిపోయేముందు గుండెల్లో పొంగుకొస్తున్న మాతృత్వాన్ని పాలుగా మార్చి మరోసారి బిడ్డకు పట్టిన ఘటన అక్షరాల రూపంలో రాస్తుంటే కళ్లు మసకబారి ఆ ఘడియల గురించి ఎంత చెప్పినా తక్కువే కదా.. చిట్టితల్లిని అమ్మమ్మ వద్దకు పంపిచేముందు మరోసారి పాలు పట్టిన అత్యంత బాధాకరమైన ఘటనను అమ్మ డైరీలో రాసుకుంది. అప్పుడు నా వయసు ఏడాదిన్నర. చెల్లి దూరమవుతుందనే విషయమే తెలియదు. చెల్లికి అయిదారేళ్లు వచ్చాక మళ్లీ మా వద్దకు వచ్చింది. గుండెలు మెలిపెట్టే ఇలాంటి ఎన్నో గాథలున్న చైనా కుటుంబాల్లో మాదీ ఒకటి’ అంటూ 34 సంవత్సరాల 2 నెలల క్రితం చెన్‌చెన్‌ తల్లి డైరీలో రాసుకున్న ఆ అక్షరాల్లోని ఆమె తల్లి ఆవేదనను కళ్లకు కట్టారు..చెన్ ట్వీట్ కు మూడు లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. యూజర్లు ఇది హృదయవిదారకం అంటూ మూడు వేలమంది కామెంట్స్ చేశారు.

 

ట్రెండింగ్ వార్తలు