China Artificial Sun : చైనా ‘కృత్రిమ సూర్యుడు’ కొత్త ప్రపంచ రికార్డు.. రియల్ సన్ కంటే అధిక వేడి పుట్టించింది!

డూప్లికేట్‌కు కేరాఫ్ అడ్రస్ అయిన చైనా తయారుచేసిన కృత్రిమ (ఆర్టిఫిషియల్ సన్) సూర్యుడు కొత్త ప్రపంచ రికార్డును సృష్టించింది. అసలైన సూర్యుడు కంటే అధిక ఉష్ణోగ్రత ఉత్పత్తి చేసింది.

China Artificial Sun : చైనా ‘కృత్రిమ సూర్యుడు’ కొత్త ప్రపంచ రికార్డు.. రియల్ సన్ కంటే అధిక వేడి పుట్టించింది!

China Artificial Sun

China’s artificial sun sets new world record : డూప్లికేట్ తయారుచేయడంలో డ్రాగన్ చైనాకు సాటి లేదు.  నకిలీనా? ఒరిజినలా? అనే తేడా తెలియదు. అంత కచ్చితంగా మక్కీకి మక్కీ దించేయగలదు చైనా. ప్రపంచానికి వెలుగునిస్తున్న సూర్యుడికే డూప్లికేట్ తయారుచేసింది డ్రాగన్.. మరి అలాంటి డూప్లికేట్ కు కేరాఫ్ అడ్రస్ అయిన చైనా తయారుచేసిన కృత్రిమ (ఆర్టిఫిషియల్ సన్) సూర్యుడు కొత్త ప్రపంచ రికార్డును సృష్టించింది. అసలైన సూర్యుడు కంటే అధిక ఉష్ణోగ్రత ఉత్పత్తి చేసింది.

చైనా సైంటిస్టులు రూపొందించిన ఈ కృత్రిమ సూర్యుడు 101 సెకన్ల పాటు 120 మిలియన్ల డిగ్రీల సెల్సియస్ ఎక్కువ ఉష్ణోగ్రతను ఉత్పత్తి చేసింది. చైనా ప్రయోగాత్మకంగా అధునాతన సూపర్ కండక్టింగ్ టోకామాక్ (EAST) ప్రయోగంలో ఈ రికార్డును నెలకొల్పింది. గతంలో చైనా ఇదే కృత్రిమ సూర్యుడితో న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్టర్ 100 సెకన్లకి 180 మిలియన్ డిగ్రీల ఫారెన్ హీట్ వద్ద 100 సెకన్ల పాటు గతంలోనే నడిచింది. ఇప్పుడు ఆ రికార్డును బ్రేక్ చేసింది.

హెఫీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ సైన్స్ వద్ద ఉన్న ఈ డివైజ్ 100 మిలియన్ డిగ్రీల సెల్సియస్ ప్లాస్మా ఉష్ణోగ్రతను 100 సెకన్ల పాటు నిర్వహించి మునుపటి రికార్డును బద్దలు కొట్టింది. ఇది సూర్యుడి కంటే పది రెట్లు ఎక్కువ వేడిగా ఉంటుంది. ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్న అనేక ‘కృత్రిమ సూర్యుడు’ డివైజ్‌ల్లో ఈస్ట్ ఒకటి. ప్రస్తుతానికి, నియంత్రిత అణు విలీనం ద్వారా అనంతమైన స్వచ్ఛమైన శక్తిని అందించడానికి ప్రయోగాలు జరుగుతున్నాయి.

ఈస్ట్ ప్రాజెక్ట్ ఇప్పుడు ఇంటర్నేషనల్ థర్మోన్యూక్లియర్ ఎక్స్‌పెరిమెంటల్ రియాక్టర్‌లో ఒక భాగంగా ఉంది. అణు విచ్ఛిత్తిని వినియోగించుకునేందుకు 35 దేశాలు సంయుక్తంగా ఈ ప్రాజెక్టుపై కృషి చేస్తున్నాయి. 100 మిలియన్ సెల్సియస్ కంటే ఎక్కువ ప్లాస్మా ఉష్ణోగ్రతను సాధించాయి. అధిక ప్లాస్మా ఉష్ణోగ్రతను సాధించిన ఏకైక దేశం చైనా కాదు. 2020లో, కొరియాకు చెందిన KSTAR రియాక్టర్ 20 సెకన్ల పాటు 100 మిలియన్ సెల్సియస్ కంటే ఎక్కువ ప్లాస్మా ఉష్ణోగ్రతను ఉత్పత్తి చేసి రికార్డు సృష్టించింది.