Hypersonic Missile : ప్రపంచాన్ని చుట్టొచ్చిన చైనా మిసైల్..అమెరికాపై న్లూక్లియర్ ఎటాక్!

ఏదో ఒకరోజు అమెరికాపై అణు దాడికి పాల్పడే సామర్థ్యాన్ని చైనా కలిగి ఉంటుందని అమెరికా ఉన్నత సైన్యాధికారి హెచ్చరించారు. ఈ ఏడాది జులై-27న చైనా హైపర్​సోనిక్​ క్షిపణి.. ప్రపంచాన్ని

Hypersonic Missile : ప్రపంచాన్ని చుట్టొచ్చిన చైనా మిసైల్..అమెరికాపై న్లూక్లియర్ ఎటాక్!

Missile

Hypersonic Missile :  ఏదో ఒకరోజు అమెరికాపై అణు దాడికి పాల్పడే సామర్థ్యాన్ని చైనా కలిగి ఉంటుందని అమెరికా ఉన్నత సైన్యాధికారి హెచ్చరించారు. ఈ ఏడాది జులై-27న చైనా హైపర్​సోనిక్​ క్షిపణిని పరీక్షించిందని..ఆ మిసైల్ ప్రపంచాన్ని చుట్టివచ్చినట్లు ఆయన తెలిపారు. ఈ ఆయుధం ధ్వని కంటే ఐదు రెట్లు వేగంగా ప్రయాణించగలదన్నారు.

అమెరికా జాయింట్ చీఫ్స్ ఆఫ్​ స్టాఫ్ వైస్ ఛైర్మన్​ జాన్​ హైటెన్ మంగళవారం ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ…”చైనా ప్రయోగించిన హైపర్​సోనిక్​ గ్లైడ్​ వాహనం ప్రపంచ దేశాలను చుట్టి తిరిగి చైనాకే వెళ్లింది. నిర్దేశించిన లక్ష్యానికి అత్యంత చేరువగా వెళ్లింది. ఇది తొలిసారి ఉపయోగిస్తున్న ఆయుధంలా కనిపిస్తోంది. చైనా గత ఐదేళ్లలో వందల సంఖ్యలో హైపర్​సోనిక్ పరీక్షలు చేపట్టింది. అమెరికా కేవలం తొమ్మిది హైపర్​సోనిక్ ప్రయోగాలకే పరిమితమైంది. చైనా ఇప్పటికే మధ్యశ్రేణి హైపర్​సోనిక్ ఆయుధాన్ని వినియోగిస్తోంది. అమెరికాకు ఇంకా కొన్నేళ్లు పడుతుందని” అన్నారు.

అయితే,హైపర్ సోనిక్ మిసైల్ ప్రయోగం వార్తలను చైనా ఖండించింది. తాము ప్రయోగం చేపట్టిన విషయం నిజమేనని… అది క్షిపణి కాదని.. అది కేవలం పునర్వినియోగ అంతరిక్ష నౌక అని అక్టోబర్​ 18న చైనా తెలిపింది. ఇది సాధారణ ప్రయోగమేనని, ప్రపంచంలోని చాలా కంపెనీలు ఈ తరహా పరీక్షలను చేపట్టాయని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఝావ్ లిజియాన్ తెలిపారు. అంతరిక్ష వినియోగం మానవుల ప్రయోజనాలకు అనుగుణంగా జరిగేందుకు తాము ఏ దేశంతోనైనా కలిసి పని చేసేందుకు సిద్ధమన్నారు.

మరోవైపు,. హైపర్​సోనిక్ క్షిపణి ఇలా భూమి చుట్టూ తిరిగివచ్చేలా ఓ దేశం ప్రయోగం చేపట్టడం ఇదే తొలిసారి అని ఫైనాన్షియల్ టైమ్స్ తెలిపింది. చైనా ప్రయోగించిన హైపర్​సోనిక్​ ఆయుధం లక్ష్యాన్ని కొద్ది కిలోమీటర్ల దూరంలో మిస్​ అయినట్లు తెలిపింది. హైపర్​సోనిక్ అయుధాలకు ధ్వనికంటే ఐదు రెట్లు ఎక్కువ వేగంతో ప్రయాణించగల సామర్థ్యం ఉంటుంది కాబట్టి వాటిని రాడార్లు కూడా పసిగట్టలేవు.

ALSO READ Chinese Nuclear Warheads : అంచనాలను మించి..అణ్వాయుధాలను భారీగా పెంచుకుంటున్న చైనా