పాకిస్తాన్ తో చైనా కీలక ఒప్పందం.. 50 అత్యాధునికమైన ఆర్మడ్ డ్రోన్ లను అందించేందుకు అంగీకారం

పాకిస్తాన్ తో చైనా కీలక ఒప్పందం.. 50 అత్యాధునికమైన ఆర్మడ్ డ్రోన్ లను అందించేందుకు అంగీకారం

China’s key agreement with Pakistan : పాకిస్తాన్ తో చైనా కీలక ఒప్పందం కుదుర్చుకుంది. పాకిస్తాన్ కు ఏకంగా 50 అత్యాధునికమైన ఆర్మడ్ డ్రోన్ లను అందించేందుకు చైనా ఒప్పందం చేసుకుంది. అత్యధిక ఎత్తు నుంచి ప్రత్యర్థులపై దాడి చేసే సామర్థ్యం గల వింగ్ లాంగ్ 11 ఆర్మడ్ డ్రోన్ లను చైనా తాజాగా అభివృద్ధి చేసింది. వీటిని పాకిస్తాన్ కు అందించేందుకు అంగీకారం కుదిరినట్లు చైనా అధికారిక మీడియా వెల్లడించింది.

భారత భూభాగం చాలా ప్రత్యేకమైనదని… అక్కడ డ్రోన్ దాడి చేసేందుకు సాధ్యం కాదని చైనా సైనికాధికారులు వెల్లడించారు. ఇది కేవలం వ్యాపార లావాదేవీ మాత్రమే అని తేల్చి చెప్పారు. అయితే ఇరు దేశాల మధ్య డ్రోన్ పర్యవేక్షణ సరైంది కాదని భారత సైనికాధికారులు వెల్లడించారు. ఇది కేవలం పాకిస్తాన్ ఆధిపత్యానికి నిదర్శనమన్నారు.

అనియత్రిత భూభాగంలో పెత్తనం కోసమే పాకిస్తాన్ తో కలిసి చైనా కుట్రలు చేస్తుందని భారత్ ఆరోపిస్తోంది. ఆఫ్ఘనిస్థాన్, ఇరాక్ లపై పెత్తనం కోసం అమెరికా కూడా డ్రోన్ లను వినియోగించినట్లు భారత్ గుర్తు చేసింది. అయితే నిబంధనలకు విరుద్ధంగా భారత్ భూభాగంలోకి వచ్చిన డ్రోన్ లను పేల్చివేస్తామని ఇండియన్ ఆర్మీ అధికారులు వెల్లడించారు.