China’s Rich Moving TO Singapore : చైనా కుబేరులను అట్రాక్ట్ చేయటంలో బిజీగా ఉన్న సింగపూర్ సర్కార్..

చైనా సంపన్నులంతా చలో సింగపూర్ అంటున్నారు. ప్రపంచంలో ఇన్ని దేశాలు ఉండగా.. ఆ చిన్న దేశానికే  చైనా ధనవంతులు మకాం మార్చాలని ఎందుకు అనుకుంటున్నారు..? సింగపూర్ ఎందుకు వారికి అంత ప్రత్యేకతగా ఉంది.. ? చైనా నుంచి ధనవంతులు అంతా వెళ్లిపోతుంటే.. చైనా ప్రభుత్వం ఏం చేస్తోంది..? ఆపే చర్యలేవీ తీసుకోవటంలేదా? ఇటువంటి పరిస్థితుల్లో  జిన్‌పింగ్ ఏం చేయబోతున్నారు..?

China’s Rich Moving TO Singapore : చైనా కుబేరులను అట్రాక్ట్ చేయటంలో బిజీగా ఉన్న సింగపూర్ సర్కార్..

China’s rich are moving their money to Singapore..Beijing’s crackdown is one of the reasons

China’s rich moving to Singapore : చైనా సంపన్నులంతా చలో సింగపూర్ అంటున్నారు. ప్రపంచంలో ఇన్ని దేశాలు ఉండగా.. ఆ చిన్న దేశానికే  చైనా ధనవంతులు మకాం మార్చాలని ఎందుకు అనుకుంటున్నారు..? సింగపూర్ ఎందుకు వారికి అంత ప్రత్యేకతగా ఉంది.. ? చైనా నుంచి ధనవంతులు అంతా వెళ్లిపోతుంటే.. చైనా ప్రభుత్వం ఏం చేస్తోంది..? ఆపే చర్యలేవీ తీసుకోవటంలేదా? ఇటువంటి పరిస్థితుల్లో  జిన్‌పింగ్ ఏం చేయబోతున్నారు..?

షాపింగ్‌ కోసమో, కాసినోల్లో ఎంజాయ్‌ చేసేందుకో… విశ్రాంతి కోసమో, వైద్యం కోసమో… ఇన్నాళ్లు సింగపూర్‌ను షార్ట్‌టర్మ్‌ డెస్టినేషన్‌గా సెలక్ట్ చేసుకునేవారు సంపన్నులు ! ఐతే మూడేళ్లుగా పరిస్థితి మారిపోయింది. సింగపూర్‌లో స్థిరపడేందుకు వారు మొగ్గుచూపుతున్నారు. డ్రాగన్‌ జీరో కోవిడ్‌ విధానం తర్వాత చైనా నుంచి సింగపూర్‌కు మకాం మారుస్తున్న వారి సంఖ్య మరింత పెరుగుతోంది. చైనా కుబేరులు తమ దేశానికి క్యూ కడుతుండడంతో.. వారిని అట్రాక్ట్ చేసేందుకు తగిన ఏర్పాట్లు చేసే పనిలో బిజీగా ఉంది సింగపూర్ సర్కార్. డబ్బు ఉంటే ఏ దేశంలో అయినా జీవించే అవకాశం ఉన్నా.. సింగపూర్‌నే సెలక్ట్ చేసుకోవడం వెనక చైనీయుల వివరణ మరింత ఆసక్తికరంగా ఉంది.

Also read : Chinese Billionaires To Singapore : చైనా వదిలి సింగపూర్ వెళ్లిపోతున్న సంపన్నులు .. ఆందోళనలో డ్రాగన కంట్రీ

ఒకప్పుడు వెకేషన్ అంటే చైనా సంపన్నులు అంతా.. హంకాంగ్‌ వెళ్లేవారు. ఐతే ఎప్పుడూ స్థిర నివాసం గురించి కనీసం ఆలోచన చేయలేదు. ఎప్పుడైతే సింగపూర్‌ వారిని ఆహ్వానించడం మొదలుపెట్టిందో.. అటు వైపు చూడడం కూడా వదిలిపెట్టారు. నిజానికి సింగపూర్ జనాభాలో దాదాపు పావు మంది డ్రాగన్ కంట్రీ మూలాలు ఉన్న వాళ్లే కనిపిస్తారు. పైగా సంప్రదాయాలు కూడా దాదాపు సేమ్ ఉంటాయ్. ఒకరకంగా సింగపూర్‌లో మకాం పెట్టడం అంటే రెండో చైనాలో ఉన్నట్లే అన్నది చాలామంది ఆలోచన. సింగపూర్‌ పొలిటికల్‌ సిస్టమ్ కూడా స్ట్రాంగ్‌గా ఉంది.. చట్టాలు పక్కాగా అమలు అవుతాయ్. సేఫ్టీపరంగానూ ఎలాంటి ఇబ్బంది ఉండదు. అందుకే మకాం మార్చేందుకు సింగపూర్ బెస్ట్ ప్లేస్ అని ఫిక్స్ అవుతున్నారు చైనా సంపన్నులు.

యూరోపియన్ దేశాలకు మకాం మార్చేస్తే.. చైనా మూలాలను పూర్తిగా మర్చిపోవాల్సి ఉంటుంది. పూర్తిగా విరుద్ధమైన సంప్రదాయాల మధ్య బతకాల్సి ఉంటుంది. అదే సింగపూర్ అయితే.. చైనాలో ఉన్న ఫీలింగ్ ఉంటుంది. అదే ఇప్పుడు వారంతా ఆ దేశ బాట పట్టడానికి కారణం. 55లక్షల జనాభా ఉన్న చిన్న, సంపన్న దేశంలో సుఖంగా, సురక్షితంగా జీవించొచ్చని సంపన్నులు భావిస్తున్నారు. పైగా స్థానికంగా వ్యాపారం చేసేందుకు కేవలం 13.8 కోట్లు పెట్టుబడిగా పెడితే చాలు.. ఫాస్ట్‌ట్రాక్‌లో శాశ్వత పౌరసత్వం ఇచ్చేందుకు సింగపూర్‌ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. పైగా సంబంధం లేని ప్రాంతంలో బతుకుతున్నామన్న ఫీలింగ్ అసలే ఉండదు. దీంతో చైనా సంపన్నులు ఇప్పుడు చలో సింగపూర్ అంటున్నారు. తమ దేశానికి సంపన్నుల రాకను దృష్టిలో పెట్టుకొని.. వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా, అన్ని ఏర్పాట్లు చేసేలా సింగపూర్‌లో కొత్త కొత్త వ్యాపారాలు వెలుస్తున్నాయ్.

దేశం విడిచి వెళ్లాలని చాలామంది చైనా సంపన్నులు ఫిక్స్ అయినా.. నిబంధనలు వారికి ఆటంకంగా మారుతున్నాయ్. చైనా నిబంధనల ప్రకారం ఏడాదిలో 50వేల యువాన్లను మాత్రమే విదేశీ కరెన్సీగా మార్చుకునే అవకాశం ఉంటుంది. ఐతే తమ ధనాన్ని క్రిప్టో కరెన్సీగా మార్చుకుని వెళ్లేందుకు యత్నిస్తున్నారు డ్రాగన్‌ కంట్రీ కోటీశ్వరులు. క్రిప్టో కరెన్సీకి చైనాలోనూ ఎలాంటి నిబంధనలు లేకపోవడమే కారణం. చైనా నుంచి ధనవంతులు వరుసగా మకాం మార్చేస్తుంటే.. జిన్‌పింగ్‌ సర్కార్ ఊరుకుంటుందా అంటే.. అది అంత ఈజీకాదు అన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయ్.