సెప్టెంబర్ 01 నుంచి స్కూళ్లు

  • Published By: madhu ,Published On : August 30, 2020 / 07:30 AM IST
సెప్టెంబర్ 01 నుంచి స్కూళ్లు

కరోనా వైరస్ పుట్టిల్లు..అయిన..చైనాలో స్కూళ్లు తెరిచేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సెప్టెంబర్ 01వ తేదీ నుంచి స్కూళ్లు, kindergartens తెరుస్తామని వెల్లడించారు. వూహాన్ విశ్వవిద్యాలయం సోమవారం నుంచి తిరిగి ప్రారంభమవుతుందని, 2 వేల 842 విద్యా సంస్థల్లో 1.4 మిలియన్ల విద్యార్థులు చదువుకుంటున్నారని అంచనా.

పాఠశాలకు వెళ్లే విద్యార్థులు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని, ప్రజా రవాణా నివారించాలని అధికారులు తెలిపారు. అనవసరమైన మీటింగ్స్ నివారించాలని, ప్రతి రోజు ఆరోగ్య నివేదికలను సమర్పించాలన్నారు. వైరస్ వ్యాప్తి చెందకుండా..అరికట్టేందుకు అవసరమైన వైద్య పరికరాలు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు.

నోటీసులు అందుకోని విదేశీ విద్యార్థులు, ఉపాధ్యాయులను స్కూళ్లకు అనుమతించరన్నారు. చైనా నుంచి వచ్చిన ఈ వైరస్ కారణంగా…జనవరి నుంచి రెండు నెలలకు పైగా లాక్ డౌన్ విధించారు. లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత…వూహాన్ క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంది. వూహాన్ నగరంలో సుమారు 76 రోజుల పాటు లాక్ డౌన్ విధించారు.