Meituan CEO : 1100 ఏళ్లనాటి కవితను షేర్ చేసి..వేల కోట్లు నష్టపోయిన బిలియనీర్

1100 ఏళ్లనాటి ప్రాచీన కవితను తన ట్విట్టర్ లో షేర్ చేసినందుకు వేల కోట్ల రూపాయలు నష్టపోవాల్సి వచ్చింది చైనాకు చెందిన ఓ బిలియనీర్.

Meituan CEO : 1100 ఏళ్లనాటి కవితను షేర్ చేసి..వేల కోట్లు నష్టపోయిన బిలియనీర్

Chinese Billionare (2)

చిన్న చిన్న పొరపాటుకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు అదే మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వచ్చిందో ఓ ప్రముఖ సంస్థ సీఈవో. ఓ ప్రాచీన కవితను తన ట్విట్టర్ లో షేర్ చేసినందుకు వేల కోట్ల రూపాయలు నష్టపోవాల్సి వచ్చింది. చైనాకు చెందిన ఓ బిలియనీర్ ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నాడు. ఇంతకీ ఆయన చేసిన పొరపాటు ఏమిటంటే..వెయ్యేళ్ల నాటి ప్రాచీన కవితను ట్విటర్‌లో షేర్ చేసినందుకు ఈ భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది చైనా బిలియనీర్, మీట్యుయన్ సీఈవో వాంగ్ జింగ్ కు.

పోనీ ఈ కవిత ఏ దేశానికో చెందినది కాదు..సాక్షాత్తు చైనా చరిత్రకు సంబంధించినదే కావటం గమనించాల్సిన విషయం. చైనా చరిత్రకు సంబంధించిన ఈ కవిత 1100 ఏళ్లనాటిది. చైనా బిలియనీర్, మీట్యుయన్ సీఈవో వాంగ్ జింగ్ ఈ కవితలోని కొన్ని పంక్తుల్ని తన తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

అందులో చైనా మొట్టమొదటి చక్రవర్తి తనకు వ్యతిరేకంగా రేగుతున్న అసమ్మతిని అణచడానికి చేసిన తప్పుడు ప్రయత్నాల గురించి పేర్కొనడం ఉంది. దీంతో జింగ్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాడని వాంగ్ జింగ్ పై ఆరోపణలు వచ్చారు. వాంగ్ ట్విట్టర్ లో కవితను చదివిన అనేక మంది అలాగే భావించారు. దీంతో సీఈవోగా ఉన్న మీట్యుయన్ కంపెనీ మార్కెట్ విలువ 26 బిలియన్ డాలర్ల(రూ.18,365 కోట్లు) మేర పడిపోయింది. అలా 1100 ఏళ్లనాటి కవిత వాంగ్ జింగ్ కు పెద్ద ఝలక్ ఇచ్చింది. భారీ మూల్యం చెల్లించుకునేలా చేసింది.