కరోనా ఎఫెక్ట్ : భారత్‌లో కుమార్తె పెళ్లి.. మిస్సైన చైనా ఫ్యామిలీ

  • Published By: sreehari ,Published On : February 6, 2020 / 07:43 AM IST
కరోనా ఎఫెక్ట్ : భారత్‌లో కుమార్తె పెళ్లి.. మిస్సైన చైనా ఫ్యామిలీ

కరోనా వైరస్ వ్యాప్తితో ప్రపంచ దేశాలన్నీ అలర్ట్ అయ్యాయి. చైనా సహా ఇతర దేశాలన్నీ కరోనా వైరస్ వ్యాప్తిని కంట్రోల్ చేసేందుకు చర్యలు చేపట్టాయి. ఈ నేపథ్యంలో చైనాకు వచ్చేపోయే ప్రయాణికులపై నిషేధం విధించారు. కరోనా తీవ్రత అధికంగా ఉన్న వుహాన్ సిటీ నుంచి అన్ని దేశాలకు రాకపోకలపై కూడా నిషేధించారు. కరోనా వ్యాప్తిపై భయాందోళన కొనసాగుతున్న తరుణంలో చైనాకు చెందిన యువతి భారతీయ వ్యక్తిని పశ్చమ బెంగాల్ లోని ఈస్ట్ మిడ్నాపూర్ లో వివాహం చేసుకుంది.

అయితే తన పెళ్లికి వచ్చేందుకు చైనాలోని ఆమె కుటుంబం బయల్దేరింది. ఇంతలో కరోనా దెబ్బకు ట్రావెల్ బ్యాన్ చేయడంతో కూతురి పెళ్లికి రాలేకపోయింది. కూతురి పెళ్లిని దగ్గర ఉండి చూసుకోవాల్సిన తల్లిదండ్రులు చైనాలోనే ఉండిపోయారు. భారత్ వచ్చేందుకు అనుమతి లేకపోవడంతో అక్కడి నుంచే కూతుర్ని ఆమె తల్లిదండ్రులు ఆశ్వీరదించారు.

చైనాలోని ఓ బిజినెస్ డీల్ సమయంలో ఏడేళ్ల కిత్రం వీరిద్దరూ కలుసుకున్నారు. ఇటీవలే అబ్బాయి ఇంట్లోజరిగిన ఫంక్షన్ లో వీరిద్దరి పెళ్లి జరిగింది. తన మ్యారేజీకి తన కుటుంబ సభ్యులు రాకపోవడంతో ఎంతో బాధపడింది పెళ్లి కుమార్తె. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘నా కుటుంబం ఎంతో ఆనందంగా ఉంది. బాగున్నారు. కానీ, నా పెళ్లికి వారంతా రాలేకపోయారు. వైరస్ వ్యాప్తి అందరిని ఆందోళనకు గురిచేస్తోంది. చైనా, ఇండియా దేశాల మధ్య విమాన సర్వీసులు రద్దు అయ్యాయి’ అని పెళ్లికూతురు జైక్వీ వెల్లడించారు.

మీరు తిరిగి చైనాకు వెళ్తారా? అని మీడియా అడిగిన ప్రశ్నకు జైక్వీ.. ‘మేం తిరిగి చైనాకు వెళ్తాం. కానీ, ఎప్పుడు వెళ్తామో చెప్పలేను’ అని బదులిచ్చింది. అంతా సర్దుకున్నాక తామంతా చైనాకు తిరిగి వెళ్తామని, అక్కడే రిజస్ట్రీ పూర్తి చేస్తామని తెలిపింది. జైక్వీ భర్త పింటు మాట్లాడుతూ.. చైనాలోనూ మ్యారేజీ ఫంక్షన్ ఉంది. ముందుగా ఇండియాలో పెళ్లి చేసుకోవాలని అనుకున్నాం. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఆమె కుటుంబం భారత్ కు రాలేకపోయింది. చైనాలో మరో ఫంక్షన్ చేసుకుంటాం’ అని పెళ్లికొడుకు పింటూ తెలిపారు.