Businessman In Bankruptcy Sells Sausages : వ్యాపారం దివాలా.. రూ.52 కోట్ల అప్పు తీర్చటానికి రోడ్డు పక్కన మాసం అమ్ముతున్న బిలియనీయర్

ఓ బిలియనీయర్ చేసే వ్యాపారం దివాలా తీసింది. భారీగా అప్పు మిగిలింది. ఉన్న ఆస్తులు అమ్మి చాలావరకు అప్పులు తీర్చాడు, కానీ ఇంకా రూ.52 కోట్ల అప్పు తీర్చాల్సి ఉంది. దీంతో ఆ అప్పు తీర్చటానికి రోడ్డు పక్కన మాసంతో తయారు చేసిన ఆహారాలు అమ్ముతున్నాడు.

Businessman In Bankruptcy Sells Sausages : వ్యాపారం దివాలా.. రూ.52 కోట్ల అప్పు తీర్చటానికి రోడ్డు పక్కన మాసం అమ్ముతున్న బిలియనీయర్

Chinese Businessman In Bankruptcy Sells Sausages

Businessman In Bankruptcy Sells Sausages : ఓడలు బండ్లు..బండ్లు ఓడలు అయ్యాయని పెద్దలు చెప్పిన సామెత. అలాగే పూలు అమ్మిన చోటే కట్టెలు అమ్మే పరిస్థితి అని కూడా అంటుంటారు. ఈ సామెతలు ఓ బిలియనీయర్ విషయంలో అక్షర సత్యాలు కనిపిస్తోంది. ఎందుకంటే ఒకప్పుడు కోట్ల రూపాయల టర్నోవర్ తో వ్యాపారం చేసిన సదరు వ్యక్తి ఇప్పుడు వ్యాపారం దివాలా తీయటంతో వచ్చి పడిన రూ.50 కోట్లకు పైగా అప్పు తీర్చటానికి రోడ్డు పక్క ఓ బండి పెట్టుకుని మాంసం అమ్ముకుంటున్నాడు. మాంసంతో తయారు చేసిన ఆహార పదార్ధాలు అమ్ముతున్నాడు. మరి ఇప్పుడు చెప్పండి పూలు అమ్మిన చోట కట్టెలు అమ్మటం అంటే ఇదే కదా..ఓడలు బండ్లు అయ్యాయి అంటే ఇంతకంటే నిదర్శనం ఏముంటుంది..?

చైనాకు చెందిన 52 ఏళ్ల తాంగ్‌జియన్‌ కు వచ్చింది ఇటువంటి దుస్థితి. 36 ఏళ్లకే కోట్ల రూపాయల వ్యాపార టర్నోవర్ చేసిన తాంగ్ జియన్ తన వ్యాపారం దివాలా తీసినా ఏమాత్రం భయపడలేదు. ఎలా బతకాలి? అప్పు ఎలా తీర్చాలని అని దిగులు పడుతు కూర్చోలేదు. ఉన్న ఆస్తి అమ్మేసి చాలావరకు అప్పులు తీర్చారు. ఇంకా రూ.52 కోట్ల అప్పు మిగిలింది. దానికి అతను ఏమాత్రం బేజారవ్వలేదు. చేయటానికి పని ఉంది..కష్టపడాలనే తపన ఉంది..అప్పు ఎంత తీర్చేద్దాం అనుకున్నాడు. ఒకప్పుడు బిలియనీయర్ గా ఉన్న నేను ఓ సాధారణ షాపు పెట్టటమేంటీ? అని అనుకోలేదు. చేసే పనిలో నిజాయితీ ఉండాలిగానీ చిన్నది పెద్దది అనేది ఉండదనుకున్నాడు. అలా తనకున్న రూ.52 కోట్ల అప్పు తీర్చటానికి చిన్నపాటి వ్యాపారాన్ని ప్రారంభించారు. ఈ చిన్నపాటి వ్యాపారంతో అంత పెద్ద అప్పు ఎలా తీర్చాలని కూడా ఆలోచించలేదు తాంగ్ జియన్. చేసే ప్రయత్నంలో లోపం ఉండకూదనుకున్నాడు అంతే..రోడ్డు పక్కన ఓ చిన్న షాపు పెట్టాడు. మాంసంతో ఆహారం పదార్ధాలు స్వయంగా వండి అమ్ముతున్నాడు. పోయినచోటే వెతుక్కోవాలన్నట్లుగా రెస్టారెంట్ల వ్యాపారంలో తనదైనశైలిలో ముద్ర వేసుకున్న తాంగ్ జియన్ మాంసంతో తయారు చేసే ఆహారాలను అమ్ముతున్నారు.

తాంగ్‌జియన్‌ విజయవంతమైన వ్యాపారవేత్త. రెస్టారంట్ల వ్యాపారంలో తనదైన శైలిలో పేరు సంపాదించారు. 36 ఏళ్ల వయసుకే కోట్ల రూపాయల వ్యాపారాన్ని డెవలప్ చేశారు. ఈ క్రమంలో 2005లో ల్యాండ్‌స్కేప్‌ ఇంజనీరింగ్ పరిశ్రమలోకి అడుగుపెట్టటంతో కష్టం మొదలైంది. ఆ వెంచర్‌లో పెట్టుబడి భారీ నష్టాలను మిగిల్చింది. దాంతో ఆయన తన రెస్టారంట్లు, ఇళ్లు, కార్లు అమ్ముకోవాల్సి వచ్చింది. ఉన్నదంతా ఊడ్చి అప్పులు కట్టేశారు. అయినా సరే ఇంకా రూ.52 కోట్లు అప్పు మిగిలిపోయింది. దాంతో మాంసంతో తయారు చేసిన ఆహారపదార్థాల(Sausage)ను స్వయంగా తయారు చేసి అమ్మటం మొదలుపెట్టారు. హాంగ్‌ఝౌలోని ఓ వీధిలో దుకాణాన్ని ఏర్పాటు చేసుకున్నారు.

తను తయారు చేసే వంటకాల గురించి తాంగ్ జియన్ మాట్లాడుతూ..‘నేను అమ్మే మాంసాహారంలో ఎలాంటి పిండి ఉండదని అంతా మాంసంతోనే తయారు చేస్తానని తెలిపారు. పార్కులు, మార్కెట్లలో అమ్మే పదార్ధాలతో పోలిస్తే..నా వంట చాలా సురక్షితమైనది అని తెలిపారు.దేనికైనా ఇప్పుడు పబ్లిసిటీయే ముఖ్యం అందుకే తాంగ్ తన వ్యాపారం గురించి ప్రచారం తానే స్వయంగా ప్రచారం చేసుకుంటున్నారు. అలాగే కోటీశ్వరుడి స్థాయి నుంచి ఒక వీధి వ్యాపారిగా మారాల్సి వచ్చిన పరిస్థితి తాంగ్ మాట్లాడుతూ..ప్రతి ఒక్కరు సవాళ్లతో కూడిన జీవితాన్ని గడుపుతుంటారు. ఎన్నో కష్టనష్టాలను చవిచూస్తుంటారు. అయితే ఓటమిని అంగీకరించకూడదనే స్ఫూర్తి నిరంతరం కలిగిఉండాలి’ అని తన ఆశావాదాన్ని వివరించారు. జీవితం పెట్టిన పరీక్షలను ఏమాత్రం బేజారు చెందకండా ధీటుగా ఎదుర్కొంటోన్న తాంగ్ జియన్ స్టోరీ చైనాలో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఆయన ఆత్మస్థైర్యానికి నిదర్శనంగా తాంగ్ ప్రస్తుత వ్యాపారం అక్కడ ట్రెండ్ అవుతోంది.