చైనాలో ‘వన్ చైల్డ్ పాలసీ’ మార్పు : ఇద్దరు పిల్లల్ని కనండీ..అని మొత్తుకుంటున్న చైనా ప్రభుత్వం

చైనాలో ‘వన్ చైల్డ్ పాలసీ’ మార్పు : ఇద్దరు పిల్లల్ని కనండీ..అని మొత్తుకుంటున్న చైనా ప్రభుత్వం

China Child Birth fall : ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ జనాభా కలిగిన దేశం చైనాలో పిల్లలు పుట్టటం లేదు. చైనా సమాజంలో చోటుచేసుకున్న ఆర్థిక, సామాజిక మార్పులతో జీవన వ్యయం భారీగా పెరిగింది. దీనికి తగినట్లుగా జననాల రేటు తగ్గింది. చైనా యువత పెళ్లిళ్లు చేసుకోవట్లేదు. పెళ్లైదంపతులు పిల్లల్ని కనడం మానేసి వాయిదాలు వేసుకుంటున్నారు. దీంతో చైనాలో జనాభా తగ్గిపోవటం తగ్గిపోయింది. ఈ విషయాన్ని తాజా గణాంకాల ద్వారా గుర్తించిన ప్రభుత్వం ఆదోళన వ్యక్తంచేస్తోంది.

ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన చైనా జనాభాను తగ్గించాలని తీసుకన్న నిర్ణయం కాస్తా దేశంలో జననాల రేటు భారీగా పడిపోయింది. చైనా దశాబ్దాల పాటు అవలభించిన ‘వన్ చైల్డ్ పాలసీ’తో యువతరం జనాభా గణనీయంగా తగ్గి, వృద్ధుల సంఖ్య పెరిగింది. దీంతో మానవ వనరుల కొరత పెరిగింది. దీంతో ప్రభుత్వం మేలుకుంది. దిద్దుబాటు చర్యలలు ప్రారంభించింది చైనా ప్రభుత్వం.

1970లో ప్రవేశపెట్టిన “వన్-చైల్డ్ పాలసీ”లో మార్పులు చేసింది. జనాభా పెంచటానికి 2016లో నిబంధనల్ని సడలించింది. ఇద్దరు పిల్లల్ని కనండీ అని చెబుతోంది. అయినా సరే దేశంలో జననాల రేటు పెరగటంలేదు. ప్రభుత్వం ఆశించిన మేర ఫలితాలు రాలేదు. చైనా ప్రజా భద్రతా మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా గత సోమవారం (జనవరి 8,2021) గణాంకాల్లో దేశంలో జననాల రేటు తగ్గిపోయిందనే విషయం తేట తెటల్లమైంది.

మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారంగా చూస్తే..2020లో చైనాలో 10.04 మిలియన్ల జననాలు మాత్రమే నమోదయ్యాయి. ఇది 2019 సంవత్సరంతో పోలిస్తే పునరుత్పత్తి రేటు 30 శాతానికి పైగా తగ్గిపోయాయని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇలా జనన రేటు తగ్గుముఖం పట్టడం వరుసగా నాలుగు సంవత్సరాలపాటు కొనసాగింది. నమోదవుతున్న జననాల్లో 52.7 శాతం బాలురు, 47.3 శాతం బాలికలు ఉన్నారని మంత్రి శాఖ స్పష్టం చేసింది.

చైనా ఎదుర్కొంటున్న ఈ జనాభా సంక్షోభ ప్రమాదానికి మూలాలు 1970లో ప్రవేశపెట్టిన ‘‘వన్ చైల్డ్ పాలసీ’’తో మొదలయ్యాయి. దేశంలో విపరీతంగా పెరిగిపోతున్న జనాభాను తగ్గించాలనుకున్న ఆనాటి ప్రభుత్వం ‘‘వన్ చైల్డ్ పాలసీ’’ని తీసుకొచ్చింది. ఈ నిబంధనల ప్రకారం దంపతులకు ఒకరే సంతానాన్ని కనాలి. అంతకంటే ఎక్కువ కనకూడదు. ఈ నిబంధనల్ని ప్రభుత్వం కట్టుదిట్టంగా అమలు చేసింది. ఒక్క బిడ్డనే కనాలని ఆదేశాలు జారీ చేసింది.

ఈ విధానం మొదట్లో ఆశించిన ఫలితం ఇచ్చినప్పటికీ, రానూ రానూ జనాభా సంక్షోభానికి కారణమైంది. ఫలితంగా దేశంలో యువత జనాభా తగ్గడం మొదలైంది. అదే సమయంలో వృద్ధుల జనాభా పెరిగింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే మానవవనరుల లభ్యత తగ్గిపోవచ్చని భావించిన చైనా ప్రభుత్వం 2016లో ఈ పాలసీకి ముగింపు పలికి.. ఇద్దరు పిల్లలను కనడానికి అనుమతినిచ్చింది. కానీ ఫలితాలు మాత్రం ఆశించినంతగా లేవు.


వన్ చైల్డ్ పాలసీతో తగ్గిన యువత.. పెరిగిన వృద్ధ జనాభా..
చైనా సమాజంలో చోటుచేసుకున్న ఆర్థిక, సామాజిక మార్పులతో జీవన వ్యయం భారీగా పెరిగింది. దీంతో యువత పెళ్లిళ్లను, దంపతులు పిల్లల్ని కనడాన్ని వాయిదా వేసుకోవడం ప్రారంభించారు. దీంతో తాజాగా అక్కడ పునరుత్పత్తి రేటు ప్రమాదకర స్థాయికి చేరుకుంది. సాధారణంగా దశాబ్దానికి ఒకసారి చేపట్టే జనాభా గణనను గత నవంబరులో చైనా ప్రారంభించింది.

ఒక్కరు కాదు ఇద్దరు పిల్లల్ని కనండి అని చెబుతోంది.కానీ ఈ ఇద్దరు పిల్లల విధానం చైనా జనాభాపై ప్రభావాన్ని చూపడానికి మరో దశాబ్దానికి పైగానే అంటే..15 సంవత్సరాలు పట్టవచ్చని జనాభా లెక్కల నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో 2025 నాటికి చైనా వృద్ధ జనాభా 300 మిలియన్లకు చేరుకుంటారని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.