చైనా డైవోర్స్ కేసు : ఇంట్లో పని చేసిన భార్యకు రూ. 7700 డాలర్లు చెల్లించాలి

చైనా డైవోర్స్ కేసు : ఇంట్లో పని చేసిన భార్యకు రూ. 7700 డాలర్లు చెల్లించాలి

chaina

Chinese court : ఇంట్లో పని చేసిన భార్యకు రూ. 7 వేల 700 డాలర్లు చెల్లించాలని భర్తకు కోర్టు ఆర్డర్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇంటిని చక్కదిద్దేందుకు ఆమె డబ్బు తీసుకోకుండా..పని చేసిందని వెల్లడిచింది. ఇది భారతదేశంలో మాత్రం కాదులెండి. చైనాలో ఓ డైవోర్స్ విషయంలో కోర్టు చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. విడాకులు ఇవ్వాలని భావించే వ్యక్తి..గతంలో తన భార్య చేసిన పనికి కూడా డబ్బులు చెల్లించాల్సిందిగా ఆదేశించింది. ఆన్ లైన్ లో ఈ తీర్పుపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మహిళల పనిని ఇప్పటికైనా గుర్తించారంటూ..కొందరు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంవత్సరం చైనా కొత్త సివిల్ కోడ్ అమల్లోకి వచ్చింది. వారు కలిసి ఉన్న రోజుల్లో భార్యలు ఇంట్లో ఎక్కువ బాధ్యతలు తీసుకుంటే అందుకు గాను వారు పరిహారం కోరవచ్చు.

వివరాల్లోకి వెళితే..

చైన్ – వాంగ్ దంపతులకు ఐదు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. దంపతుల మధ్య కొన్ని కారణాల వల్ల..కొద్ది రోజుల క్రితం వీరు విడాకులు తీసుకున్నారు. కోర్టు ఆమెకు భరణం ఇప్పించింది. ఈ క్రమంలోనే..ఈ నెల 04వ తేదీ నుంచి కొత్త సివిల్ లా అమల్లోకి వచ్చింది. వాంగ్ కొత్త చట్టం ప్రకారం..తామిద్దరు కలిసి ఉన్న ఐదేళ్లలో ఇంటి పనులు చేసినందుకు గాను తనకు ఎక్స్ ట్రా డబ్బులు చెల్లించాల్సిందిగా కోరుతూ..బీజింగ్ కోర్టును ఆశ్రయించింది. ఈ సందర్భంగా వాంగ్ తన వాదనలు వినిపించింది.

court

గడిచిన ఐదు సంవత్సరాల్లో ఇంటి పని, పిల్లల బాగోగులు అన్ని తాను చూసుకోవడం జరిగిందని, చెన్ కొంచెం కూడా పట్టించుకోలేదని తెలిపింది. ఆఫీసు బాధ్యతలు మాత్రమే నిర్వహించేవాడని, తనకు రోజంతా పిల్లలు, ఇంటి పనితోనే సరిపోయేదని తన బాధను వ్యక్తపరిచింది. తనకు ఎక్కువ పరిహారం ఇప్పించాలని కోరుతున్నట్లు తెలిపింది. వాంగ్ వాదనలతో కోర్టు ఏకీభవించింది. ఆమెకు అనుకూలంగా తీర్పును వెలువరించింది. ఐదు సంవత్సరాలు పాటు వాంగ్‌ చేసిన ఇంటి పనికి గాను 7,700 డాలర్లు(5,56,937.15 రూపాయలు) చెల్లించాల్సిందిగా ఆదేశిస్తూ.. తీర్పు వెల్లడించింది.

wife and husband

దీంతో చైనీస్ ట్విట్టర్ వీబోలో హాట్ హాట్ చర్చలు జరుగుతున్నాయి. ‘ఇంట్లోనే ఉండే భార్యలు తాము చేసే పనికి 50 వేల యువాన్‌ల పరిహారాన్ని పొందవచ్చు’ అనే హాష్‌ట్యాగ్‌ ప్రస్తుతం ట్రెండ్‌ అవుతోంది. భార్యలు చేసే పని మీకు ఇంత చీప్‌గా కనిపిస్తుందా’’ అంటూ మరికొంత మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చైనాలో ఇటీవల తీసుకువచ్చిన నూతన సివిల్‌ కోడ్‌కు అనుగుణంగా కోర్టు మహిళలకు అనుకూలంగా ఉత్తర్వులు వెలువరించింది. నూతన చట్టం ప్రకారం విడాకుల ప్రక్రియ సందర్భంగా ఇంటిని చక్కదిద్దడంతో పాటు పిల్లల పెంపకం, వృద్ధులను బాగా చూసుకున్నందుకు మహిళలు పరిహారం కోరవచ్చంటున్నారు