CoronaVac : చిన్నారులకు చైనా వ్యాక్సిన్ సేఫ్ !

చిన్నారులు మరియు 18 ఏళ్ల లోపు వారి కోసం చైనాకి చెందిన సినోవాక్ లైఫ్ సైన్సెస్ కంపెనీ అభివృద్ధి చేసిన కోవిడ్ వ్యాక్సిన్(CoronaVac)సేఫ్‌ గా తేలింది.

CoronaVac : చిన్నారులకు చైనా వ్యాక్సిన్ సేఫ్ !

China

CoronaVac చిన్నారులు మరియు 18 ఏళ్ల లోపు వారి కోసం చైనాకి చెందిన సినోవాక్ లైఫ్ సైన్సెస్ కంపెనీ అభివృద్ధి చేసిన కోవిడ్ వ్యాక్సిన్(CoronaVac)సేఫ్‌ గా తేలింది. రెండు డోసుల “కరోనా వ్యాక్” వ్యాక్సిన్ చిన్నారుల్లో బలమైన యాంటీబాడీ రెస్ఫాన్స్ ను ఉత్పత్తి చేస్తున్నట్లు తేలింది. దీనికి సంబంధించిన మెడికల్ అండ్ రీసెర్చ్ డేటాను లాన్సెట్ ఇన్ఫెక్టియస్ డిసీజెస్ జర్నల్ ప్రచురించింది. మూడేళ్ల నుంచి 17 సంవత్సరాల్లోపు వయస్సున్న వారిపై గత ఏడాది అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్యకాలంలో నిర్వహించిన ఫేజ్-1,2 క్లినికల్ ట్రయిల్స్ లో ఈ విషయం నిరూపితమైందని లాన్సెంట్ జర్నల్ స్పష్టం తెలిపింది.

చైనాలోని జన్హువాంగ్ లో 550 మంది ఆరోగ్యవంతులైన పిల్లలు మరియు యుక్త వయస్సు వచ్చిన వారిపై రీసెర్చర్లు కరోనా వ్యాక్ ఫేజ్-1,2 క్లినికల్ ట్రయిల్స్ చేపట్టారు. వారిలో 96 శాతం మందికి రెండో డోసుల కరోనావ్యాక్ వ్యాక్సిన్ ఇచ్చారు. ఆ తరువాత వారి శరీరంలో సంభవించిన పరిణామాలపై అధ్యయనం చేశారు. కరోనావ్యాక్ టీకా తీసుకున్న అనంతరం వారిలో కోవిడ్ ను ప్రతిఘటించే, నిలువరించే యాంటీబాడీస్ అభివృద్ధి చెందినట్లు గుర్తించారు. ఈ వ్యాక్సిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా పెద్దగా లేవని నిపుణులు నిర్ధారించారు. ఇంజెక్షన్ చేసిన చోట నొప్పి, జ్వరం రావడం మాత్రమే ఈ టీకా వల్ల కలిగే అత్యున్నత స్థాయి సైడ్ ఎఫెక్ట్ లు అని, ఇది అన్ని వ్యాక్సిన్ల వల్ల కూడా సంభవిస్తుందని స్పష్టం చేశారు.

తొలిదశ క్లినికల్ ట్రయిల్స్‌ లో.. ఒకటిన్నర, మూడు మైక్రోగ్రాముల మేర వ్యాక్సిన్ డోసును వేర్వేరు గ్రూపులకు ఇంజెక్ట్ చేయగా.. వారిలో వందశాతం మేర యాంటీబాడీస్ అభివృద్ధి చేందినట్లు లాన్సెట్ జర్నల్ తెలిపింది. రెండో విడత ట్రయిల్స్‌ లో.. ఒకటిన్నర మైక్రో గ్రాముల మేర కరోనా వ్యాక్ డోసును ఎక్కించిన వారిలోనూ వందశాతం మేర ప్రభావం కనిపించింది. అనంతరం కొన్ని రకాల పరీక్షలను నిర్వహించిన తర్వాత కరోనావ్యాక్ వ్యాక్సిన్‌ను మూడేళ్ల నుంచి 17 సంవత్సరాల్లోపు వయస్సున్న వారికి వినియోగించడానికి ఉపకరిస్తుందని నిర్ధారించినట్లు లాన్సెట్ జర్నల్ పేర్కొంది.