China : భారతీయ విద్యార్థులకు చైనా గుడ్‌న్యూస్

2019లో చైనాలో క‌రోనా స్వైర విహారం చేయ‌డంతో వారు భార‌త్‌కు తిరిగి వ‌చ్చేశారు. చైనా ప్రభుత్వం ఆంక్షలతో వారంతా భారత్‌లోనే ఉండిపోయారు.

China : భారతీయ విద్యార్థులకు చైనా గుడ్‌న్యూస్

China

China good news : చైనాలో విద్యనభ్యసించే భారతీయ విద్యార్ధులకు డ్రాగన్‌ దేశం గుడ్ న్యూస్‌ చెప్పింది. కోవిడ్ కార‌ణంగా భార‌త్‌లోనే ఇరుక్కుపోయిన విద్యార్థులు తిరిగి చైనాకు రావ‌డానికి ఆ దేశ‌ విదేశాంగ శాఖ ఓకే చెప్పింది. అయితే.. కొన్ని ష‌ర‌తుల‌తో, కొంద‌రికే ప్రస్తుతానికి అనుమ‌తి ఉంటుంద‌ని తెలిపింది. కరోనా కార‌ణంగా గ‌త రెండేళ్లుగా చైనా స‌ర్కార్ కొన్ని ఆంక్షలు విధించింది. దీంతో అక్కడ చ‌దివే భార‌తీయ విద్యార్థులు తిరిగి వెళ్లలేకపోయారు.

అయితే చైనాలో చ‌దువుకునే భార‌తీయ విద్యార్థుల‌కు తాము అత్యంత ప్రాధాన్యమిస్తామ‌ని ఆ దేశ విదేశాంఖ శాఖ కార్యదర్శి ప్రక‌టించారు. ఇప్పటికే ఈ ప్రక్రియ ప్రారంభ‌మైంద‌ని వెల్లడించారు. దాదాపు 23 వేల మంది భార‌తీయ విద్యార్థులు చైనాలో మెడిసిన్ అభ్యసిస్తున్నారు.

India – China Visas: చైనానే మనకు వీసాలు ఇవ్వడంలేదు: భారత విదేశాంగశాఖ కార్యదర్శి

2019లో చైనాలో క‌రోనా స్వైర విహారం చేయ‌డంతో వారు భార‌త్‌కు తిరిగి వ‌చ్చేశారు. చైనా ప్రభుత్వం ఆంక్షలతో వారంతా భారత్‌లోనే ఉండిపోయారు. అప్పటి నుంచి చైనాకు తిరిగి వెళ్లేందుకు అనేక ప్రయ‌త్నాలు చేస్తూనే ఉన్నారు.