Chinese President: వరుసగా మూడోసారి కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా, చైనా అధ్యక్షుడిగా ఎన్నికై రికార్డు సృష్టించిన జిన్ పింగ్

చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ రికార్డు సృష్టించారు. వరుసగా మూడోసారి అధికార కమ్యూనిస్టు పార్టీ నాయకుడిగా (పార్టీ ప్రధాన కార్యదర్శిగా) ఎన్నికయ్యారు. ఇంతకుముందు ఈ రికార్డు కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థాపకుడు మావో జెడాంగ్ పేరుపై మాత్రమే ఉంది. జిన్ పింగ్ 2012, నవంబరు 15 నుంచి చైనా కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. చైనా అధ్యక్షుడిగా ఆయన 2013, మార్చి 14న మొదటిసారి బాధ్యతలు చేపట్టారు. రెండోసారి కూడా ఆయనే అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. వచ్చే ఏడాది మార్చిలో మూడోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తారు.

Chinese President: వరుసగా మూడోసారి కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా, చైనా అధ్యక్షుడిగా ఎన్నికై రికార్డు సృష్టించిన జిన్ పింగ్

Chinese President: చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ రికార్డు సృష్టించారు. వరుసగా మూడోసారి అధికార కమ్యూనిస్టు పార్టీ నాయకుడిగా (పార్టీ ప్రధాన కార్యదర్శిగా) ఎన్నికయ్యారు. ఇంతకుముందు ఈ రికార్డు కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థాపకుడు మావో జెడాంగ్ పేరుపై మాత్రమే ఉంది. జిన్ పింగ్ 2012, నవంబరు 15 నుంచి చైనా కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. చైనా అధ్యక్షుడిగా ఆయన 2013, మార్చి 14న మొదటిసారి బాధ్యతలు చేపట్టారు. రెండోసారి కూడా ఆయనే అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. వచ్చే ఏడాది మార్చిలో మూడోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తారు.

ఆ తర్వాత అధ్యక్షుడిగా ఐదేళ్లపాటు కొనసాగనున్నారు. చైనా కమ్యూనిస్టు పార్టీ 20వ జాతీయ మహాసభల్లో ఈ మేరకు తీర్మానం చేశారు. ఇవాళ స్టాండింగ్‌ కమిటీ షీ జిన్ పింగ్ పేరును తమ నాయకుడిగా అధికారికంగా ప్రకటించింది. కాగా, కమ్యూనిస్టు పార్టీలో నంబర్ 2గా ఉన్న చైనా ప్రధాని, పొలిట్‌బ్యూరో, స్టాండింగ్‌ కమిటీ సభ్యుడు లీ కెకియాంగ్‌కు షీ జిన్ పింగ్ ఉద్వాసన పలికిన విషయం తెలిసిందే.

అంతేగాక, తనకు పోటీగా నిలిచే అవకాశం ఉన్న మరో ముగ్గురు నేతలను కూడా ఆయన తమ పార్టీ కేంద్ర కమిటీ నుంచి తప్పించారు. పార్టీ సెంట్రల్ కమిటీ 25 మంది నాయకులతో కొత్త పొలిటికల్ బ్యూరోను ఎన్నుకుంది. నిజానికి చైనా అధ్యక్షుడిగా నేత 68 ఏళ్ల వయసు వచ్చే వరకే కొనసాగాలి. ఇప్పుడు షీ జిన్ పింగ్ కి 69 ఏళ్లు. తానే చైనా అధ్యక్షుడిగా ఉండాలన్న దురాశతో జిన్ పింగ్ 2018లో పార్టీ రాజ్యాంగాన్ని సవరించారు. మూడోసారి కూడా పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టేందుకు మార్గాన్ని సుగమం చేసుకున్నారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..