Jinping On ZeroCovid Policy : ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురైనా పట్టించుకోవద్దు, కఠినంగా వ్యవహరించండి- జిన్ పింగ్ | Chinese President Xi Jinping issues strongest warning to silence uproar over zero-Covid policy

Jinping On ZeroCovid Policy : ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురైనా పట్టించుకోవద్దు, కఠినంగా వ్యవహరించండి- జిన్ పింగ్

దేశంలో కరోనా కట్టడికి కఠిన నిర్ణయాలు అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురైనా లెక్క చేయకుండా జీరో కొవిడ్ పాలసీని ముందుకు తీసుకెళ్లాలని చెప్పారు.(Jinping On ZeroCovid Policy)

Jinping On ZeroCovid Policy : ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురైనా పట్టించుకోవద్దు, కఠినంగా వ్యవహరించండి- జిన్ పింగ్

Jinping On ZeroCovid Policy : కరోనా వైరస్‌ను మొదట గుర్తించిన చైనాలో మహమ్మారి మరోసారి కోరలు చాచింది. ఒక్కసారిగా అక్కడ పాజిటివ్ కేసులు పెరిగిపోయాయి. 2019 తర్వాత ఎన్నడూ లేని స్థాయిలో మహమ్మారి తీవ్రత చూపిస్తోంది. దాంతో చైనా ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. కరోనా కట్టడికి కఠిన చర్యలు చేపట్టింది. ఫలితంగా పలు నగరాలు కఠిన ఆంక్షల చట్రంలో బందీగా ఉన్నాయి. కరోనా కట్టడిలో భాగంగా చైనా ప్రభుత్వం జీరో కోవిడ్ పాలసీని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, దీనిపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రభుత్వ తీరుకి వ్యతిరేకంగా ప్రజలు రోడ్డెక్కి నిరసనలు, ఆందోళనలు చేసే పరిస్థితి ఏర్పడింది.

Next Pandemic: వాతావరణ మార్పులతో జంతువులు వైరస్ వ్యాప్తి పెరిగేందుకు కారణమవుతున్నాయా?

ఈ క్రమంలో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో కరోనా కట్టడికి కఠిన నిర్ణయాలు అమలు చేయాలని జిన్ పింగ్ అధికారులను ఆదేశించారు. ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురైనా లెక్క చేయకుండా జీరో కొవిడ్ పాలసీని ముందుకు తీసుకెళ్లాలని చెప్పారు. వూహాన్ లో కరోనాపై ఏ విధంగా అయితే విజయం సాధించామో, అదే విధంగా షాంఘైలోనూ విజయం సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతేకాదు, కోవిడ్ పాలసీని వ్యతిరేకించే వారిని కఠినంగా శిక్షించాలని, సోషల్ మీడియాలో అసత్యపు ప్రచారానికి అడ్డుకట్ట వేయాలని అధికారులను ఆదేశించారు జిన్ పింగ్.(Jinping On ZeroCovid Policy)

చైనాలో ప్రధాన నగరాలైన బీజింగ్, షాంఘైలో కరోనా విజృంభిస్తోంది. ప్రస్తుతం షాంఘైలో కేసులు తగ్గుముఖం పడుతోన్న సమయంలో బీజింగ్‌లో కేసులు పెరుగుతున్నాయి. దాంతో స్థానిక యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రజలు రెస్టారెంట్లలో భోజనం చేయొద్దంటూ నిషేధం విధించింది. కరోనా వైరస్ వెలుగుచూసిన ఇళ్లు, భవనాలను సీల్‌ చేస్తోంది. పర్యాటకులకు కొవిడ్ నెగెటివ్ సర్టిఫికెట్ ను తప్పనిసరి చేసింది.

Chinese President Xi Jinping issues strongest warning to silence uproar over zero-Covid policy

Chinese President Xi Jinping issues strongest warning to silence uproar over zero-Covid policy

షాంఘై తరహా పరిస్థితుల్ని నివారించేందుకు ఈ ముందుజాగ్రత్త చర్యలు చేపడుతోంది. షాంఘై నగరంలో లాక్‌డౌన్ కారణంగా అక్కడి ప్రజలు ఆకలితో అల్లాడిపోయినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఆంక్షలతో విసిగిపోయిన ప్రజల నిరసన స్వరాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ప్రస్తుతం షాంఘై నగరంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య దిగొస్తోంది.

కాగా.. కోవిడ్ వైరస్ సంగతి పక్కన పెడితే.. చైనా ప్రజలను ప్రభుత్వ చర్యలు ఎక్కువగా భయపెడుతున్నాయి. జీరో కరోనా పాలసీతో దారుణమైన లాక్‌డౌన్‌తో అక్కడి ప్రజలు నానా పాట్లు పడుతున్నారు. తినడానికి సరైన తిండి కూడా దొరక్క పిచ్చెక్కిపోతున్నారు. కదలకుండా ఇళ్లలోనే ఉంచడంతో హాహాకారాలు చేస్తున్నారు. దీనికితోడు పాజిటివ్‌ అని తేలితే.. కరోనా లక్షణాలు లేకపోయినా ఐసోలేషన్‌కు పంపిస్తున్నారు. పిల్లలకు పాజిటివ్ అని తెలిస్తే చాలు.. వారిని తల్లిదండ్రుల నుంచి దూరం చేసి ఎక్కడో పెట్టేస్తున్నారు.

Covid in China : అట్లుంటది చైనాలో..ఎంత బలవంతంగా కోవిడ్ పరీక్షలు చేస్తున్నారో..!!

దీనికితోడు బలవంతంగా కరోనా పరీక్షలు చేస్తున్నారు. వ్యాక్సిన్లు ఇస్తున్నారు. ఎంత బలవంతంగా అంటే కిందపడేసి, చేతులు పట్టుకుని మరీ వ్యాక్సిన్లు ఇస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఓ మ‌హిళ‌ను బ‌ల‌వంతంగా టెస్టింగ్ సెంట‌ర్‌లో కూర్చోబెట్టి, క‌రోనా ప‌రీక్ష‌లు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఓ మహిళను నేలమీద పడుకోబెట్టి ఆమె మీద కూర్చుని బలవంతంగా నోరు తెరిచి మరీ కరోనా టెస్ట్ చేస్తున్న దృశ్యాలు షాక్ కి గురి చేస్తున్నాయి.

×