China President : రష్యా పర్యటనకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ .. యుక్రెయిన్‌కు శుభవార్త వస్తుందా?

జిన్‌పింగ్ రష్యా పర్యటనపై చైనా ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. మూడు రోజుల పర్యటనలో ఇరుదేశాల మధ్య సంబంధాలు, భవిష్యత్తులో వ్యూహాత్మక పరస్పర సహకారం వంటి అంశాలతో పాటు రష్యా - యుక్రెయిన్ మధ్య యుద్ధానికి ముగింపు పలికేలా జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య చర్చలు జరుగుతాయని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి తెలిపారు.

China President : చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ రష్యాలో పర్యటించనున్నారు. ఇటీవల మూడోసారి చైనా అధ్యక్షుడిగా జిన్‌పింగ్ బాధ్యతలు చేపట్టిన విషయం విధితమే. ఆ తరువాత ఆయన తొలిసారి జరిపే విదేశీ పర్యటన రష్యానే కావటం గమనార్హం. ఈనెల 20 నుంచి 22వ తేదీ వరకు మూడు రోజుల పాటు రష్యాలోనే జిన్‌పింగ్ ఉంటారు. ఈ పర్యటనలో భాగంగా ఇరు దేశాల అధ్యక్షుల మధ్య సమగ్రమైన భాగస్వామ్యం, భవిష్యత్తులో వ్యూహాత్మకమైన పరస్పర సహకారంతో‌పాటు అనేక సంబంధిత అంశాలపై చర్చించనున్నారని రష్యా అధికార భవనం క్రెమ్లిన్ ఓ ప్రకటనలో తెలిపింది.

Russia vs Ukraine War: యుక్రెయిన్‌పై ప‌ట్టుకోసం.. క‌మాండ‌ర్‌ను మార్చిన ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్‌..

జిన్‌పింగ్ రష్యా పర్యటనపై చైనా ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. మూడు రోజుల పర్యటనలో ఇరుదేశాల మధ్య సంబంధాలు, భవిష్యత్తులో వ్యూహాత్మక పరస్పర సహకారం వంటి అంశాలతో పాటు రష్యా – యుక్రెయిన్ మధ్య యుద్ధానికి ముగింపు పలికేలా జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య చర్చలు జరుగుతాయని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి తెలిపారు. పుతిన్, జిన్‌పింగ్‌కు గత పదేళ్లుగా మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో యుక్రెయిన్ యుద్ధాన్ని శాంతియుతంగా చర్చల ద్వారా ముగించాలని జిన్‌పింగ్ సూచనలను పుతిన్ తప్పక వింటారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే, ఇప్పటికే ఈ విషయంపై ఇరుదేశాల అధ్యక్షులు ఫోన్ లో మాట్లాడుకున్నారని, యుక్రెయిన్ – రష్యా యుద్ధాన్ని శాంతియుతంగా ముగించాలన్న ప్రధాన అజెండాతోనే చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ రష్యా వెళ్తున్నట్లు వాదనలుసైతం వినిపిస్తున్నాయి.

Ukraine vs Russia War : యుక్రెయిన్‌కు షాకిచ్చిన అమెరికా.. ఆ హామీని నెరవేర్చలేమన్న అమెరికా ప్రెసిడెంట్ జో బిడెన్

రష్యా, యుక్రెయిన్ మధ్య ఏడాదికాలంగా యుద్ధం కొనసాగుతోంది. యుక్రెయిన్ లోని అనేక నగరాలపై రష్యా సైన్యం క్షిపణుల దాడులతో విరుచుకుపడుతుంది. వేలాది మంది మరణించగా, లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. యుక్రెయిన్ పై యుద్ధాన్ని ఆపేందుకు అనేక దేశాలు ప్రయత్నిస్తున్నాయి, రష్యాకు హెచ్చరికలు సైతం చేస్తున్నాయి. అయినా రష్యా అధ్యక్షుడు పుతిన్ మాత్రం వెనక్కుతగ్గడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ మూడు రోజుల రష్యా పర్యటనలో యుక్రెయిన్ కు ఏమేరకు శుభవార్త వినిపిస్తారోనన్న అంశం చర్చనీయాంశంగా మారింది.

ట్రెండింగ్ వార్తలు