Corona in Bats: కొత్త కరోనా వైరస్‌లు.. గబ్బిలాల్లో కనిపెట్టిన చైనా!

Corona in Bats: కొత్త కరోనా వైరస్‌లు.. గబ్బిలాల్లో కనిపెట్టిన చైనా!

Chinese Researchers Find Batch Of New Coronaviruses In Bats

Chinese Find Batch Of New Coronaviruses: కరోనా వైరస్ మూలాల గురించి దర్యాప్తు చేస్తున్న చైనా పరిశోధకులు గబ్బిలాలలో కొత్త కరోనావైరస్‌లు కనుగొన్నారు. గబ్బిలాలలో కొత్తగా కనిపించిన వైరస్‌లు COVID-19 వైరస్‌ రెండూ జన్యుపరంగా ఒకేలా ఉన్నట్లుగా చైనా గుర్తించింది. గబ్బిలాల్లో కరోనా వైరస్‌లకు సంబంధించిన కొత్త బ్యాచ్‌ను గుర్తించామని, కొవిడ్‌-19 కారక సార్స్‌-కోవ్‌-2తో జన్యుపరంగా అత్యంత ఎక్కువ సారూప్యత ఉందని చైనా శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

గబ్బిలాల్లో ఇంకా గుర్తించని కరోనా వైరస్‌లు ఎన్నో మనుషులకు వ్యాపించే అవకాశం ఉందని, అటువంటి రకాలపై ఒక అంచనాకు వచ్చేందుకు పరిశోధనలు చేస్తున్నట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. చైనాలోని షాండాంగ్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు.. 2019 మే నుంచి గత ఏడాది నవంబరు వరకూ అడవుల్లో ఉండే గబ్బిలాల నుంచి మలాలను, నోటి శ్వాబ్‌ నమూనాలను సేకరించి పరీక్షించినట్లు చెప్పారు.

చైనా పరిశోధకుల అభిప్రాయం ప్రకారం, మొత్తం 24 కరోనా వైరస్ జన్యు క్రమాలను సేకరించామని, వైరస్‌లలో ఒకటి ప్రస్తుతం ఉన్న వైరస్‌కు చాలా దగ్గర పోలికలు ఉన్నాయని, జన్యుపరంగా SARS-CoV-2 వైరస్‌కు దగ్గరగా ఉందని, ఇదే కొనసాగుతున్న మహమ్మారికి కారణం అవుతుందని చెబుతున్నారు. మొత్తం నాలుగు సార్స్‌-కోవ్‌-2 తరహా కరోనా వైరస్‌లు ఉన్నట్లు వెల్లడించారు.

గతేడాది జూన్‌లో థాయ్‌లాండ్‌లో కనిపించిన సార్స్‌-కోవ్‌-2 తరహా వైరస్‌.. కొవిడ్‌-19 కారక వైరస్‌ను పోలిన వైరస్‌లు గబ్బిలాల్లో విస్తృతంగా వ్యాపిస్తున్నట్లు వెల్లడించారు. కొన్నిచోట్ల వాటి తీవ్రత చాలా ఎక్కువగా ఉందని, WHOతో సమావేశమైన తర్వాత COVID-19 మూలాలు అధ్యయనం కోసం సకాలంలో, పారదర్శకంగా పరిశోధనలు చేస్తున్నట్లు శాస్త్రవేత్తలు వివరించారు. COVID-19 మూలాన్ని మరింత పరిశోధించడానికి ఈ డేటా ఉపయోగపడుతుందని వారు చెబుతున్నారు.

COVID-19 కి కారణమయ్యే కరోనావైరస్ మూలం గురించి ఒకటన్నర సంవత్సరాల తరువాత కూడా మిస్టరీగా మిగిలిపోయింది, చైనాలోని వుహాన్ నగరంలో ఫస్ట్ కేసు నమోదవగా.. శాస్త్రవేత్తలు మరియు దేశాలు వైరస్ సహజంగా ఉద్భవించిందా? లేదా వుహాన్ వైరాలజీ ల్యాబ్‌లో తయారైందా? అనేదానిపై పరిశోధనలు చేస్తున్నారు.