Viral Video : రంగుల వెలుగులు విరజిమ్ముతూ ఆకాశం నుంచి రాలి పడిన చైనా రాకెట్ శిథిలాలు

మలేషియాలోని కుచింగ్ నగరంలో శనివారం అర్ధరాత్రి వేళ ఆకాశంలో కనిపించిన వింతకాంతులను చూసి ప్రజలు సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు.

Viral  Video :  రంగుల వెలుగులు విరజిమ్ముతూ ఆకాశం నుంచి రాలి పడిన చైనా రాకెట్ శిథిలాలు

Viral Video

Viral Video :  మలేషియాలోని కుచింగ్ నగరంలో శనివారం అర్ధరాత్రి వేళ ఆకాశంలో కనిపించిన వింతకాంతులను చూసి ప్రజలు సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. మొదట వీటిని ఉల్కలుగా భావించారు. చాలామంది వీటిని తమ మొబైల్ ఫోన్లలో వీడియో తీశారు. అయితే కొంత సేపటికి కానీ అర్ధం కాలేదు. ఇవి చైనా ప్రయోగించిన రాకెట్‌ శిథిలాలుగా నిర్ధారణ అయ్యింది. శనివారం అర్ధ రాత్రి సమయంలో భూ వాతావరణంలోకి ప్రవేశించిన చైనా రాకెట్ శిథిలాలు హిందూ మహా సముద్రంలో రాలి పడ్డాయి.

ఆకాశం నుంచి మండుతూ రంగు రంగుల కాంతులీనిన రాకెట్‌ శిథిలాలను తూర్పు ఆసియా, ఆగ్నేసియా దేశాలకు చెందిన పలువురు తమ మొబైల్‌ ఫోన్లలో రికార్డు చేశారు. తొలుత వాటిని ఉల్కలుగా వారంతా భావించారు. అయితే చైనా రాకెట్‌ శిథిలాలు అని నాసాతోపాటు పలువురు ఖగోళ శాస్త్రవేత్తలు నిర్ధారించారు. మరోవైపు ఈ వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.

కాగా, జూలై 24న లాంగ్ మార్చ్ 5బీ రాకెట్‌ను చైనా లాంచ్ చేసింది. అంతరిక్షంలో నిర్మిస్తున్న కొత్త చైనీస్ స్పేస్ స్టేషన్‌కు ప్రయోగశాల మాడ్యూల్‌ను 23 టన్నుల భారీ రాకెట్‌ ద్వారా పంపింది. అయితే ఈ ప్రయోగం గురించి ముందుగా సమాచారం ఇవ్వకపోవడంపై అమెరికా మండిపడింది. భారీ రాకెట్‌ శిథిలాలు భూమిపై ఎక్కడ పడతాయో అన్నది తెలియకపోవడం వల్ల భారీగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. అయితే వాషింగ్టన్ లోని చైనా రాయబార కార్యలయం దీనిపై వెంటనే వ్యాఖ్యనించలేదు. చైనా ఈ వారం ప్రాంరంభంలో శిధిలాలను నిశితంగా ట్రాక్ చేస్తుందని చెప్పింది. అయితే ఇది భూమిపై పడినప్పుడు తక్కువ ప్రమదాన్ని కలుగు చేస్తుందని మాత్రమే తెలిపింది.