starlink: స్టార్‌లింక్ శాటిలైట్ల‌ను ధ్వంసం చేసేందుకు చైనా ప్రణాళిక?

starlink: స్టార్‌లింక్ శాటిలైట్ల‌ను ధ్వంసం చేసేందుకు చైనా ప్రణాళిక?

Starlink

starlink:  ‘స్పేస్ఎక్స్‌’కు చెందిన స్టార్‌లింక్ శాటిలైట్ల‌ను ధ్వంసం చేసే వ్య‌వ‌స్థ‌ను అభివృద్ధి చేసుకోవాలని చైనా ప్ర‌భుత్వానికి ఆ దేశ శాస్త్ర‌వేత్త‌లు సూచించారు. స్టార్‌లింక్ శాటిలైట్ల వ‌ల్ల చైనా జాతీయ భద్రత‌కు ముప్పు వాటిల్లే ప‌రిస్థితులు వ‌స్తే వాటిని ధ్వంసం చేసేందుకు ప్ర‌ణాళిక రూపొందించుకోవాల‌ని చెప్పారు. శాస్త్రవేత్తల సూచనల మేరకు చైనా చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వివ‌రాల‌ను చైనాకు చెందిన మోడ‌ర్న్ డిఫెన్స్ జ‌ర్న‌ల్‌లో ప్ర‌చురించారు. బీజింగ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాకింగ్, టెలిక‌మ్యూనికేష‌న్స్‌కు చెందిన ప‌రిశోధ‌కుడు రెన్ యువాన్ జెన్ నేతృత్వంలో చైనా ర‌క్ష‌ణ శాఖకు చెందిన ప‌లువురు శాస్త్ర‌వేత్త‌లు స్టార్‌లింక్ శాటిలైట్లపై అధ్య‌యనం చేసి త‌మ ప్ర‌భుత్వానికి ఆయా సూచ‌న‌లు చేశారు.

PM Narendra Modi : కుటుంబ పాలన అంటూ సీఎం కేసీఆర్ పై ప్రధాని మోడీ ఘాటు విమర్శలు..

స్టార్‌లింక్ శాటిలైట్లపై నిఘా ఉంచే వ్య‌వ‌స్థ‌నూ అభివృద్ధి చేసుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని చైనాకు శాస్త్ర‌వేత్త‌లు సూచించారు. స్టార్‌లింక్ శాటిలైట్ల నుంచి చైనాకు ఏ విధంగా ముప్పు పొంచి ఉంద‌న్న అంశాల‌ను వివ‌రించారు. శత్రు దేశాల రాడార్లూ పసిగట్టలేని విధంగా దూసుకొచ్చి దాడులు చేయగలిగే అమెరికా స్టెల్త్ యుద్ధ విమానాలు, డ్రోన్ల డేటా ట్రాన్స్‌మిష‌న్ (ప్ర‌సార‌) వేగాన్ని 100 రెట్లు పెచే సామ‌ర్థ్యాన్నీ స్టార్‌లింక్ శాటిలైట్ వ్య‌వ‌స్థ సాధించే అవ‌కాశం ఉంద‌ని చెప్పారు.

Fake Reviews: ఆన్‌లైన్‌ ఫేక్ రివ్యూలపై కేంద్రం దృష్టి

కాగా, స్టార్‌లింక్ అనేది అమెరికాలోని స్పేస్ఎక్స్ అధినేత ఎలాన్ మ‌స్క్ ప్ర‌తిష్టాత్మ‌క ప్రాజెక్టు. స్టార్‌లింక్ పేరుతో భూ నిమ్న క‌క్ష్య (లో ఎర్త్ ఆర్బిట్)లో చిన్నపాటి ఉప‌గ్ర‌హాల‌ను ప్ర‌వేశ‌పెడుతూ శాటిలైట్ ఇంట‌ర్నెట్ నెట్‌వ‌ర్క్‌ను స్పేస్ఎక్స్ అభివృద్ధి చేస్తోంది. వేలాది చిన్నపాటి శాటిలైట్ల‌తో ఈ ప్రాజెక్టును చేప‌ట్టారు. వాటినే ధ్వంసం చేసే వ్య‌వ‌స్థ‌ను అభివృద్ధి చేసుకోవాల‌ని చైనా భావిస్తోంది.

BJP: మోదీ సభకు పోలీసుల ఆటంకాలు.. బీజేపీ నేతల ఆగ్రహం

అంత‌రిక్షానికి సంబంధించిన అంశం కాబ‌ట్టి స్టార్‌లింక్ శాటిలైట్లను ధ్వంసం చేసేందుకు క్షిప‌ణుల‌కు బ‌దులుగా లేజ‌ర్లు, మైక్రోవేవ్ సాంకేతిక‌తతో పాటు చిన్న శాటిలైట్ల వంటి వాటిని వాడాల‌ని, దీంతో ఖ‌ర్చును త‌గ్గించుకోవచ్చ‌ని చైనాకు ఆ దేశ శాస్త్ర‌వేత్త‌లు సూచించారు. మ‌రోవైపు, ఉక్రెయిన్-ర‌ష్యా యుద్ధం జ‌రుగుతోన్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఉక్రెయిన్ మిలిట‌రీకి స్టార్‌లింక్ సాంకేతిక సాయం అందిస్తుండంతో తీవ్ర ప‌రిణామాలు ఉంటాయంటూ ఎలాన్ మ‌స్క్‌ను ఇటీవ‌లే ర‌ష్యా హెచ్చ‌రించింది.