అనాథ శవాలను చైనాకు అప్పగించిన ఇండియా

  • Published By: Subhan ,Published On : June 22, 2020 / 10:29 AM IST
అనాథ శవాలను చైనాకు అప్పగించిన ఇండియా

ఘర్షణాపూరితమైన వాతావరణం తర్వాత గాల్వాన్ లోయలోని చైనా సైనికుల శవాలు అనాథల్లా అక్కడే ఉండిపోయాయి. జూన్ 15-16 తర్వాత పాట్రోలింగ్ కు వెళ్లిన ఇండియన్ సైనికులకు గాల్వాన్ నది వద్ద అవి పడి ఉండటం చూసి అధికారులకు సమాచారం ఇచ్చారు. దాదాపు 100మంది ఇండియన్ సైనికులు, 350మంది చైనా సైనికులకు మధ్య జరిగిన ఘర్షణలో 20మంది భారత ఆర్మీ వీరులు అమరులయ్యారు. 

అధికారికంగా ఎంతమంది ప్రాణాలు కోల్పాయరనేది చైనా పీపుల్ లిబరేషన్ ఆర్మీ ఇంకా వెల్లడించలేదు. అబ్జర్వేషన్ పోస్టులోకి చైనా సైనికులు చొరబడ్డారని తెలియగానే బీహార్ కు చెందిన 16మంది రెజిమెంట్ సైనికులు వెళ్లారు. దాంతో పాటు ఓ చిన్నపాటి పాట్రోలింగ్ టీం లొకేషన్ కు వెళ్లింది. 10-12 మంది సైనికులు పోస్టులో ఓ టీంలా కూర్చొని ఖాళీ చేయడం లేదు. 

ఇరు దేశాల మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం.. పోస్టులోకి ఎంటర్ కావడానికి లేదు. కల్నల్ సంతోష్ బాబు నేతృత్వంలో ఉన్న ఇంకొక పాట్రోల్ టీం అక్కడికి చేరుకుంది. ఇదంతా జరుగుతున్న సమయంలో చైనా బలగాలు బ్యాకప్ టీం రెడీ చేసుకున్నాయి. రీఇన్‌ఫోర్స్‌మెంట్ లో భాగంగా దాదాపు 350మంది సైనికులు పోస్టు దగ్గరకు చేరుకున్నారు. ఇండియాకు చెందిన రెండో పాట్రోలింగ్ టీం వచ్చేసరికి చైనా బలగాలు పోస్టును చుట్టుముట్టేశాయి.

ఇరు వర్గాల మధ్య వాదనలు హింసకు దారితీశాయి. భారత సైనికుల కంటే ఎక్కువ ఉన్న చైనా బలగాలు దాడికి దిగాయి. ముందుగా బీహార్ కు చెందిన రెజిమెంట్ సీఓ, హవాల్దార్ పలానీ పైకి వచ్చారు. అతను పడిపోగానే రాళ్ల వర్షం కురిపించాు. మూడు గంటల పాటు ఈ గొడవ కొనసాగింది. అంత రాత్రి సమయంలో చైనా బలగాలు తీవ్ర గాయాలకైనా లేదా ప్రాణాలైనా పోయిండాలి. 

తర్వాత రోజు ఉదయం చైనా సైనికుల శవాలు పోస్టుకు దగ్గర్లో పడి ఉన్నాయి. వాటన్నిటినీ చైనాకు అప్పగించింది ఇండియా. ఇండియా వైపు నుంచి 100మంది డిఫెండ్ చేసుకునేందుకు ప్రయత్నించారు. 

Read: గుడ్‌న్యూస్: కరోనా బలహీనపడుతోంది.. వ్యాక్సిన్ లేకుండానే వైరస్ చచ్చిపోవచ్చు