China Zhurong : అంగారకుడిపై దిగిన చైనా రోవర్.. జురాంగ్ అసలు ఏం చేయబోతుంది?

అంగారకుడిపై చైనాకు చెందిన రోవర్ విజయవంతంగా దిగింది. ఈ మేరకు చైనా ప్రభుత్వ మీడియా ఒక ప్రకటనలో వెల్లడించింది. జురాంగ్ అనే ఈ రోవర్ శనివారం (మే 15) ఉదయం అంగారకుడి ఉపరితలంపై నిర్దేశిత ప్రాంతంలోనే ల్యాండ్ అయినట్లు చైనా పేర్కొంది.

China Zhurong : అంగారకుడిపై దిగిన చైనా రోవర్.. జురాంగ్ అసలు ఏం చేయబోతుంది?

Chinese Spacecraft Successfully Lands On Surface Of Mars

Chinese spacecraft lands on surface of Mars : అంగారకుడిపై చైనాకు చెందిన రోవర్ విజయవంతంగా దిగింది. ఈ మేరకు చైనా ప్రభుత్వ మీడియా ఒక ప్రకటనలో వెల్లడించింది. జురాంగ్ అనే ఈ రోవర్ శనివారం (మే 15) ఉదయం అంగారకుడి ఉపరితలంపై నిర్దేశిత ప్రాంతంలోనే ల్యాండ్ అయినట్లు చైనా పేర్కొంది. మార్స్ పై ల్యాండ్ అయ్యే తొమ్మిది నిమిషాలు ఎంతో కీలకం.. ఆ సమయంలో పారాచూట్ ఉపయోగించి ప్లానిటియాలో మార్స్ ఉపరితలాన్ని రోవర్ సురక్షితంగా తాకింది. దాంతో అరుణ గ్రహంపై రోవర్ ల్యాండ్ అయిన రెండో దేశంగా చైనా అవతరించింది. అంతకుముందు రెడ్ ప్లానెట్ పై రోవర్‌ను విజయవంతంగా ల్యాండ్ చేసిన అమెరికా మొదటి దేశంగా నిలిచింది.

తియాన్వేన్-1 అంతరిక్ష నౌక దక్షిణ ఆదర్శధామ మైదానంలోకి అడుగుపెట్టింది, మొట్టమొదటిసారిగా అంగారక గ్రహంపై చైనా తన ఫూట్ ఫ్రింట్ వదిలివేసింది అని జిన్హువా పేర్కొంది. ఈ క్రాఫ్ట్ నిర్దేశిత కక్ష్యలో బయల్దేరి మూడు గంటల తరువాత కక్ష్య నుంచి వేరు చేసి మార్టిన్ వాతావరణంలోకి ప్రవేశించిందని అధికారిక చైనా స్పేస్ న్యూస్ తెలిపింది. మార్స్ పై నెమ్మదిగా దిగే ల్యాండింగ్ ప్రక్రియలో తొమ్మిది నిమిషాలు కీలకమని పేర్కొంది. జురాంగ్ అంటే.. చైనీస్ అగ్నిదేవుడు పేరు.. ఇందులో అధిక-రిజల్యూషన్ ఉన్న ఓపోగ్రఫీ కెమెరాతో సహా ఆరు సైంటిఫిక్ పరికరాలు ఉన్నాయి.


ఆరు చక్రాలు గల జురాంగ్ బరువు 240 కిలోగ్రాములు ఉంటుంది. ఆరు సెంటిఫిక్ పరికరాలను తనతో మోసుకెళ్లింది. ఈ మిషన్‌లో భాగంగా అంగారకుడి ఉపరితలంపై పురాతన జీవనంపై ఆధారాల కోసం అన్వేషిస్తుంది. ఈ మిషన్ ప్రారంభంలో తియాన్వేన్ -1 ఆర్బిటార్ నుంచి రోవర్‌కు సంకేతాలు అందుతాయి. దీని ఆధారంగా చేసుకుని అంగారక గ్రహాన్ని మొత్తం చుట్టేస్తుంది. తియాన్వేన్-1 ఆర్బిటార్‌ను లాంగ్‌ మార్చ్ 5 రాకెట్ ద్వారా గతేడాది జూన్ 23వ తేదీన నింగిలోకి పంపారు. హైనాన్‌లోని వెన్‌చాంగ్ స్పేస్ లాంచ్ సెంటర్ నుంచి ప్రయోగించింది. మార్స్‌ పైకి చేరేందుకు 7 నెలల సమయం తీసుకుంది. ఆ తర్వాత కక్ష్యలోకి 2021 ఫిబ్రవరిలో ప్రవేశించింది. మిలియన్ కిలోమీటర్ల కంటే దూరంలో ఉండగానే మార్స్‌ గ్రహంకు సంబంధించిన ఫోటోను భూమికి పంపింది. అన్నట్లుగానే ఎక్కడా పొరపాటు లేకుండా ప్రోబ్ రోవర్‌ను సురక్షితంగా ల్యాండ్ అయింది.