Christ The Protector Statue : ప్రపంచంలో అతి పెద్ద క్రీస్తు విగ్రహం ఇదే..

ఏదైనా ఒక దేశంలో ఒక విగ్రహం పెద్దదిగా ఉంటే.. మరో దేశం.. దాని కంటే పెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ట్రై చేస్తుంది. కానీ.. బ్రెజిల్‌లో మాత్రం వరల్డ్ ఫేమస్ అయిన విగ్రహం లాంటిదే.. మరొకటి ఏర్పాటు చేశారు. ఇప్పుడా.. రెండు స్టాచ్యూలపై చర్చ మొదలైంది. రియోలో కంటే ఎత్తుగా ఉన్న ఈ విగ్రహం వల్ల.. బ్రెజిల్‌కి ఎలాంటి బెనిఫిట్ ఉండబోతోంది?

Christ The Protector Statue : ప్రపంచంలో అతి పెద్ద క్రీస్తు విగ్రహం ఇదే..

Christ The Protector Statue Brazil (1)

christ the protector statue brazil : ఏదైనా ఒక దేశంలో ఒక విగ్రహం పెద్దదిగా ఉంటే.. మరో దేశం.. దాని కంటే పెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ట్రై చేస్తుంది. కానీ.. బ్రెజిల్‌లో మాత్రం వరల్డ్ ఫేమస్ అయిన విగ్రహం లాంటిదే.. మరొకటి ఏర్పాటు చేశారు. ఇది.. దానికంటే ఎత్తులో ఉంటుంది. ఇప్పుడా.. రెండు స్టాచ్యూలపై చర్చ మొదలైంది. ఇంతకీ.. కొత్త విగ్రహాన్ని ఎక్కడ నిర్మించారు? దాని స్పెషాలిటీ ఏంటి? రియోలో కంటే ఎత్తుగా ఉన్న ఈ విగ్రహం వల్ల.. బ్రెజిల్‌కి ఎలాంటి బెనిఫిట్ ఉండబోతోంది?

జీసస్ క్రైస్ట్‌కి సంబంధించి.. బ్రెజిల్‌లోని వరల్డ్ ఫేమస్ సిటీ రియో డి జనీరోలో.. క్రైస్ట్ ది రీడీమర్ విగ్రహం ఉంది. దీని ఎత్తు.. 124 అడుగులు. దీనిని చూసేందుకు.. అక్కడ సెల్ఫీలు తీసుకునేందుకు.. ప్రపంచం నలుమూలల నుంచి టూరిస్టులు వస్తుంటారు. అయితే.. సౌత్ బ్రెజిల్‌లోని సియారా స్టేట్‌లో ఉన్న ఎన్‌కాంటాడో అనే చిన్న పట్టణంలో.. 141 అడుగుల ఎత్తుతో.. మరో క్రీస్తు విగ్రహాన్ని నిర్మించారు. దీనిని.. క్రైస్ట్ ది ప్రొటెక్టర్ అని పిలుస్తున్నారు. దీనికి.. మార్కస్ మారా అనే శిల్పి రూపకల్పన చేశారు.

Also read : 35kg Mask : ప్రపంచంలోనే అతి పెద్ద మాస్క్.. ఎందుకు? ఎక్కడ తయారుచేశారు.. ?

ఎన్‌కాంటాడోలోని లోకల్ వ్యాపారులు.. విరాళాలు పోగేసి మరీ.. ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయించారు. 2019లో మొదలైన నిర్మాణం.. గత నెల పూర్తైంది. ఇప్పుడు.. ప్రపంచంలో అతి పెద్ద క్రీస్తు విగ్రహం ఇదేనని.. చెబుతున్నారు. బలమైన లోహ నిర్మాణంపై.. కాంక్రీట్‌తో ఈ స్టాచ్యూని నిర్మించారు. ఓ కొండపై.. దీనిని ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి చూస్తే.. ఎన్‌కాంటాడో పట్టణమంతా కనిపిస్తుంది.

ఈ విగ్రహాన్ని బ్రెజిల్ ప్రభుత్వం ఏర్పాటు చేయకపోయినా.. ఇది వరల్డ్ ఫేమస్ అయ్యే చాన్సెస్ ఎక్కువగా ఉన్నాయ్. ఎందుకంటే.. ఈ స్టాచ్యూలో.. హార్ట్ షేప్‌లో భారీ విండో ఉంది. టూరిస్టులు అక్కడికి వెళ్లి వ్యూ చూడొచ్చు. అయితే.. ఇప్పుడే కాదు.. వచ్చే ఏడాది నుంచి దీనిని చూసేందుకు ప్రజలను అనుమతిస్తారు. దీనికి దగ్గర్లోనే.. భారీ టూరిస్ట్ కాంప్లెక్స్ నిర్మించే ప్లాన్ కూడా ఉంది. ప్రస్తుతం.. ఈ కొత్త విగ్రహం వీడియోలు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయ్. ఇది నిర్మాణంలో ఉన్నప్పుడే.. 21 దేశాలకు చెందిన 50 వేల మందికి పైగా దీనిని చూశారు. మున్ముందు.. ఇంకెంతమంది టూరిస్టులు వస్తారన్నది.. ఇప్పుడే అంచనా వేయలేం.

Also read : Ambedkar Statue with iron scrap : మూడు టన్నుల ఐరన్ స్క్రాప్‌తో అంబేద్కర్ విగ్రహం..