క్రిస్టమస్ సెలబ్రేషన్స్ ఆగేదే లేదు.. COVID-19 ప్రత్యేక జాగ్రత్తలతో ప్రిపేర్ అవుతున్న చైనా

క్రిస్టమస్ సెలబ్రేషన్స్ ఆగేదే లేదు.. COVID-19 ప్రత్యేక జాగ్రత్తలతో ప్రిపేర్ అవుతున్న చైనా

Christmas 2020 సెలబ్రేషన్స్ ఎట్టి పరిస్థితుల్లో ఆగేదే లేదని అంటోంది చైనా. కొవిడ్ మహమ్మారి వ్యాప్తి జరగకుండా మాస్క్ లు వంటివి ధరించి పండుగ జరిపేసుకోవాలనుకుంటున్నారు. ట్రావెల్ సంబంధించిన నిబంధనలు ఉన్నప్పటికీ ఎక్కడివారు అక్కడే ఉండి సోషల్ డిస్టెన్సింగ్ పాటిస్తూ సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నారు. కొవిడ్ మహమ్మారి కారణంగా ఇప్పటికే చాలా పండుగలు సంప్రదాయాలు పక్కకుబెట్టి తూతూ మంత్రంగా పండుగలు పూర్తి చేసేసుకున్నాయి.

ఆస్ట్రేలియాలో Christmas ట్రీ ఫామ్ షాప్స్ అంతగా ఊపందుకోలేదు. వినియోగదారులు ఫ్రెష్ పైన్ ట్రీస్ వైపు మొగ్గు చూపుతుండటంతో ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి. గ్రీస్ దేశంలో దేశవ్యాప్తంగా నమోదై ఉన్న లాక్ డౌన్ కారణంగా… మార్కెట్‌పై చాలా ప్రతికూల వాతావరణం కనిపించింది. స్పెయిన్ దేశంలో టాయ్ మేకర్ ఫామోసా కొత్త ఐడియాలతో నాన్సీ డాల్ కు కొవిడ్ టచ్‌తో రెడీ చేశారు. Christmas గిఫ్ట్ ల నేపథ్యంలో బొమ్మలను కొత్త రకాల డిజైన్లతో రూపుదిద్దుతున్నారు. అది కూడా కొవిడ్ రిలేటెడ్‌గానే.

వైరస్ టెస్టర్ గా పోలి ఉన్న బొమ్మలు, మాస్క్ లు ధరించి ఉన్న బొమ్మలు, కొవిడ్ పాజిటివ్ పేషెంట్ బొమ్మలు వంటివి ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్లు రెడీ చేస్తున్నారు. పోర్చుగల్ లో వీటికి విపరీతమైన డిమాండ్ కనిపిస్తుంది. సైన్స్4యూ టాయ్స్ కొవిడ్ రిలేటెడ్ గా రెడీ అవుతుండటంతో డిమాండ్ బాగా కనిపిస్తుంది. Czech Republicలో బంగారపు పందులకు చిన్న చిన్న మాస్క్ లు పెట్టి కొవిడ్ టచ్ ఇచ్చారు.

జర్మనీలో లాక్ డౌన్ ఇప్పటికీ అమలు అవుతుండటంతో ఓపెన్ ఎయిర్ వైన్ జరుగుతూ ఉంది. న్యూయార్క్ ప్రాంతంలో కొవిడ్ గైడ్ లైన్స్ పాటిస్తూ.. ప్రపంచంలోనే ఫ్యామస్ ట్రీని దర్శించుకునేందుకు వచ్చే విజిటర్స్ కోసం.. సేఫ్టీ ప్రొటోకాల్స్ అనౌన్స్ చేశారు. హంగేరీలో శాంతాక్లాజ్ పిల్లలతో ఆన్‌లైన్ మీటింగ్స్ కు అటెండ్ అవుతున్నాడు. కొన్ని కంపెనీలు ఏర్పాటు చేసిన ఈవెంట్లలో పిల్లల బ్రిలియంట్ ఐడియాస్ కు గిఫ్ట్ లు కూడా ఇస్తున్నాడు. తైవాన్ లో యూరప్, అమెరికాల నుంచి వచ్చే ఆర్డర్లు మరీ తక్కువ అయిపోయాయి. గజాలో కళాకారుల తమ ఆర్ట్ లను అమ్ముకోవడం చాలా క్లిష్టంగా మారిపోయింది.

మెడిసిన్ కరోనావైరస్ రిసోర్స్ సెంటర్, జాన్స్ హాప్‌కిన్స్ యూనివర్సిటీ ఇచ్చిన వివరాల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా 7కోట్ల 49లక్షల 52వేల 221మందికి కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకింది. 16లక్షల 62వేల 127మంది మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోయారు.