ప్రపంచమంతా లాక్‌డౌన్‌తో స్తంభించిపోతుంటే, చైనా మళ్లీ పరుగు మొదలుపెట్టింది

ప్రపంచమంతా లాక్‌డౌన్‌తో స్తంభించిపోతుంటే, చైనా మళ్లీ పరుగు మొదలుపెట్టింది

ప్రపంచమంతా కరోనావైరస్ మహమ్మారి నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రయత్నిస్తుంటే చైనా వ్యాపార సంస్థలు షట్ డౌన్ ను ఎత్తేశాయి. అంతేకాకుండా విమాన సర్వీసులను పునరుద్ధరించడమే కాకుండా ఫ్యాక్టరీలను తిరిగి ప్రారంభించేస్తున్నారు. ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు అయిన యూరప్, యూఎస్, ఇండియా, లాటిన్ అమెరికాలు పెద్దెత్తున నష్టపోయాయి. ఈ మేర మళ్లీ ఆర్థికంగా పుంజుకోవడానికి తిరిగి పనుల్లోకి వెళ్లిపోతుంది చైనా.

వూహాన్ లో లాక్ డౌన్ కొనసాగుతున్నా.. మరో వైపు ఉత్పత్తులు మొదలెట్టేశాయి. గత నెల చైనాలో కార్ అమ్మకాలు అట్టడుగు స్థాయికి చేరుకున్నాయి. వైరస్ ప్రభావాన్ని అధిగమించి వినియోగదారులు మళ్లీ షాపింగ్ వైపుకు అడుగులేస్తున్నారు. ‘చైనా పరిశ్రమలను పున ప్రారంభిస్తున్నాయని విశ్లేషణపూర్వకగం శాన్ ఫోర్డ్ సీ బెర్న్ స్టీన్ అంటు్నారు. ప్రొడక్షన్ క్రమంగా పెరుగుతుంది. పరిస్థితులు చక్కబడుతున్నాయని నిపుణులు అంటున్నారు. 

విమాన సర్వీసులు కూడా:
జాతీయ విమాన సర్వీసులు ఘోరమైన నష్టాలు చవిచూశాయి. నష్టాన్ని అధిగమించడానికి విమాన సర్వీసులను పునరుద్ధరిస్తున్నారు. అంతేకాకుండా వారం రోజుల్లోనే సర్వీసులు పెంచుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 10 టాప్ మార్కెట్లు పున ప్రారంభానికి నిరాకరిస్తున్నా విమానాలు మాత్రం తిరగడం మొదలెట్టేశాయి. 

గత వారం రోజులుగా చైనా సబ్ వే ట్రాఫిక్ కూడా 21శాతం పెరిగింది. దాంతో పాటు ఆన్ లైన్ అమ్మకాలు భారీ మొత్తంలో జరుగుతున్నాయి. వారాలుగా మూసుకుపోయి ఉన్న ఇండస్ట్రీలు పుంజుకుంటున్నాయి. ల్యూనార్ న్యూ ఇయర్ హాలిడే బ్రేక్ తర్వాత చైనా రోడ్ల మీదకు వస్తుంది ఈ వారమే. ఇదిలా ఉంటే టాప్ కార్ కంపెనీలు తిరిగి ప్రొడక్షన్ పెంచేస్తున్నాయి. 

హోండా (Honda)
నిశ్సాన్ (Nissan)
శాయక్ (SAIC)
టెస్లా (Tesla)
టయోటా (Toyota)
వొల్క్‌స్వాగన్ (Volkswagen)

జపాన్ టెక్నాలజీతో తయారయ్యే ఈ మోడళ్ల కార్లు డిమాండ్ ను తయారుచేస్తున్నారు. టెస్లా కార్లు గత వారం 3వేల కార్ల ఉత్పత్తి అయిందంటేనే తెలుస్తోంది చైనాలో తిరిగి అమ్మకాలు ఎంత ఊపందుకున్నాయో.. టయోటా డీలర్లు 98శాతం మంది తిరిగి డీలర్ షిప్ ఓపెన్ చేశారు. టార్గెట్లు లేకుండా పనిచేస్తున్నామని డిమాండ్ ను బట్టి తయారీ ఉంటుందని మ్యాన్యుఫ్యాక్చర్లు చెబుతున్నారు. 

See Also | దేశమంతా లాక్ డౌన్: SBI కీలక ప్రకటన.. పని చేస్తాం.. కానీ!