షాకింగ్ న్యూస్ : భారత్‌లో అరటి పళ్లు ఇక కనిపించవా..‌!

  • Published By: veegamteam ,Published On : September 5, 2019 / 08:48 AM IST
షాకింగ్ న్యూస్ : భారత్‌లో అరటి పళ్లు ఇక కనిపించవా..‌!

అరటిపండు..అరటి కాయ..అరటి ఆకు..అరటి పువ్వు,అరటి బోదె (కాండం) ఇలా అరటి చెట్టులో అన్ని ఉపయోగపడతాయి. మానవుడి జీవితంలోఅరటి చెట్టుది ప్రత్యేకమైన స్థానం ఉంది. అరటికి భారతదేశంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. అరటి పండ్లు లేని పండుగ గానీ..పూజ గానీ..శుభకార్యాలు గానీ ఉండవు అంటే అతిశయోక్తి కాదు. అరటికి భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో కోట్లాదిమందికి ఆహారం. ఎంతోమంది రైతన్నలకు  అరటి అమృతకలశంగా మారి పోషణనిస్తోంది. 

ఇంతటి విశిష్టత..ప్రాధాన్యత ఉన్న అరటి భారత్ తో పాటు మరికొన్ని దేశాల్లో 2050 నాటికి పూర్తిగా కనుమరుగయ్యే ప్రమాదం ఉందని బ్రిటన్‌లోని ఎక్స్‌టర్‌ యూనివర్సిటీ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. 

భార‌త్‌లో అర‌టి పండు వినియోగం చాలా ఎక్కువ. భారత్‌లో  ఎంతోమంది రైతులు అర‌టి పంట‌పై ఆధార‌ప‌డి జీవిస్తున్నారు. అరటి సాగులోనూ భారత్ ముందంజలో ఉంది. అటువంటి అరటి భారత్‌లో కనుమరు అవుతుందనే ఊహనే కష్టంగా ఉంది. దీనికి కారణం వాతావరణ మార్పులేని సైంటిస్టులు తెలిపారు.

బ్రిటన్‌ సైంటిస్టులు ప్రంచంలోని అరటి ఉత్పత్తి..దానికి సంబంధించిన వాతావరణ మార్పులు, భవిష్యత్తుతో ప్రభావం వంటి కీలక అంశాలపై అధ్యయనం చేశారు. ప్రపంచవ్యాప్తంగా 86 శాతం అరటిని అందిస్తున్న 27 దేశాల్లో చేసిన సర్వేలో తెలుసుకున్నారు. రోజు రోజుకీ పెరుగుతున్న గ్లోబల్‌ వార్మింగ్‌.. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వర్షపాతంలో మార్పుల ప్రభావం అరటిపై కీలక ప్రభావం చూపుతున్నాయని వారు గుర్తించి వెల్లడించారు.

ప్రపంచవ్యాప్తంగా అధికంగా అరటి సాగు చేస్తున్న భారత్‌, బ్రెజిల్‌తోపాటు మరో ఎనిమిది దేశాల్లో 2050 నాటికి అరటి దిగుబడిపై వాతావరణ మార్పుల యొక్క ప్రభావాలు ఇదే స్థాయిలో కొనసాగితే..అర‌టి ఉత్ప‌త్తి గణనీయంగా తగ్గుతుందని లేదా పూర్తిగా మాయం అయ్యే అవ‌కాశాలు కూడా ఉన్నాయ‌ని ప‌రిశోధ‌కులు హెచ్చ‌రించారు.