మొక్కలు నాటేసి సామాజిక అడవులను సృష్టిస్తే, లాభంకన్నా నష్టమే ఎక్కువంట. కారణం ఏంటో తెలుసా?

  • Published By: srihari ,Published On : June 23, 2020 / 09:34 AM IST
మొక్కలు నాటేసి సామాజిక అడవులను సృష్టిస్తే, లాభంకన్నా నష్టమే ఎక్కువంట. కారణం ఏంటో తెలుసా?

వాతావరణంలో పెనుమార్పులు సంభవిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో పెద్ద సంఖ్యలో మొక్కలను నాటి అడవులను నిర్మించడం ప్రతికూలంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయని రెండు కొత్త అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. పర్యావరణానికి ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువగా జరిగే పరిస్థితులు ఉన్నాయని చెబుతున్నాయి. చెట్లు నాటడం ద్వారా ఆర్థిక ప్రోత్సాహకాలు కార్బన్ ఉద్గారాలపై తక్కువ ప్రభావంతో జీవ వైవిధ్యాన్ని తగ్గించగలవని ఒక అధ్యయనం చెబుతుంటే.. కొత్త అడవులు గ్రహించే కార్బన్ మొత్తాన్ని అతిగా అంచనా వేయవచ్చునని మరో  అధ్యయనం  గుర్తించింది. 

ఈ రెండు అధ్యయనాల నుంచి ముఖ్య సందేశం.. చెట్లను నాటడం సాధారణ వాతావరణ పరిష్కారం కాదని తేల్చేశాయి. గత కొన్ని ఏళ్లుగా వాతావరణ మార్పుల నేపథ్యంలో చెట్లు నాటడంతో పరిష్కారం కాదని పేర్కొన్నాయి. గత అధ్యయనాలు చెట్లు కార్బన్‌ను నిల్వ చేయడానికి అపారమైన సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని సూచించాయి. వాతావరణ మార్పులను పరిష్కరించడానికి అనేక దేశాలు చెట్ల పంపకం కార్యక్రమాలను నిర్వహించాయి. అమెరికాలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ట్రిలియన్ చెట్లు నాటాలని జోరుగా ప్రచారం చేస్తున్నారు. దీనికి మద్దతు ఇచ్చే చట్టాన్ని యూఎస్ కాంగ్రెస్‌లో ప్రవేశపెట్టారు. 2030 నాటికి 350 మిలియన్ హెక్టార్ల క్షీణించాయని, అటవీ నిర్మూలనను పునరుద్ధరించాలని పలు దేశాలను ఆయన్ కోరారు. 

Climate change: Planting new forests 'can do more harm than good'ఇప్పటివరకూ సుమారుగా 40 దేశాలు చెట్ల పెంపకాన్ని స్వాగతించాయి. కానీ, కొత్త అడవులను నాటడం కారణంగా లాభం కంటే నష్టమే అధికంగా ఎదురవుతుందని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. బాన్ ఛాలెంజ్‌లో భాగంగా ఇప్పటివరకూ దాదాపు 80శాతం మోనో కల్చర్ ప్లాంటేషన్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఈ కొత్త అధ్యయనం రచయితలు.. చెట్లను నాటడానికి ప్రైవేట్ భూస్వాములకు ఇచ్చే ఆర్థిక ప్రోత్సాహకాలను నిశితంగా పరిశీలించారు.

చెట్ల పెంపకానికి సబ్సిడీ ఇచ్చే డిక్రీ 1974 నుంచి 2012 వరకు ఉంది. ప్రపంచవ్యాప్తంగా ప్రభావంతమైన అటవీ నిర్మూలన విధానమనేది ప్రభావంతంగా మారింది. కొత్త అడవులను నాటడానికి అయ్యే ఖర్చులో 75శాతం చట్టం సబ్సిడీ చేసింది. ఇదివరకే ఉన్న అడవులకు వర్తించకూడదని ఉద్దేశించారు. అయినప్పటికీ కొంతమంది భూ యజమానులు స్థానిక అడవులను కొత్త చెట్లతో భర్తీ చేశారు. సైంటిస్టుల అధ్యయనంలో సబ్బిడీ పథకంతో కొత్త చెట్లతో అడవులను విస్తరించింది. కానీ, స్థానిక అటవి విస్తీర్ణం తగ్గింది. 
Climate change: Planting new forests 'can do more harm than good'

చెట్లను ప్రోత్సహించే విధానాలు సరిగా రూపకల్పన సరిగా అమలు చేయకపోతే ప్రజల డబ్బును వృథా చేసినట్టే అవుతుంది. ఎక్కువ కార్బన్‌ను విడుదల చేసి జీవవైవిధ్యాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని Stanford University నుంచి సహ రచయిత ప్రొఫెసర్ Eric Lambin అన్నారు. కానీ, ఇది ప్రస్తుత అటవీ విధాన లక్ష్యాలకు విరుద్ధమని ఆయన పేర్కొన్నారు.

రెండవ అధ్యయనం కొత్తగా నాటిన అడవి వాతావరణం నుంచి ఎంత కార్బన్ గ్రహించగలదో పరిశీలించవచ్చు. అటవీప్రాంతంలో నుంచి తీసిన 11,000 మట్టి శాంపిల్స్ చూస్తే.. శాస్త్రవేత్తలు కార్బన్ పేలవమైన నేలల్లో, కొత్త చెట్లను నాటడం సేంద్రీయ కార్బన్ సాంద్రతను పెంచుతుందని కనుగొన్నారు. నేలల్లో ఇప్పటికే కార్బన్ అధికంగా ఉన్న చోట కొత్త చెట్లను నాటడం వల్ల ఈ సాంద్రత తగ్గుతుందని హెచ్చరిస్తున్నారు.