ఆస్పత్రికి వచ్చి రోగుల్ని కుమ్మేసిన ఆవు..

ఆస్పత్రికి వచ్చి రోగుల్ని కుమ్మేసిన ఆవు..

cow in hospital  attacks patients : ఆవులు చాలా సాధు జంతువులు. కానీ పాపం ఓ ఆవుకు ఏం జరిగిందో..ఎంతుకంత తిక్క లేచిందో తెలీదు గానీ..ఓ ఆస్పత్రిలోకి చొరబడి అక్కడ ఉండే రోగుల్ని కొమ్ములతో కుమ్మి పడేసింది. పాపం వాళ్లు పారిపోదామని యత్నించినా ఊరుకోలేదు.వెంటపడి మరీ కుమ్మి కుమ్మి పడేసింది…!

ఆ వీడియో చూస్తే…పాపం.. అయ్యో వీళ్ల పరిస్థితి ఏంటిరా బాబు కూర్చున్నవాళ్లు దాన్నేం చేశారని అలా పొడిచిపారేసింది అని అనిపిస్తుంది. ఆ క్షణంలో అక్కడ మనమే ఉండి ఉంటే మాత్రం..కచ్చితంగా అదే ఆస్పత్రిలో బెడ్ మీద పడి ఉండేవాళ్లం..అంతలా కుమ్మేసిందా ఆవు..

దక్షిణ అమెరికా దేశం కొలంబియాలోని సాన్ రాఫెల్ అనే ఆస్పత్రిలోని వెయిటింగ్ రూంలోకి ఓ ఆవు వచ్చింది. ఆ రూంలో పేషెంట్లతో పాటు వారితో పాటు వచ్చినవారు కూర్చుని ఉన్నారు. అదే సమయమంలో సైలెంట్‌గా ఆస్పత్రిలోకి ఎంట్రీ ఇచ్చిన ఓ ఆవు వయలెంట్‌గా మారింది. ఒక్కసారిగా జూలు విదిలించిన సింగంలాగా మారిపోయింది. రంకెలేస్తూ… వెయిటింగ్ రూంలో కూర్చున్న వారిపై దాడి చేసింది. ఏమాత్రం లేట్ చేయకుండా అక్కడున్నవారందరినీ కుమ్మేసింది.

ఓ నలుగురు పేషెంట్లపై దాడికి దిగగా… ముగ్గురు ఎలాగొలా తప్పించుకున్నారు. మరో మహిళను మాత్రం ఆవు వీరలెవెల్లో కుమ్మేసింది. గోడకు ఆనించి మరీ కుమ్మేసింది. ఆ ఆవు మెడకు ఓ తాడు ఉంది. ఎట్టకేలకు ఆ ఆవు మెడలో ఉన్న తాడు పట్టుకొని ఆస్పత్రి సిబ్బంది… దాన్ని బయటకు లాగేందుకు ఎంతగా ప్రయత్నించినా… కదలనే కదలదు..అక్కడక్కడే తిరుగుతూ..వీరవిహారం చేసింది.

దాడి చేసిన మహిళా పేషెంట్ పడి ఉంటే… మరోసారి దాడి చేసేందుకు సిద్ధపడింది. అది చూసిన ఆస్పత్రి సిబ్బంది ప్రాణాలకు తెగించి ఆవు వెనక్కి వెళ్లారు. వాళ్లను చూసిన ఆవు… దాడికి చేసేందుకు పేషెంట్‌ని వదిలి వాళ్లవైపు తిరిగింది. ఇంతలో పేషెంట్ ఎలాగొలా లేచి…ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పక్కరూమ్ లోకి పలాయనం చిత్తగించి ప్రాణాలు కాపాడుకోవాల్సి వచ్చింది. ఇక ఆ గదిలో ఎవరూ లేకపోవడంతో… ఆవు… మెల్లగా బయటకు వచ్చింది. ఇదంతా రెండు వీడియోల్లో రికార్డ్ అయ్యింది. మరి చూడండీ ఆ ఆవుగారి వీర విహారం..

కాగా..ఆస్పత్రిలో పేషెంట్లపై తన ఆవు దాడి చేసిందని తెలుసుకున్న యజమాని ఆస్పత్రికి వచ్చారు. పేషెంట్లకు..సిబ్బందికి క్షమాపణలు చెప్పారు. తన ఆవు ఎప్పుడూ అలా చెయ్యలేదనీ… ఇప్పుడు ఎందుకు అలా చేసిందో తానే నమ్మలేకపోతున్నానని చెప్పి మరోసారి క్షమాపణలు చెప్పుకున్నాడు..