Criminal: జూకర్ బర్గ్ పోలికలతో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్.. పట్టుకుంటే రూ. 22కోట్లు

ప్రపంచంలో మనుషులను పోలిన మనుషులుల ఎందరు ఉంటారో తెలియదు కానీ, దాదాపుగా ఒకే పోలీకలతో ఉన్న వ్యక్తుల్లో ఒకరు చెడ్డవాడైతే మరొకరికి ఇబ్బందులు తప్పవు. అటువంటి పరిస్థితే ఇప్పుడు ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జూకర్ బర్గ్‌ను పోలిన ఓ వ్యక్తి కూడా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్.

Criminal: జూకర్ బర్గ్ పోలికలతో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్.. పట్టుకుంటే రూ. 22కోట్లు

Mark Zuckerberg Colombian Police Announce $3 Million: ప్రపంచంలో మనుషులను పోలిన మనుషులుల ఎందరు ఉంటారో తెలియదు కానీ, దాదాపుగా ఒకే పోలీకలతో ఉన్న వ్యక్తుల్లో ఒకరు చెడ్డవాడైతే మరొకరికి ఇబ్బందులు తప్పవు. అటువంటి పరిస్థితే ఇప్పుడు ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జూకర్ బర్గ్‌ను పోలిన ఓ వ్యక్తి కూడా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. సదరు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ పేరు తెలియదు కానీ, అతని ఫోటో చూస్తుంటే మాత్రం కచ్చితంగా మార్క్ జూకర్ బర్గ్‌ గుర్తొచ్చేస్తాడు.

మార్క్‌ జుకర్‌బర్గ్‌ పోలికలతో ఉన్న వ్యక్తిని పట్టిస్తే 3 మిలియన్‌ డాలర్లు( భారతీయ రూపాయలలో 22కోట్ల 31లక్షల 91వేలు) బహుమతి ఇస్తామని ప్రకటించింది కొలంబియా ప్రభుత్వం. కొలంబియా పోలీసులు ఈమేరకు నేరస్థుడి ఊహాచిత్రాలను ఫేస్‌బుక్‌లో పెట్టి ప్రకటన చేయగానే ఫేస్‌బుక్ అధికారులు ఆశ్చర్యపోయారు. ఆ ఫోటోలు చూసిన నెటిజన్లు వాటిని తెగ వైరల్ చేస్తున్నారు.

అసలు ఆ నేరస్థుడు ఎవరంటే, కొలంబియా అధ్యక్షుడు ఇవాన్‌ డ్యూక్‌ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌పై కాల్పులు జరిపిన వ్యక్తి. కాల్పులు జరిగిన సమయంలో హెలికాప్టర్‌లో కొలంబియా అధ్యక్షుడు డ్యూక్‌తో పాటు రక్షణ మంత్రి డియెగో మొలానో కూడా ఉన్నారు. అయితే, వారికి ఏమీ జరగలేదు కానీ, ఈ ఘటన దర్యాప్తులో భాగంగా కొలంబియా పోలీసులు నిందుతుల స్కె​చ్‌ గీయించారు. సదరు వ్యక్తి అచ్చం ఫేస్‌బుక్‌ ఫౌండర్‌ మార్క్‌ జుకర్‌బర్గ్‌లానే ఉండడంతో ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

వీరిని పట్టించినవారికి 3మిలియన్‌ డాలర్ల బహుమతి అందజేస్తామంటూ.. పోలీసులు పోస్ట్ చేసిన ఫోటోలపై నెటిజన్లు సరదాగా కామెంట్స్ చేుస్తున్నారు. వీరి గురించి సమాచారం తెలిసినవారు ఈ నంబర్లకు 3213945367 లేదా 3143587212 కాల్‌ చేయండి’’ అని మెసేజ్‌ చేశారు. ఈ ఫోటోలో ఓ వ్యక్తి అచ్చు మార్క్‌ జుకర్‌బర్గ్‌లా ఉండటంతో అది అందరిని దృష్టిని ఆకర్షించింది. ఇది చూసిన నెటినులు రకరకాల కామెంట్స్‌ చేస్తున్నారు.