Comet Coming: ఆకాశంలో అద్భుతం.. 50వేల సంవత్సరాల తర్వాత భూమికి దగ్గరగా వస్తున్న తోకచుక్క..

50వేల సంవత్సరాలకు ఒకసారి అరుదైన తోకచుక్క భూమికి దగ్గరగా రానుంది. ఫిబ్రవరి 2న భూమికి తన కక్ష్యలో దగ్గరగా వచ్చిన సమయంలో రాత్రివేళ ఈ తోకచక్క స్పష్టంగా కనిపించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.

Comet Coming: ఆకాశంలో అద్భుతం.. 50వేల సంవత్సరాల తర్వాత భూమికి దగ్గరగా వస్తున్న తోకచుక్క..

Comet Coming

Comet Coming: అంతరిక్షంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతం కాబోతుంది. 50వేల సంవత్సరాల క్రితం అంటే మంచు యుగంలో భూమికి దగ్గరగా వచ్చిన తోకచుక్క.. మరోసారి భూమికి దగ్గరగా రాబోతుంది. శాస్త్రవేత్తల వివరాల ప్రకారం.. 2023 ఫిబ్రవరి 1, 2 తేదీల్లో ఈ అరుదైన తోకచుక్క భూమికి దగ్గరగా వస్తుందని పేర్కొంటున్నారు. ఇది నేరుగా కంటితో చూడవచ్చు. ఆకాశం మేఘావృతం కాకుండా ఉంటే ఇది కనిపిస్తుంది. ఇతర తోకచుక్కల కంటే ఇది భిన్నమైంది.

Haley Comet : ఆకాశంలో అద్భుతం..హేలీ తోకచుక్క మళ్లీ వస్తోంది

ఈ అరుదైన తోకచుక్క పేరును C/2022 E3 (ZTF)గా పేర్కొంటున్నారు. ఫిబ్రవరి 1, 2 తేదీల్లో భూమికి దాదాపు 4.20 కోట్ల కిలో మీటర్ల దూరం నుంచి కనిపిస్తుంది. జనవరి 12న సూర్యుడి నుంచి తోకచుక్క దూరం 160 మిలియన్ కిలో మీటర్లు. అదే ఫిబ్రవరి 1, 2 తేదీల్లో భూమికి దగ్గరగా అది చేరుకుంటుంది. అంటే.. 42 మిలియన్ కిలో మీటర్లు దూరం అన్నమాట. అయితే, ఫిబ్రవరి 10న అంగారక గ్రహానికి దగ్గరగా వెళ్లినప్పుడు ఆకాశంలో తోకచుక్కను గుర్తించేందుకు మరో అవకాశం వస్తుందని జ్వికీ ట్రాన్సియెంట్ ఫెసిలిటీలో పనిచేస్తున్న కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఫిజిక్స్ ప్రొఫెసర్ థామస్ ఫ్రిన్స్ పేర్కొన్నారు.

Comet Leonard : డిసెంబర్ 12న ఆకాశంలో అద్భుతం.. 70వేల ఏళ్ల తర్వాత కనిపించనున్న ఆ గ్రీన్‌ కలర్‌ తోకచుక్క చూడాలంటే?

ఫిబ్రవరి 2న భూమికి తన కక్ష్యలో దగ్గరగా వచ్చిన సమయంలో రాత్రివేళ ఈ తోకచక్క స్పష్టంగా కనిపించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ప్రస్తుతం నాసా 3,743 తోక చుక్కలను గుర్తించింది.