Nikhat Zareen: బాక్సింగ్‌లో భారత్‌కు మరో పతకం.. నిఖత్ జరీన్‍‌కు స్వర్ణం

కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ విజయపరంపర కొనసాగుతోంది. బాక్సింగ్‌లో ఆదివారం భారత్‌కు మూడో స్వర్ణం దక్కింది. తాజా ప్రపంచ ఛాంపియన్ నిఖత్ జరీన్ 50 కేజీల విభాగంలో స్వర్ణ పతకం సాధించింది.

Nikhat Zareen: బాక్సింగ్‌లో భారత్‌కు మరో పతకం.. నిఖత్ జరీన్‍‌కు స్వర్ణం

Nikhat Zareen: కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ విజయపరంపర కొనసాగుతోంది. తెలంగాణ అమ్మాయి, బాక్సింగ్‌లో తాజా ప్రపంచ ఛాంపియన్ నిఖత్ జరీన్ స్వర్ణ పతకం సాధించింది. 50 కేజీల మహిళా బాక్సింగ్ విభాగంలో నార్తర్న్ ఐర్లాండ్‌కు చెందిన కార్లీ మెక్ నౌల్‌పై విజయం సాధించి పసిడి పతకం గెలుచుకుంది.

ISRO Satellites: నిరుపయోగంగా శాటిలైట్లు.. ఇస్రో ప్రకటన

కామన్వెల్త్ గేమ్స్‌లో, బాక్సింగ్‌లో ఇది ఇండియాకు ఆరో మెడల్ కాగా.. మూడో గోల్డ్ మెడల్. ఆదివారం రోజే నీతూ ఘంఘాస్, అమిత్ పంగల్ స్వర్ణ పతకాలు సాధించిన సంగతి తెలిసిందే. ఈ గేమ్స్‌లో ఇది మన దేశానికి 17వ గోల్డ్ మెడల్. వీటితోపాటు 12 సిల్వర్, 19 బ్రాంజ్ మెడల్స్ ఇండియా గెలుచుకుంది. దీంతో మన దేశం గెలుచుకున్న మొత్తం పతకాలం సంఖ్య 48కి చేరింది. ఈ జాబితాలో మన దేశం నాలుగో స్థానంలో నిలవడం విశేషం. ఈ ఏడాది మే 19న జరిగిన ప్రపంచ మహిళా బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ కూడా నిఖత్ గెలుచుకుంది. కొంతకాలంగా నిఖత్ వరుస విజయాలు సాధిస్తూ వస్తోంది. ఈ సీజన్‌లో ఇది నిఖత్ సాధించిన మూడో గోల్డ్ మెడల్.

Cow Dung Rakhis: ఆవుపేడతో తయారైన రాఖీలు.. విదేశాలకు ఎగుమతి

మేరీ కోమ్ తర్వాత బాక్సింగ్‌లో అత్యుత్తమ ప్రదర్శనతో దూసుకెళ్తున్న క్రీడాకారిణిగా నిలిచింది నిఖత్ జరీన్. మరోవైపు నిఖత్ జరీన్ కామన్వెల్త్ గేమ్స్‌లో గోల్డ్ మెడల్ సాధించడంపై తెలంగాణ సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. నిఖత్ జరీన్‌కు అభినందనలు తెలిపారు.