కోవిడ్ – 19 : వైరస్ రాకుండా ఉద్యోగులపై మందుల పిచికారీ

  • Published By: madhu ,Published On : February 15, 2020 / 07:34 PM IST
కోవిడ్ – 19 : వైరస్ రాకుండా ఉద్యోగులపై మందుల పిచికారీ

చైనాలో కోవిడ్ – 19 (కరోనా) వైరస్ ఇంకా తగ్గుముఖం పట్టడం లేదు. వైరస్ బారిన పడి చనిపోయిన వారి సంఖ్య వేలకు చేరుకొంటోంది. చాల మంది ఆస్పత్రులో చికిత్స పొందుతున్నారు. వైరస్‌కు వ్యాక్సిన్ కనిపెట్టడానికి శత విధాల ప్రయత్నాలు చేస్తున్నారు. చైనాలోని వూహాన్‌లో పరిస్థితి బీభత్సంగా ఉంది. దీనివల్ల చైనాలో వ్యాపారం, ఆర్థిక రంగాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి.

ఎన్నో కంపెనీలకు తాళాలు పడ్డాయి. వివిధ దేశాలు కూడా అలర్ట్ అయ్యాయి. తమ దేశానికి చెందిన వారిని వారి వారి దేశాలకు తీసుకెళుతున్నారు. అంతేగాకుండా చైనాకు వెళ్లే అన్నీ విమాన సర్వీసులను నిలిపివేశాయి. దీంతో అక్కడ పర్యాటకుల సంఖ్య పడిపోయింది.

ఇది మున్ముందు మరింతగా పడిపోతుందనే సంకేతాలు వెలువడుతున్నాయి. చైనాలో పలు సంస్థలు వైరస్ బారిన పడుకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేశాయి. ఓ కంపెనీ చేసిన చర్య ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.

Read More : ఢీ అంటే ఢీ : TRS Vs BJP పొలిటికల్ వార్

చాంగ్ కింగ్‌లోని ఓ సంస్థకు చెందిన ఉద్యోగుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకొంటోంది. రెండు భారీ ఇనుప వస్తువుతో తయారు చేసిన టన్నెల్‌లను ఏర్పాటు చేసింది. పై నుంచి పైపు ద్వారా యాంటీ వైరస్‌ మందులను కిందకు పిచికారీ చేసే విధంగా ఏర్పాటు చేశారు. విధులకు హాజరయ్యే ఉద్యోగులు టన్నెల్ కింద నిలబడాల్సి ఉంటుంది. వీరిపై మందులను పిచికారీ చేస్తారు. తర్వాతే..విధుల్లోకి అనుమతినిస్తోంది.