మాటల్లేవ్.. మైండ్ బ్లాంక్ : ఆయన పీల్చిన గాలి.. డబ్బాలో పెట్టి అమ్మేస్తున్నారు

  • Published By: veegamteam ,Published On : April 24, 2019 / 05:54 AM IST
మాటల్లేవ్.. మైండ్ బ్లాంక్ : ఆయన పీల్చిన గాలి.. డబ్బాలో పెట్టి అమ్మేస్తున్నారు

వేలం వెర్రి అంటే ఇదేనేమో. కొనేవాడు ఉండాలే కానీ అమ్మడానికి కాదేది అనర్హం అన్నట్టు పరిస్థితి తయారైంది. చివరికి గాలిని కూడా డబ్బాలో పెట్టి అమ్మేస్తున్నారు. గాలిని అమ్మడం వింతేముంది అనే సందేహం రావొచ్చు. వారు అమ్మేది మూములు గాలి అయితే అందులో వింతేమీ లేదు. ఇది చక్రవర్తి పీల్చిన గాలి, ఈ శకపు గాలి అని ప్రచారం చేసి మరీ అమ్ముతున్నారు.
Also Read : పిల్లలా ప్రొఫెషనల్ కిల్లర్సా : 9 మంది విద్యార్థుల హత్యకు బాలికల ప్లాన్

జపాన్ లో ఈ విడ్డూరం జరిగింది. అకిహిటో వంశానికి చెందిన హీస్ చక్రవర్తి పాలన ముగింపు దశకి వచ్చింది. హీస్.. 30 ఏళ్ల పాటు సింహాసనంపై ఉన్నారు. త్వరలోనే దిగిపోతున్నారు. కొత్త చక్రవర్తి, కొత్త శకం ప్రారంభం కానుంది. అకిహిటో శకం ముగింపును పురస్కరించుకుని స్థానిక కంపెనీ ఒకటి.. గొప్ప ఐడియా వేసింది. గాలి ని డబ్బాలో ప్యాక్ చేసి అమ్ముతోంది. ఇది అకిహిటో వంశానికి చెందిన చివరి గాలి, హీస్ చక్రవర్తి పీల్చిన గాలి.. అని ప్రచారం చేస్తోంది. గాలి డబ్బాలను కొనుక్కుని మీ జన్మ ధన్యం చేసుకోవాలని కంపెనీ ఊరిస్తోంది. హీస్ చక్రవర్తిని అభిమానించే వారు జపాన్ లో చాలామందే ఉన్నారు. ఆ అభిమానాన్ని క్యాష్ చేసుకునే పనిలో కంపెనీ ఉంది.

ఆకర్షణీయమైన డబ్బాలు తయారు చేసి అందులో గాలితో పాటు ఐదు కాయిన్స్ ఉంచారు. ఒక్కో గాలి డబ్బాను 700 రూపాయలకు అమ్ముతున్నారు. ఆలసించినా ఆశాభంగం అంటూ ఆ కంపెనీ ఫుల్ గా పబ్లిసిటీ చేస్తోంది. కేవలం వెయ్యి గాలి డబ్బాలు మాత్రమే ఉన్నాయని, కావాలనుకున్న వారు ఆన్ లైన్ లో కొనుక్కోవచ్చని కంపెనీ చెప్పింది. హీస్ చక్రవర్తి పాలనకు గుర్తుగా ఈ డబ్బాను ఉంచుకోవచ్చని కంపెనీ చెప్పింది. హీస్ చక్రవర్తి బొమ్మతో చేసిన కాయిన్స్ అక్కడ హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. మే 1 నుంచి జపాన్ లో రీవా శకం మొదలు కానుంది.
Also Read : బీజేపీకి షాక్ : కాంగ్రెస్ లో చేరిన ఎంపీ ఉదిత్ రాజ్