New Study: కరోనా నిర్మూలన సాధ్యమే.. మాస్క్‌లు లేకుండా తిరగొచ్చు.. ఎప్పుడంటే?

కరోనా కేసులు తగ్గుతున్నప్పటికీ, పూర్తిగా కరోనాకు పూర్వం పరిస్థితి వచ్చేందుకు ఇంకా ఎంతో సమయం పట్టేలా కనిపిస్తుంది.

New Study: కరోనా నిర్మూలన సాధ్యమే.. మాస్క్‌లు లేకుండా తిరగొచ్చు.. ఎప్పుడంటే?

Covid

Complete Eradication: కరోనా కేసులు తగ్గుతున్నప్పటికీ, పూర్తిగా కరోనాకు పూర్వం పరిస్థితి వచ్చేందుకు ఇంకా ఎంతో సమయం పట్టేలా కనిపిస్తుంది. అసలు మాస్క్‌లు లేని జీవితం గడపగలమా? అంటే కష్టమే అంటున్నారు కూడా. మన దేశంలో అయితే, ఇప్పటికి ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ మాత్రమే కనిపించినా.. కొన్ని దేశాల్లో థర్డ్ వేవ్, ఫోర్త్ వేవ్ కూడా పలకరించాయి.

ఇటువంటి సమయంలో ఓ అధ్యయనం ఊరట కలిగిస్తోంది. బ్రిటిష్ మెడికల్ జర్నల్ గ్లోబల్ హెల్త్‌(British Medical Journal Global Health)లో ప్రచురించబడిన అధ్యయనం ప్రకారం కోవిడ్‌ను కచ్చితంగా నిర్మూలించవచ్చునని, అందుకోసం కొన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవాలని సూచించింది. వాటిలో, సురక్షితమైన మరియు సమర్థవంతమైన వ్యాక్సిన్లను వాడుకోవడం.. రోగనిరోధక శక్తిని పెంచుకునే ప్రయత్నాలు చెయ్యడం.. ప్రభుత్వాలు జాగ్రత్తలు తీసుకోవడం.. కరోనా నియంత్రణ చర్యలను ప్రజలు అర్థం చేసుకోవడం.. సామాజిక, రాజకీయ మరియు ఆర్థిక అంశాలను దృష్టిలో పెట్టుకోవడం అని చెబుతోంది అధ్యయనం.

పక్కా ప్లాన్ ప్రకారం.. ప్రపంచవ్యాప్త సంక్రమణను సున్నాకి తీసుకుని రావచ్చునని.. SARS-CoV-2 నిర్మూలన సాధ్యమేనా అనే విషయాన్ని నిర్వచించారు. ఉద్దేశపూర్వక ప్రయత్నాల ఫలితంగా ఒక నిర్దిష్ట ప్రణాళిక ప్రకారం.. ప్రపంచవ్యాప్త కరోనా సంక్రమణ సున్నాకి శాశ్వతంగా తీసుకునిరావడానికి ఈ ప్రణాళిక సాయపడుతుంది. గతంలో మశూచికి, పోలియోవైరస్‌లు కూడా ఇదే రకమైన మార్గాన్ని అనుసరించారు. పరిశోధకులు COVID-19 వైరస్‌ను మశూచి మరియు పోలియోతో పోల్చారు మరియు మశూచి నిర్మూలన కంటే కోవిడ్‌ని వదిలించుకోవడం చాలా కష్టం, కానీ పోలియోను వదిలించుకోవడం కంటే సులభం అని వెల్లడించారు.

విశ్లేషణ ప్రకారం.. రాజకీయ సంకల్పం, కోవిడ్ నిర్మూలనకు ప్రభుత్వం పెట్టుబడులు పెట్టడం ముఖ్యం అని విశ్లేషణలో నిపుణులు చెబుతున్నారు. సామాజిక అవగాహన లేకుండా ఇది సాధ్యం కాకపోవచ్చు. ఇది అంత సులభమైన పని కాదు కానీ వందల వేల మంది ప్రాణాలను కాపాడేందుకు మాత్రం లక్షలాది మందికి కోవిడ్ సోకకుండా ఉండేందుకు మాత్రం ఇది ముఖ్యం అని అధ్యయనం చెబుతుంది.

టెక్నికల్‌గా COVID-19 నిర్మూలనకు చాలా కష్టపడాల్సి ఉందని, వ్యాక్సిన్ వేయించుకోవడం, రోగనిరోధకను పెంచుకోవడం, ముందస్తుగా ఖర్చు పెట్టి, వ్యాక్సిన్ మరియు ఆరోగ్య వ్యవస్థలను అప్‌గ్రేడ్ చేయడం ద్వారా పూర్తిగా పరిస్థితి అదుపులోకి వచ్చే అవకాశం ఉందని చెబుతోంది అధ్యయనం.