పట్టాలు తప్పిన రైలు..50మంది మృతి

పట్టాలు తప్పిన రైలు..50మంది మృతి

కాంగోలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. టంగాయికా ప్రావిన్స్‌లో రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో 50 మంది చనిపోగా, 23మందికి  తీవ్ర గాయాలయ్యాయి. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు తెలిపారు. మరికొందరు రైలు కింద చిక్కుకుపోయినట్లు తెలిసింది.

 స్థానిక కాలమానం ప్రకారం  తెల్లవారుజామున 3 గంటలకు మాయిబారిడి పట్టణంలో ఈ ప్రమాదం జరిగిందని మానవతా వ్యవహారాల మంత్రి స్టీవ్ ఎంబికాయి తెలిపారు. ప్రభుత్వం తరపున బాధిత కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నట్లు ఆయన ట్వీట్ చేశారు. మరికొందరు రైలు కింద చిక్కుకుపోయారని,వారిని రక్షించేందుకు సహాయకచర్యలు కొనసాగుతున్నట్లు ఆయన తెలిపారు. అయితే రైలు ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.