Shinzo Abe : జపాన్ మాజీ ప్రధాని షింజో అబే హత్య పట్ల సోనియాగాంధీ దిగ్భ్రాంతి

భారత్-జపాన్ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింతగా పెంచడానికి ఆయన అబే కృషి చేశారని పేర్కొన్నారు. జపాన్‌కు, వాస్తవానికి మొత్తం అంతర్జాతీయ సమాజానికి సంభవించిన దురదృష్టకర ఘటన అని అన్నారు.

Shinzo Abe : జపాన్ మాజీ ప్రధాని షింజో అబే హత్య పట్ల సోనియాగాంధీ దిగ్భ్రాంతి

Sonia Gandhi

Shinzo Abe : జపాన్ మాజీ ప్రధాని షింజో అబే హత్య పట్ల కాంగ్రెస్ అధ్యక్షులు సోనియా గాంధీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చాలా సంవత్సరాలుగా షింజో అబే భారతదేశానికి గొప్ప స్నేహితుడు, శ్రేయోభిలాషి అన్నారు. భారత్-జపాన్ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింతగా పెంచడానికి ఆయన అబే కృషి చేశారని పేర్కొన్నారు. జపాన్‌కు, వాస్తవానికి మొత్తం అంతర్జాతీయ సమాజానికి సంభవించిన దురదృష్టకర ఘటన అని అన్నారు.

అంతకముందు షింజోఅబే మృతి పట్ల భారత ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తన ప్రియమైన స్నేహితులలో షింజో ఒకరు అని పేర్కొన్నారు. అబే మరణం తనకు బాధ కలిగించిందన్నారు. భారత్-జపాన్ సంబంధాలను ప్రత్యేక వ్యూహాత్మక, గ్లోబల్ పార్టనర్‌షిప్ స్థాయికి పెంచడంలో షింజో అబే అపారమైన సహకారం అందించారని కొనియాడారు. ఈరోజు, భారతదేశం మొత్తం అబేకు సంతాపం తెలుపుతుందన్నారు. ఈ కష్ట సమయంలో జపనీస్ సోదర, సోదరీమణులకు తాము సంఘీభావంగా ఉంటామని తెలిపారు.

Shinzo Abe : ‘షింజో అబే’ని అందుకే చంపాలనుకున్నా: పోలీసుల విచారణలో వెల్లడించిన నిందితుడు

దుండగుడు జరిపిన కాల్పుల్లో జపాన్ మాజీ ప్రధాని షింజో అబే మృతి చెందారు. కాల్పుల్లో తీవ్ర గాయాలైన ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. దుండగుడి కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన షింజో అబే ప్రాణాలు విడిచినట్లు జపాన్ మీడియా ప్రకటించింది. వెస్టరన్ జపాన్ లో శుక్రవారం ఉదయం షింజో అబేపై దుండగుడు కాల్పులు జరిపాడు. సభలో ప్రసంగిస్తుండగా షింజోపై దుండుగుడు కాల్పులు జరిపాడు.

ఉదయం 8 గంటల 29 నిమిషాల సమయంలో షింజో పై రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. పార్లమెంట్​ ఎగువ సభకు ఆదివారం ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో నరా ప్రాంతంలోని ఓ వీధిలో అబే ప్రసంగిస్తుండగా వెనుక నుంచి దుండగుడు కాల్పులు జరిపాడు. షింజో అబే ఛాతీలోకి బుల్లెట్లు దూసుకుపోయాయి. కాల్పులు జరిపన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జపాన్​కు సుదీర్ఘకాలంగా ప్రధానిగా అబే పని చేశారు. 2020లో ఆరోగ్య కారణాలతో ప్రధాని పదవి నుంచి అబే తప్పుకున్నారు.