బతికిపోయారు : 3 విమానాలకు తప్పిన ఘోర ప్రమాదం

విమాన ప్రయాణికులకు వెన్నులో వణుకుపుట్టించిన  ఈ సంఘటన ఢిల్లీ గగనతల సమాచార ప్రాంతంలో(ఎఫ్‌ఐఆర్‌)లో చోటు చేసుకుంది.

  • Edited By: sreehari , December 29, 2018 / 06:05 AM IST
బతికిపోయారు : 3 విమానాలకు తప్పిన ఘోర ప్రమాదం

విమాన ప్రయాణికులకు వెన్నులో వణుకుపుట్టించిన  ఈ సంఘటన ఢిల్లీ గగనతల సమాచార ప్రాంతంలో(ఎఫ్‌ఐఆర్‌)లో చోటు చేసుకుంది.

ఢిల్లీ: ఆకాశంలో తృటిలో ఘోర ప్రమాదం తప్పింది. ఏ మాత్రం తేడా వచ్చినా సెకన్లలో వందలామంది ప్రాణాలు గాల్లోనే కలిసిపోయేవి. విమాన ప్రయాణికులకు వెన్నులో వణుకుపుట్టించిన  ఈ సంఘటన ఢిల్లీ గగనతల సమాచార ప్రాంతంలో(ఎఫ్‌ఐఆర్‌)లో చోటు చేసుకుంది. మూడు విమానాలకు ప్రమాదం తప్పింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ (ఏటీసీ) అలర్ట్ కావడంతో పెను ప్రమాదం తప్పింది. లేదంటే మూడు విమానాలు గాల్లో ఒకదానికొకటి ఢీకొనేవే.

దూరం 10 అడుగులే:
అమెరికా నేషనల్ ఎయిర్‌లైన్స్‌ విమానం (ఎన్‌సీఆర్‌-840) హాంకాంగ్‌ నుంచి ఆఫ్ఘనిస్థాన్‌లోని బగ్రమ్‌కు వెళ్తూ 31 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తోంది. అదే సమయంలో తైవాన్‌ విమానం ఒకటి వియత్నాం నుంచి బ్యాంకాక్ వెళ్తూ 32 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తోంది. డచ్‌కు చెందిన మరో విమానం కేఎల్ఎం -875 ఆమ్‌స్టర్‌డ్యాం నుంచి బ్యాంకాక్ వెళ్తూ 33 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తోంది. మూడు విమానాలు ప్రయాణిస్తున్న ఎత్తులో తేడా ఉన్నప్పటికీ దూరం మాత్రం కేవలం 10 అడుగులే. ఆ సమయంలో 3 విమానాల్లో కలపి వందలాది ప్రయాణికులు ఉన్నారు.

దీంతో అంతా టెన్షన్ పడ్డారు. ప్రమాదాన్ని ఊహించిన ఏటీసీ వెంటనే అలర్ట్ అయ్యింది. మూడు విమానాల పైలట్లకు హెచ్చరికలు పంపింది. ప్రమాదాల నియంత్రణ వ్యవస్థను అలర్ట్ చేసింది. ఏటీసీ సమాచారంతో పైలెట్లు అప్రమత్తమయ్యారు. వెంటనే విమానాల ఎత్తుతోపాటు దిశలను మార్చేశారు. దీంతో ఘోర ప్రమాదం తప్పినట్టు అయ్యింది. ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో అధికారులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు.