ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం.. నిలువునా చీలిన రోడ్లు

ఫిలిప్పీన్స్ లో భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 7.2గా నమోదు అయింది. 2018, డిసెంబర్ 29న తూర్పు ఫిలిప్పీన్ నగరం జనరల్ సంటోస్ కు 193 కిలోమీటర్ల దూరంలో.. 60 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉంది.

  • Published By: sreehari ,Published On : December 29, 2018 / 06:11 AM IST
ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం.. నిలువునా చీలిన రోడ్లు

ఫిలిప్పీన్స్ లో భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 7.2గా నమోదు అయింది. 2018, డిసెంబర్ 29న తూర్పు ఫిలిప్పీన్ నగరం జనరల్ సంటోస్ కు 193 కిలోమీటర్ల దూరంలో.. 60 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉంది.

మనీలా : ఫిలిప్పీన్స్ లో భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 7.2గా నమోదు అయింది. 2018, డిసెంబర్ 29న తూర్పు ఫిలిప్పీన్ నగరం జనరల్ సంటోస్ కు 193 కిలోమీటర్ల దూరంలో.. 60 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉంది. దక్షిణ ఫిలిప్పిన్ లోని మిందనావో ద్వీపం భారీ నష్టం వచ్చింది. భూమిపై పగుళ్లు ఏర్పడ్డాయి. రోడ్లు నిలువునా చీలాయి. ప్రాణ నష్టం జరగలేదు. వందల కోట్ల ఆస్తి నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా వేస్తున్నారు.

ఈ భూకంపంతో సునామీ వచ్చే అవకాశాలు ఉన్నాయని యూఎస్ జియాలాజికల్ సర్వే హెచ్చరించింది. ఫిలిప్పీన్, ఇండోనేషియా తీర ప్రాంతాల్లో హజార్దౌస్ ముప్పు పొంచి ఉందని ప్రకటించింది ది పిసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం. భూకంపం వల్ల ఫిలిప్పీన్ మరియు ఇండోనేషియా తీర ప్రాంతాల వెంబడి 300 కిలోమీటర్ల లోపు హజార్దౌస్ సునామీ తరంగాలు వచ్చే అవకాశాలున్నాయని హెచ్చరికలు జారీ చేసింది. హవాయ్ కు ఎలాంటి ముప్పు లేదని స్పష్టం చేసింది.