ట్రెండింగ్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఇవే.. 

ప్రపంచంలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అందరూ జరుపుకుంటారు. అందులో వింత ఏముంది అనుకుంటున్నారా? అందరిలా జరుపుకోవడం కాదూ.. ఇక్కడ.. డిపరెంట్ గా సెలబ్రేట్ చేసుకోవడమే విశేషం.

  • Published By: sreehari ,Published On : January 1, 2019 / 10:29 AM IST
ట్రెండింగ్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఇవే.. 

ప్రపంచంలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అందరూ జరుపుకుంటారు. అందులో వింత ఏముంది అనుకుంటున్నారా? అందరిలా జరుపుకోవడం కాదూ.. ఇక్కడ.. డిపరెంట్ గా సెలబ్రేట్ చేసుకోవడమే విశేషం.

ప్రపంచంలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అందరూ జరుపుకుంటారు. అందులో వింత ఏముంది అనుకుంటున్నారా? అందరిలా జరుపుకోవడం కాదూ.. ఇక్కడ.. డిపరెంట్ గా సెలబ్రేట్ చేసుకోవడమే విశేషం. కొత్త ఏడాదికి వెల్ కమ్ చెప్పే ముందు ఏం చేస్తారు.. హ్యాపీ న్యూ ఇయర్ అంటూ కేకలు పెడతారు. క్లబ్బులు, బార్లు, పబ్బులకు వెళ్లి ఫుల్ గా తాగేసి చిందులు వేస్తారు. టఫాసులు పేలుస్తారు. చివరికి డ్రంక్ అండ్ డ్రైవ్ లో అడ్డంగా దొరికిపోతారు.. అది కామనే అనుకోండి. కానీ, విదేశాల్లో ఈ కొత్త ఏడాదిని కాస్త డిఫరెంట్ గా జరుపుకున్నారు. మోడ్రాన్ డ్రెస్సుల్లో ముస్తాబయ్యారు.. సాంపద్రాయ దుస్తుల్లో మెరిసిపోయారు.

లండన్ లో అలా..

లండన్ అయితే చెప్పనక్కర్లేదు. 2019 కొత్త ఏడాదికి సరికొత్త పద్ధతిలో వెల్ కమ్ చెప్పారు. ఇటీవలే ఇక్కడి పార్లమెంట్ న్యూ ఇయర్ వేడుకల దృష్ట్యా భారీ ఎలక్ట్రానిక్ మెకానిజం బెల్ ను రూపొందించింది. 2019 సంవత్సరంలో అడుగుపెట్టే ముందు ఆలారం మోగించారు. దీని బరువు 440 పౌండ్లు (200 కిలోలు అనమాట). ఇక చైనాలో కౌంట్ డౌన్ ఈవెంట్స్ ప్రధాన నగరాల్లో పెద్ద ఎత్తునా జరిగాయి. బుద్దుని దేవాలయాలకు వెళ్లి ప్రార్థనలు చేసి బెల్ మోగిస్తూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు.

ఆస్ట్రేలియాలో ఇలా.. 

ఆస్ట్రేలియాలో న్యూ ఇయర్ వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. ఆస్ట్రేలియా చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా ఈ ఏడాది వేడుకలు జరుపుకున్నారు. ప్రత్యేకించి ఫైర్ వర్క్స్ ఎంతగానో ఆకట్టుకున్నాయి. గోల్డ్; పర్పల్, సిల్వర్ ఫైర్ వర్క్స్ అత్యంత అద్భుతంగా ఆహ్లాదకరంగా జరిగాయి. సంప్రదాయ పద్ధతిలో వేలాది మంది ఒక చోట చేరి ఉరుము మెరుపు ఎలా ఉంటుందో అలా ఫైర్ వర్స్క్ ను ప్రదర్శించారు. అచ్చం ఆకాశంలో మెరుపు వస్తే ఎలా ఉంటుందో అదే అనుభూతి కలిగించేలా ప్రదర్శించడం విశేషం.  

న్యూయార్క్ లో మరోలా..

విభన్నంగా 2019 కొత్త సంవత్సరానికి గ్రాండ్ వెల్ కమ్ చెప్పారు. న్యూయార్క్ లోని టైమ్స్ స్క్వయిర్ లో మంచు కొరుక్కు తినేంత  చలితో కూడిన ఉష్ణోగ్రత ఉంది. 40 డిగ్రీల కంటే అతి తక్కువ స్థాయిలో ఉష్ణోగ్రత ఉన్నా ఏమాత్రం లెక్కచేయని అక్కడి వారంతా న్యూ ఇయర్ వేడుకలను ఆడంబరంగా జరుపుకున్నారు. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు న్యూయార్క్ పోలీసులు అప్రమత్తమయ్యారు. బాంబు స్కాడ్, డాగ్స్, 1200 సెక్యూరిటీ కెమెరాలు అమర్చారు. అందరూ కలిసి ఒకేచోట చేరి వేడుకలు జరుపుకున్నారు. లాస్ వేగాస్ లో 2019 సంవత్సరానికి స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున ఫైర్ క్రాకర్స్ పేల్చారు. న్యూ ఇయర్ కి ముందు ఫైర్ క్రాకర్స్ షో నిర్వహించారు. 8 నిమిషాల పాటు టపాసుల మోత మోగుతూనే ఉంది. మరో దేశలో పొలిటికల్ ఈవెంట్స్ కూడా అందరిని ఆకట్టుకున్నాయి. 

న్యూ ఇయర్ వేడుకలు విభన్నంగా జరుపుకున్నారు. తాగి చిందులేశారు. ఫైర్ క్రాకర్లు పేల్చారు. ట్రెండింగ్ డ్రెస్సులతో మెరిసిపోయారు. అన్నీ బాగున్నాయి కానీ.. మరొకటి ఉంటే బాగుంటుందని అనిపించలేదా? అదేనండీ.. వీటితో పాటు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు కూడా ఉంటే బాగుండనిపిస్తుంది కదా?