Pakistan : గరిష్ఠస్థాయికి నిరుద్యోగ రేటు..ఫ్యూన్ పోస్ట్ కోసం 15లక్షల మంది దరఖాస్తు

పాకిస్థాన్‌లో నిరుద్యోగ రేటు తీవ్రంగా పెరుగుతోంది. ఇటీవల పాకిస్తాన్ కోర్టులో ఒక్క ప్యూన్ పోస్ట్ కోసం దరఖాస్తులు కోరగా.. 15 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.

Pakistan : గరిష్ఠస్థాయికి నిరుద్యోగ రేటు..ఫ్యూన్ పోస్ట్ కోసం 15లక్షల మంది దరఖాస్తు

Pak (1)

Pakistan  పాకిస్థాన్‌లో నిరుద్యోగ రేటు తీవ్రంగా పెరుగుతోంది. ఇటీవల పాకిస్తాన్ కోర్టులో ఒక్క ప్యూన్ పోస్ట్ కోసం దరఖాస్తులు కోరగా.. 15 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు చేసుకున్న వారిలో ఎంఫిల్ చేసిన వ్యక్తులు కూడా ఉన్నారు. దీనిని బట్టి పాక్ లో నిరుద్యోగం ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే నిరుద్యోగం ఈ స్థాయిలో ఉంటే ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం చెప్తున్న లెక్కలు మరోలా ఉన్నాయి. ఓ వైపు పాకిస్తాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డెవలప్‌మెంట్ ఎకనమిక్స్ (PIDE)దేశంలో నిరుద్యోగం రేటు 16 శాతానికి చేరిందని చెప్తుండగా.. లేదు లేదు 6.5 శాతమే నిరుద్యోగం రేటు ఉందని ఇమ్రాన్ సర్కార్ చెప్తోంది.

పీఐడీఈ సోమవారం విడుదల చేసిన నివేదిక ప్రకారం… పాకిస్థాన్‌లో నిరుద్యోగం రేటు 16 శాతం ఉంది. విద్యావంతుల్లో కనీసం 24 శాతం మందికి ఉపాధి లేదు. ప్రణాళిక, అభివృద్ధిపై సెనేట్ స్టాండింగ్ కమిటీకి పీఐడీఈ తెలిపిన వివరాల ప్రకారం..40 శాతం గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్లు నిరుద్యోగులుగా ఉన్నారు. ఎంఫిల్‌లో చదివిన వారు కూడా చాలా మంది ఉన్నారు. వీరిని కూడా గణాంకాల్లో చేర్చినట్లయితే నిరుద్యోగిత రేటు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి.

లాక్ డౌన్ కారణంగా దాదాపు 2 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయారని, ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో కార్మికులు ఉన్న దేశాల్లో పాకిస్థాన్ 9 వ స్థానంలో ఉన్నదని ఎకనామిక్‌ సర్వే నివేదిక పేర్కొన్నది. పాకిస్థాన్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రచురించిన లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారం, దేశంలో నిరుద్యోగం రేటు 2017-18లో 5.8 శాతం ఉండేది, ఇది 2018-19నాటికి 6.9 శాతానికి పెరిగింది.