Corona మ్యాప్ షేర్ చేస్తున్నారా.. హ్యాకర్ల ట్రాప్‌లో పడినట్లే

Corona మ్యాప్ షేర్ చేస్తున్నారా.. హ్యాకర్ల ట్రాప్‌లో పడినట్లే

కరోనావైరస్.. ప్రపంచంలోనే ఏ మూలకు వెళ్లినా వినిపిస్తున్న పదం. భయంతో నిద్ర లేకుండా చేస్తుంది. ఈ కారణంతోనే ఒకరికి తెలిసిన విషయాన్ని మరొకరికి షేర్ చేసుకోవాలనే ఆరాటంతో కరోనా గురించి ప్రతి విషయాన్ని వైరల్ గా మార్చేస్తున్నారు. అయితే ఇటీవల కరోనా మ్యాప్ అంటూ.. ఏ ప్రాంతంలో ఎన్ని కేసులు ఉన్నాయో అని  ఆన్‌లైన్ లింక్ ఒకటి వైరల్ అవుతుంది.

షేర్ చేయాలనుకుని దాన్ని ఇతరులకు పంపినా.. అందులో ఏముందో అని క్లిక్ చేసినా.. అంతే మనం హ్యాకర్ల ట్రాప్ లోకి వెళ్లిపోయినట్లే. ఈ కరోనా మ్యాప్ లింక్ పేరుతో ఒక మేల్‌వేర్‌ మన ఫోన్లో చొచ్చుకుపోతుందని సెక్యూరిటీ రీసెర్చర్ షై అల్ఫైసీ బయటపెట్టారు. ఫోన్లలో సేవ్ అయి ఉన్న పాస్‌వర్డ్స్స క్రెడిట్ కార్డు నెంబర్లు, ఇతర డేటా, బ్రౌజర్‌లో సేవ్ అయి ఉన్న ఇన్ఫర్మేషన్ ఇట్టే దొంగిలిస్తారు.

అందరూ అనుకున్నట్లు ఏదో యాప్ ఇన్‌స్టాల్ చేస్తేనే దొంగిలించడం కుదురుతుందని అనుకోవద్దు. ఎటువంటి ఇన్‌స్టాలేషన్ లేకుండానే పని చేసుకుపోతారు. కేవలం మనం చూస్తున్నంతసేపు కరోనా వైరస్(COVID19) మ్యాప్ లోడ్ అవుతున్నట్లే చూపిస్తుంది. కరోనా మ్యాప్ యూఆర్ఎల్ కనిపిస్తున్నా.. మీ ఫోన్లో ఇతర సోర్స్‌ల నుంచి మరో అప్లికేషన్ రన్ అవుతుంటుంది.

ప్రస్తుతం ఈ మాల్‌వేర్ విండోస్ సిస్టమ్ లను అటాక్ చేస్తుంది. ఇందులో వస్తున్న కొత్త వెర్షన్ ఇతర పరికరాలపైనా చూపించే ప్రమాదం ఉంది. ఈ టెక్నిక్ ఇప్పటిది కాదని.. 2016లోనూ ఇదే విధంగా ఓ వైరల్ మెసేజ్ ద్వారా హ్యాకర్లు వాడారని అల్ఫైసీ అంటున్నారు. మరికొన్ని మెసేజ్ లు యాప్ ఇన్ స్టాల్ చేసుకుంటారా అని అడుగుతున్నాయంట. ఇవేమో అసలు అవసర్లేకుండానే దోచేస్తున్నాయి.

See Also | భారత్‌లో తొలి కరోనా మృతి.. డిక్లేర్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం