మహమ్మారి భయంతో కరోనా బీరు ఆపేశారు!!

మహమ్మారి భయంతో కరోనా బీరు ఆపేశారు!!

మెక్సికన్ కంపెనీకి చెందిన కరోనా బీరు ప్రొడక్షన్ ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు గురువారం ప్రకటించారు. కొవిడ్ 19 మహమ్మారి కారణంగా హెల్త్ ఎమర్జెన్సీ నిమిత్తం ఈ నిర్ణయం తీసుకున్నారు. గ్రూపో మోడలోకు చెందిన ఇతర బ్రాండ్లు అయిన పసిఫికో, మోడెలోలు సైతం మెక్సికో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏప్రిల్ 30వరకూ ప్రొడక్షన్ నిలిపేస్తున్నట్లు ప్రకటించారు. 

‘ప్రొడక్షన్ తగ్గించే పనిలో భాగంగా ప్లాంట్లను సిద్ధం చేస్తున్నాం. కొద్ది రోజుల్లో దీనిని పూర్తిగా తగ్గించాలనుకుంటున్నాం. కేవలం వ్యవసాయానికి సంబంధించిన పనులు మాత్రమే జరుగుతాయిని మిగిలిన వాటిని రద్దు చేస్తున్నట్లుగా మెక్సికో ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వం ఒప్పుకుంటే 75శాతం మంది కార్మికులతో బీరు సిద్ధం చేసేందుకు సిద్ధంగానే ఉన్నామని గ్రూపో మోడలో చెప్పింది.

మరో మెక్సికో టాప్ బీర్ ప్రొడక్షన్ కంపెనీ అయిన హీనెకిన్ కూడా  శుక్రవారం నుంచి ఉత్పత్తి ఆపేయనుంది. ప్రొడక్షన్ ను ఆపేయడంతో పాటు డిస్ట్రిబ్యూషన్ ను కూడా నిలిపేసింది. వైరస్ వ్యాప్తి పెరుగుతుండటంతో వస్తున్న సంక్షోభాన్ని అడ్డుకునే దిశగా టాప్ బీర్ కంపెనీలు సైతం ప్రొడక్షన్ నిలిపేస్తున్నాయి.

ఇదిలా ఉంటే వైరస్ సంక్షోభం మొదలైన నాటి నుంచి.. కరోనా బీర్ మీద ఆన్ లైన్ జోకులు, మేమ్స్ వైరల్ గా మారాయి. ఫలితంగా అమెరికాలో 40శాతం అమ్మకాలు తగ్గిపోయాయి. యాజమాన్యం కరోనా బీర్ కారణంగా వైరస్ రాదని చెప్తున్నా ఉపయోగం లేకుండాపోయింది. కాగా, మెక్సికోలో 1500 కరోనా కేసులు కన్ఫామ్ అవగా 50మంది ప్రాణాలు కోల్పోయారు. 

Also Read | మోడీజీ.. వాస్తవంలోకి రండి: మీ మాట వింటాం.. మా మాట కూడా వినండి