Coronavirus Updates: చైనా తరువాత ఆ నాలుగు దేశాల్లో కరోనా విజృంభణ.. ఏడు వారాల్లో 30లక్షల మంది ..

క్రిస్మస్, న్యూఇయర్ వేడుకల తరువాత జపాన్, అమెరికా, దక్షిణ కొరియా, బ్రెజిల్ వంటి దేశాల్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నట్లు యూకే ఆధారిత ఆరోగ్య డేటా సంస్థ నివేదికలో పేర్కొంది.

Coronavirus Updates: కరోనా వైరస్ వ్యాప్తి ప్రపంచ వ్యాప్తంగా వేగంగా పెరుగుతోంది. రోజురోజుకు కరోనా భారినపడుతున్న వారి సంఖ్య పెరుగుతుండటం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే చైనాను అతలాకుతలం చేస్తున్న వైరస్.. ప్రపంచంలోని మిగిలిన దేశాల్లోనూ మళ్లీ విజృంభిస్తోంది. చైనాలో జీరో కోవిడ్ విధానాన్ని ఉపసంహరించుకున్నప్పటి నుండి కరోనా వ్యాప్తి వేగంగా పెరిగింది. ఆ దేశంలో ప్రతీరోజూ సుమారు 5వేలకుపైగా మరణాలు సంభవిస్తున్నాయని యూకే ఆధారిత ఆరోగ్య డేటా సంస్థ నివేదిక పేర్కొంది.

China Corona Virus : చైనాలో కరోనా విలయ తాండవం.. వైరస్ సోకి రోజుకు 9 వేల మంది మృతి

చైనాలో ఇప్పటి వరకు 18.6 కోట్ల కరోనా కేసులు గుర్తించడం జరిగిందని, ఒక్క డిసెంబర్ నెలలోనే దాదాపు లక్ష మంది వరకు కరోనా వైరస్ భారినపడి మరణించారని యూకే ఆధారిత ఆరోగ్య డేటా సంస్థ నివేదికలో పేర్కొంది. జనవరి, ఫిబ్రవరి నెలల్లో పరిస్థితి తీవ్రరూపందాల్చే అవకాశం ఉందని నివేదిక అంచనా వేసింది. చైనా తరువాత అత్యధికంగా జపాన్‌లో కరోనా కేసులు నమోదవుతున్నాయి.

Covid in China: కొవిడ్ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలపండి: చైనాకు డబ్ల్యూహెచ్‌వో సూచన

క్రిస్మస్, న్యూఇయర్ వేడుకల తరువాత జపాన్, అమెరికా, దక్షిణ కొరియా, బ్రెజిల్ వంటి దేశాల్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతుందని నివేదికలు పేర్కొంటున్నాయి. గత ఏడు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 30లక్షలకు పైగా కరోనా కేసులు నమోదు కాగా, 9,847 మంది ప్రాణాలు కోల్పోయారని అంచనా. ఒక్క జపాన్ లోనే ఏడు రోజుల్లో 2,188 మంది కరోనా కారణంగా మరణించారని పలు నివేదికలు పేర్కొన్నాయి.

Corona XBB.1.5 Variant : భారత్ లోకి ప్రవేశించిన ప్రమాదకర కరోనా XBB.1.5 వేరియంట్.. గుజరాత్ లో తొలి కేసు నమోదు

గత ఏడు రోజుల్లో.. దక్షిణ కొరియాలో 429 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. అమెరికాలో 1,239 మంది, బ్రెజిల్‌లో 1,015 మంది, తైవాన్ లో 174 మంది, హాంకాంగ్‌లో 291 మంది, ఫ్రాన్స్‌లో 808 మంది, ఇటలీలో 430 మంది, ఆస్ట్రేలియాలో 106 మంది కరోనా కారణంగా మరణించారని తాజా నివేదికలు పేర్కొంటున్నాయి.

ట్రెండింగ్ వార్తలు