కరోనా కల్లోలం, దేశంలో లక్ష దాటిన కొవిడ్ కేసులు, ప్రపంచంలో అరకోటికి చేరువలో

కరోనా వైరస్‌‌ దేశమంతా వేగంగా వ్యాపిస్తోంది. రోజురోజుకు వైరస్ తీవ్రత పెరుగుతోంది. కొన్ని రోజులుగా వేలల్లో

  • Published By: naveen ,Published On : May 19, 2020 / 04:25 AM IST
కరోనా కల్లోలం, దేశంలో లక్ష దాటిన కొవిడ్ కేసులు, ప్రపంచంలో అరకోటికి చేరువలో

కరోనా వైరస్‌‌ దేశమంతా వేగంగా వ్యాపిస్తోంది. రోజురోజుకు వైరస్ తీవ్రత పెరుగుతోంది. కొన్ని రోజులుగా వేలల్లో

కరోనా వైరస్‌‌ దేశమంతా వేగంగా వ్యాపిస్తోంది. రోజురోజుకు వైరస్ తీవ్రత పెరుగుతోంది. కొన్ని రోజులుగా వేలల్లో కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 4వేల 970 పాజిటివ్‌ కేసులు నమోదవగా, 134 మంది మరణించారు. దీంతో దేశంలో మంగళవారం(మే 19,2020) ఉదయం నాటికి కరోనా వైరస్‌ కేసుల సంఖ్య లక్ష దాటింది. ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య 1,01,139కి చేరింది. ఈ ప్రాణాంతక వైరస్‌ వల్ల ఇప్పటివరకు 3వేల 163 మంది మరణించారు. దేశంలో ఇంకా 58,802 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 39వేల 173 మంది బాధితులు కోలుకున్నారు. 

కరోనా కేసుల్లో టాప్ లో మహారాష్ట్ర:
దేశంలో కరోనాకు కేంద్రబిందువుగా మారిన మహారాష్ట్రలో కరోనా ఉదృతి కొనసాగుతున్నది. రాష్ట్రంలో ఇప్పటివరకు 35వేల 058 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవగా, 1249 మంది మృతిచెందారు. తమిళనాడులో 11,760 పాజిటివ్‌ కేసులు నమోదవగా, 81 మంది మరణించారు. మూడో స్థానంలో ఉన్న గుజరాత్‌లో 11,745 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ఇప్పటివరకు 694 మంది మరణించారు. దేశరాజధాని ఢిల్లీలో 10,054 మంది కరోనా బారినపడగా, 168 మంది బాధితులు మృతిచెందారు. మధ్యప్రదేశ్‌లో 5,236 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవగా, ఇప్పటివరకు 252 మంది మరణించారు. దేశంలోని మెయిన్‌‌ సిటీల పరంగా చూస్తే ఒక్క ముంబైలోనే 20వేల మందికి పైగా వైరస్‌‌ సోకింది. తర్వాత అహ్మదాబాద్‌‌లో 8,600కి పైగా, చెన్నైలో 7,100కు పైగా కేసులు రికార్డయ్యాయి.

ప్రపంచవ్యాప్తంగా అర కోటికి చేరువలో కరోనా కేసులు: 
ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసులు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య అరకోటికి చేరువలో ఉంది. ఇప్పటివరకు ఈ ప్రాణాంతక మహమ్మారి బారిన పడినవారి సంఖ్య 48,01,875కి చేరింది. ఇందులో 3లక్షల 16వేల 671 మంది బాధితులు మరణించారు. ప్రపంచవ్యాప్తంగా 18లక్షల 58వేల 170 మంది కోలుకున్నారు. 26 లక్షల 27వేల 34 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 

* కరోనా కేసులు, మృతుల పరంగా అమెరికా అగ్రస్థానంలో కొనసాగుతోంది. 
* అమెరికాలో ఇప్పటివరకు 15లక్షల 27వేల 664 కరోనా కేసులు నమోదయ్యాయి. 
* ఈ వైరస్‌ వల్ల ఇప్పటివరకు 90వేల 978మంది మృతిచెందారు. గడిచిన 24 గంటల్లోనే 820 మంది మరణించారు. 
* అమెరికాలో మొత్తం నమోదైన కేసుల్లో ఇంకా 10లక్షల 90వేల 297 యాక్టివ్‌గా ఉన్నాయి. 3లక్షల 46వేల 389 మంది కోలుకున్నారు. 
* గత కొన్నిరోజులుగా సగటున 10 వేల పాజిటివ్‌ కేసులు నమోదవుతుండటంలో స్పెయిన్‌ను వెనక్కి నెట్టిన రష్యా కరోనా కేసుల జాబితాలో రెండో స్థానానికి దూసుకొచ్చింది. దేశంలో ఇప్పటివరకు 2లక్షల 81వేల 752 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇంకా 2,11,748 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటివరకు 67,373 మంది బాధితులు కోలుకోగా, 2631 మంది మరణించారు. 
* స్పెయిన్‌లో ఇప్పటివరకు 2,77,719 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవగా, 1,95,945 మంది బాధితులు కోలుకున్నారు. మరో 54,124 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. దేశంలో ఇప్పటివకు ఈ వైరస్‌బారిన పడిన 27,650 మంది మరణించారు. 
* యూకేలో 2,43,695 కరోనా కేసులు నమోదవగా, 34,636 మంది మరణించారు. 
* దక్షిణ అమెరికా దేశమైన బ్రెజిల్‌లో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తున్నది. దేశంలో ఇప్పటివరకు 2,41,080 పాజిటివ్‌ కేసులు నమోదవగా, 16,118 మంది మరణించారు. మొత్తం నమోదైన పాజిటివ్‌ కేసుల్లో 1,30,840 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 94,122 మంది బాధితులు కోలుకున్నారు. 
* కరోనా కేసుల పరంగా బ్రెజిల్‌ త్వరలో యూకేను వెనక్కి నెట్టే అవకాశం ఉంది.

Read: కరోనా నివారణకు ‘అశ్వగంధ’ ఔషధం!