బిగ్ బ్రేకింగ్ : భారత్ లో కరోనా మృతులు 10

  • Published By: madhu ,Published On : March 24, 2020 / 03:42 AM IST
బిగ్ బ్రేకింగ్ : భారత్ లో కరోనా మృతులు 10

భారత్ ను కరోనా భయపెడుతోంది. వైరస్ బారిన పడి వారిన సంఖ్య క్రమక్రమంగా పెరుగుతున్నాయి. చైనా నుంచి వచ్చిన ఈ వైరస్ ప్రపంచ దేశాలకు విస్తరిస్తోంది. వేలాదిగా చనిపోతున్నారు. దీంతో దేశాలు అలర్ట్ అయ్యాయి. నిబంధనలు, కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి. భారత దేశంలో ఇప్పటి వరకు 10 మంది చనిపోయారు. మొత్తం 10 వేల 499 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ప్రజలు తీవ్ర భయాందోనళలకు గురవుతున్నారు. 

ప్రధానంగా మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లో ఈ మహమ్మారి విజృంభిస్తోంది. అధికంగా కేసులు నమోదవుతున్నాయి. కేరళలో మొదటి కేసు నమోదైన సంగతి తెలిసిందే. దీంతో ఆయా రాష్ట్రాల నుంచి వచ్చే వారికి పూర్తి నిఘా పెట్టారు. సరిహద్దులు మూసివేస్తున్నారు. 

* ప్రపంచ వ్యాప్తంగా కరోనా కల్లోలం సృష్టిస్తోంది. 16 వేల 524 మంది బలయ్యారు. 3 లక్షల 79 వేల 080 మందికి ఈ వైరస్ సోకింది. 12 వేల 062 మందికి సీరియస్ గా ఉండగా…1, 02, 423 మంది కోలుకున్నారు. మొత్తం 195 దేశాకు వైరస్ విస్తరించింది. 

* అధికంగా ఇటలీలో 6 వేల 077 మంది బలయ్యారు. చైనాలో 3, 277, స్పెయిన్ లో 2, 311, ఇరాన్ లో 1, 812, ఫ్రాన్స్ లో 860 మంది మృతి చెందారు. యూఎస్ఏ లో 553, యూకే లో 335, నెదర్లాండ్స్ లో 213, సౌత్ కొరియా లో 120 మంది బలయ్యారు. 

* కరోనా వైరస్ పై ప్రపంచ ఆరోగ్య సంస్థ దేశాలకు హెచ్చరికలు జారీ చేసింది. వైరస్ పై అప్రమత్తంగా ఉండాలని, నిర్లక్ష్యంగా ఉంటే భారీ పరిణామాలు చవి చూడాల్సి వస్తుందని హెచ్చరించింది. 

Read More : ఇక హైదరాబాద్‌లోనే కరోనా టెస్టులు